
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి ఆటతోనే కాదు తన చురుకుదనంతో అభిమానులను ఫిదా చేస్తూ ఉంటాడు. క్రీజులో దిగగానే భారీ షాట్లతో విరుచుకుపడగల ఈ రన్ మెషీన్.. మైదానంలో తన చేష్టలతోనూ వినోదం పంచుతూ ఉంటాడు.
అదే విధంగా.. సహచర ఆటగాళ్లతోనూ సరదాగా ఉంటూ తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదభరింతగా మారుస్తాడు. తాజాగా ఆర్సీబీ షేర్ చేసిన ఓ వీడియో ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది.
తోటి ప్లేయర్ దినేశ్ కార్తిక్ అడిగిన ప్రశ్నలకు కోహ్లి ఊహించని సమాధానమివ్వడమే గాకుండా.. మళ్లీ అతడిని మాట్లాడకుండా చేశాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఐపీఎల్-2024లో మ్యాచ్‌ల నుంచి విరామం దొరికిన సమయంలో ఆర్సీబీ తమ ఆటగాళ్లతో పలు ఆసక్తికర వీడియోలు రూపొందిస్తోంది.
ఈ క్రమంలో.. ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఉండగా... కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, పేసర్ మహ్మద్ సిరాజ్ తదితరులతో కలిసి కోహ్లి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్‌లో పాల్గొన్నాడు.
ఇంకెవరు నీ భార్యనే!
ఇందులో భాగంగా.. డీకే ముందుగా.. ‘‘క్రికెటర్ కాకుండా నా ఫేవరెట్ ప్లేయర్ ఎవరో చెప్పగలరా?’’ అని అడగ్గా.. కోహ్లి వెంటనే తడుముకోకుండా .. ‘‘నీ భార్య’’ అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో క్షణంపాటు ఆశ్చర్యంలో మునిగిన డీకే.. ‘‘అవును.. సరైన సమాధానం.. కానీ నిజానికి నా మనసులో వేరే పేరు అనుకున్నా’’ అన్నాడు. డీకే అలా అనగానే అక్కడ నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో కోహ్లి ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది. మీరూ ఓ లుక్కేయండి..
మోసం చేసిన మొదటి భార్య?
కాగా దినేశ్ కార్తిక్ భార్య పేరు దీపికా పళ్లికల్. ఆమె స్వ్కాష్ ప్లేయర్. భారత్ తరఫున అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించారు. అయితే, దీపికా కంటే ముందు డీకే నికితా వంజరాను పెళ్లాడాడు. కానీ ఆమె డీకేతో వివాహ బంధంలో ఉండగానే భర్త స్నేహితుడు, టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ విజయ్‌తో సాన్నిహిత్యం పెంచుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో డీకే ఆమెకు విడాకులివ్వగా.. మురళీ విజయ్‌ను పెళ్లాడింది. తర్వాత డీకే దీపికాను పెళ్లి చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో కోహ్లి బ్యాటర్‌గా రాణిస్తున్నా ఆర్సీబీ చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి గెలిచి పట్టికలో పదో స్థానంలో ఉంది.
అయితే, కోహ్లి మాత్రం 361 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతానికి తన వద్ద పెట్టుకున్నాడు. మరోవైపు.. దినేశ్ కార్తిక్ సైతం జట్టు కష్టాల్లో ఉన్నపుడు బ్యాట్ ఝులిపిస్తూనే ఉన్నాడు. అయినా ఫలితం మాత్రం ఉండటం లేదు.
Virat Kohli - the legend. 🤣👌 pic.twitter.com/1TMIPxEQT2
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2024
Comments
Please login to add a commentAdd a comment