కేవలం ఆటకే పరిమితం కాదు.. బిజినెస్‌మేన్‌లుగానూ తాము రాణించగలం అని ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు నిరూపించుకున్నారు. ముఖ్యంగా క్రికెటర్లు.. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, దిగ్గజ ప్లేయర్ సచిన్ టెండుల్కర్.. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు. ఇటీవలే సురేశ్ రైనా సైతం వ్యాపారవేత్తగా అవతారమెత్తాడు.
మరోవైపు.. సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి మాజీ బ్యాటర్లకు వ్యాపారం పెద్దగా కలిసిరాలేదు. ఇంతకీ ఈ క్రికెట్ వీరులు చేస్తున్న వ్యాపారాలేంటో తెలుసా?! ఆ వివరాలు సంక్షిప్తంగా..
ఎంఎస్ ధోని: మహేంద్ర సింగ్ ధోనీ, భార్య సాక్షి సింగ్ ధోనీతో కలసి ‘ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్’ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించాడు.
విరాట్ కోహ్లీ:. ఇటీవలే జిమ్ కమ్ ఫిట్‌నెస్ సెంటర్ల నిర్వహణ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.
యువరాజ్ సింగ్: ఈ సిక్సర్ల వీరుడికి బ్యూటీ అండ్ వెల్‌నెస్ స్టార్టప్ ‘వ్యోమో’లో వాటాలున్నాయి.
రాబిన్ ఊతప్ప: ‘ఐ టిఫిన్’ అనే ఫుట్ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టాడు.
జహీర్‌ఖాన్, హర్భజన్ సింగ్‌లకు రెస్టారెంట్ వ్యాపారాలున్నాయి.
సురేశ్ రైనాకు ఆమ్‌స్టర్‌డామ్‌లో ‘రైనా’ అనే రెస్టారెంట్ ఉంది.
ఫెయిల్యూర్స్ కూడా..
మైదానంలో బ్యాట్‌తో మెరుపులు మెరిపించిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వ్యాపారంలో మాత్రం గాడ్ ఆఫ్ బిజినెస్ కాలేకపోయాడు. ముంబైలో ‘టెండూల్కర్స్’ రెస్టారెంట్, ‘సచిన్స్’ కేఫ్‌లను ప్రారంభించి లాభాలు పండించలేక మూసివేశాడు.
అదే విధంగా బెంగాలీ దాదా గంగూలీ తెరచిన ‘సౌరభ్స్’ రెస్టారెంట్, వీరేంద్ర సెహ్వాగ్ ‘వీరూ’ రెస్టారెంట్‌లు మూతపడ్డాయి. ఈ కొన్ని ఫెయిల్యూర్స్‌ని పక్కన పెడితే.. చాలా మంది సెలబ్రిటీలు తమది కాని రంగాల్లోనూ అడుగుపెట్టి తమదైన సక్సెస్‌ను అందుకుంటున్న వారే. మిగిలిన వాళ్లకు ధైర్యాన్ని, ప్రేరణను ఇస్తున్నవారే!
-దీపావళి
చదవండి: WC 2023: ఇప్పుడే అంతా అయిపోలేదు.. వెస్టిండీస్ అద్భుతాలు చేయగలదు!
Comments
Please login to add a commentAdd a comment