
కట్నం వేధింపులతో బాలింత హత్య
కామేపల్లి (ఖమ్మం) : కట్నం వేధింపులతో బాలింతను హత్య చేసిన వ్యక్తి ఇంటి ముందు మృతదేహంతో బంధువులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవిందరాల గ్రామానికి చెందిన నెహ్రూ(26), పద్మ(22) లు నాలుగేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో నివాసముంటున్నారు.
ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా నెహ్రూ కట్నం తీసుకు రావల్సిందిగా పద్మను వేధిస్తున్నాడు. మూడు రోజుల క్రితం పద్మ గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పద్మ బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి నెహ్రూ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. కాగా.. మృతురాలికి రెండు నెలల పాప ఉంది.