టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భూగ్రహం మీద ప్రస్తుతం అత్యంత విలువైన క్రికెటర్ ఇతడేనంటూ టీమిండియా స్టార్లలో ఓ ఆటగాడి పేరు చెప్పాడు. డీకే చెప్పిన ఆ ప్లేయర్ రన్‌మెషీన్ విరాట్ కోహ్లినో లేదంటే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మనో కానే కాదు! మరెవరు?..
దినేశ్ కార్తిక్ ప్రస్తుతం ఐపీఎల్-2024లో బిజీగా ఉన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగి ఫినిషర్‌గా తన బాధ్యతలు నెరవేరుస్తున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. ఇక ఇప్పటి వరకు తాజా ఎడిషన్లో ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లో డీకే 90 పరుగులు చేశాడు.
తదుపరి ముంబై ఇండియన్స్ ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా డీకే మళ్లీ గురువారం బరిలో దిగనున్నాడు. ముంబైలోని వాంఖడే వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఇదిలా ఉంటే.. కేవలం ఆటగాడినే కాకుండా కామెంటేటర్‌గానూ దినేశ్ కార్తిక్ రాణిస్తున్న విషయం తెలిసిందే.
భూగ్రహం మొత్తంమీద అత్యంత విలువైన క్రికెటర్ అతడే
ఈ నేపథ్యంలో నాసిర్ హుసేన్, మైఖేల్ అథెర్టన్‌లతో కలిసి డీకే స్కై స్పోర్ట్స్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మోస్ట్ వాల్యూబుల్ క్రికెటర్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘నిజం చెప్పాలంటే అతడిలా మూడు ఫార్మాట్లలో ప్రత్యర్థులపై ఆధిపత్యం కనబరుస్తున్న మరొక ఆటగాడు లేడంటే అతిశయోక్తి కాదు.
అతడి సత్తా అలాంటిది. కాబట్టి ప్రస్తుతం ఈ భూగ్రహం మొత్తంమీద అత్యంత విలువైన క్రికెటర్ అతడే. ఎందుకంటే.. మూడు ఫార్మాట్లలోనూ అతడు సమర్థవంతంగా ఆడుతున్నాడు.
వేరే ఆటగాడికి లేని నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నాడు. అతడు బరిలో ఉంటే ప్రత్యర్థులు వణికిపోవాల్సిందే’’ అంటూ డీకే.. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా పేరు చెప్పాడు. తన దృష్టిలో ప్రస్తుతం బుమ్రా మాత్రం ఈ ప్రపంచం మొత్తం మీద విలువైన క్రికెటర్ అని పేర్కొన్నాడు.
కాగా భారత జట్టు ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు. ఇక గురువారం ముంబై- ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా బుమ్రా- డీకే ఎదురుపడే అవకాశం ఉంది.
చదవండి: T20 WC: హార్దిక్, రాహుల్‌కు నో ఛాన్స్.. ఆ ముగ్గురూ ఫిక్స్!
Comments
Please login to add a commentAdd a comment