ఐపీఎల్-2025 నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఈసారి తమ పేస్ దళాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మెగా వేలానికి ముందే యశ్ దయాళ్‌ను రిటైన్ చేసుకున్న ఆర్సీబీ.. వేలంలో భాగంగా టీమిండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్‌ను సొంతం చేసుకుంది. ఈ వెటరన్ పేసర్ కోసం ఏకంగా రూ. 10.75 కోట్లు ఖర్చు చేసింది.
రిటెన్షన్స్ సమయంలో టీమిండియా ప్రస్తుత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను వదిలేసిన తర్వాత.. ఆర్సీబీ ఈ మేర అతడి స్థానాన్ని సీనియర్‌తో భర్తీ చేసుకుంది. ఈ నేపథ్యంలో భువీ గురించి ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో భాగమైన దినేశ్ కార్తిక్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి.
అతడు బెస్ట్ టీ20 బౌలర్
ఆర్సీబీ ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్, మొ బొబాట్, ఓంకార్ సాల్వీలతో డీకే మాట్లాడుతూ.. ‘‘బుమ్రా తర్వాత.. ఇప్పటికీ తన ప్రభావం చూపగలుగుతున్న అత్యుత్తమ బౌలర్ ఎవరైనా ఉన్నారా అంటే.. భువనేశ్వర్ కుమార్ పేరు చెబుతాను. అతడు బెస్ట్ టీ20 బౌలర్’’ అని ప్రశంసలు కురిపించాడు.
అదే విధంగా.. కుర్ర పేసర్ రసీఖ్ సలాం గురించి ప్రస్తావనకు రాగా.. 24 ఏళ్ల ఈ ఆటగాడి నైపుణ్యాలు అద్భుతమని డీకే కొనియాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. అభిమానులను ఆకర్షిస్తోంది.
భీకర ఫామ్‌లో భువీ
భువనేశ్వర్ కుమార్ టీ20 ఫార్మాట్లో ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ స్వింగ్ సుల్తాన్.. ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి పదకొండు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది.
ఇక భువీ ఈ టోర్నీలో ఇప్పటి వరకు సగటు 12.90తో ఎకానమీ రేటు 5.64గా నమోదు చేయడం విశేషం. అంతేకాదు సారథిగానూ జట్టును విజయపథంలో నడిపి క్వార్టర్ ఫైనల్‌లో నిలిపి.. సెమీస్ రేసులోకి తెచ్చాడు.
ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టు
విరాట్ కోహ్లి (రూ. 21 కోట్లు)
రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు)
యశ్ దయాళ్ (రూ. 5 కోట్లు)
జోష్ హాజల్‌వుడ్ (రూ.12.50 కోట్లు)
ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు)
జితేశ్ శర్మ (రూ.11 కోట్లు)
భువనేశ్వర్ కుమార్ (రూ.10.75 కోట్లు)
లియామ్ లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు)
రసిఖ్ ధార్ (రూ.6 కోట్లు)
కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు)
టిమ్ డేవిడ్ (రూ. 3 కోట్లు)
జాకబ్ బెథెల్ (రూ. 2.60 కోట్లు)
సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు)
దేవ్‌దత్ పడిక్కల్ (రూ. 2 కోట్లు)
తుషార (రూ. 1.60 కోట్లు)
రొమరియో షెఫర్డ్ (రూ. 1.50 కోట్లు
లుంగి ఇన్‌గిడి (రూ. 1 కోటి)
స్వప్నిల్ సింగ్ (రూ.50 లక్షలు)
మనోజ్ (రూ. 30 లక్షలు)
మోహిత్ రాఠి (రూ. 30 లక్షలు)
అభినందన్ (రూ. 30 లక్షలు)
స్వస్తిక్ చికార (రూ. 30 లక్షలు) .
చదవండి: కెప్టెన్ ఫామ్‌లో లేకుంటే కష్టమే.. రోహిత్ ఇకనైనా..: ఛతేశ్వర్ పుజారా
Comments
Please login to add a commentAdd a comment