
గిన్నిస్ రికార్డు క్యాచ్!
లార్డ్స్:దాదాపు దశాబ్దం క్రితం క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసీర్ హుస్సేన్ ఇంకా ఆటలోని మజాను ఆస్వాదిస్తునే ఉన్నాడు. మనలో సత్తా ఉండాలే కానీ, రికార్డులు బద్ధలు కొట్టడానికి వయసుతో సంబంధం లేదని 48 ఏళ్ల హుస్సేన్ నిరూపించాడు. తాజాగా అత్యంత ఎత్తు నుంచి వచ్చిన ఒక క్యాచ్ను పట్టుకుని గిన్నిస్ రికార్డు బుక్లో స్థానం సంపాదించాడు. లార్డ్స్ మైదానంలో బ్యాట్ కేమ్ డ్రోన్ ద్వారా అత్యంత ఎత్తు నుంచి అతి వేగంగా వచ్చిన బంతిని అందుకుని గిన్నిస్ లో స్థానం దక్కించుకున్నాడు.
ఈ పోటిలో భాగంగా చేతికి వికెట్ కీపింగ్ గ్లోవ్స్ తొడుక్కుని సిద్ధమైన హుస్సేన్.. 150 అడుగుల ఎత్తు నుంచి వదిల్ని బంతిని పట్టుకుని రికార్డు సాధించాడు. అంతకుముందు 100 అడుగుల ఎత్తు నుంచి 120 కి.మీ వేగంతో వచ్చిన బంతిని హుస్సేన్ తన మొదటి ప్రయత్నంలోనే పట్టుకున్నాడు. అయితే దానికి సంతృప్తి చెందని హుస్సేన్.. మరికొంత ఎత్తులో బంతిని వదలమని చెప్పాడు. దీనిలో భాగంగా 150 అడుగుల ఎత్తు నుంచి బంతిని అందుకుని గిన్నిస్ బుక్లో స్థానం దక్కించుకున్నాడు. కాగా, మూడో ప్రయత్నంలో 400 అడుగుల ఎత్తు నుంచి బంతిని అందుకోవడంలో హుస్సేన్ విఫలమయ్యాడు. బంతిని పై నుంచి డ్రోన్ ద్వారా విసిరే ఈ పోటీకి100 అడుగుల కనీస ఎత్తును నిర్ణయించారు. 2004లో టెస్టు కెరీర్కు గుడ్ బై చెప్పిన హుస్సేన్..ప్రస్తుతం వ్యాఖ్యాతగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 96 టెస్టులు ఆడిన హుస్సేన్ 14 టెస్టులు, 33 హాఫ్ సెంచరీలు సాధించాడు. హుస్సేన్ తన అంతర్జాతీయ కెరీర్లో 107 క్యాచ్లను అందుకోవడం విశేషం.