వివరాలు తెలుసుకుంటున్న ఏసీపీ నరేష్‌రెడ్డి.
కామేపల్లి : భూవివాదాలు.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఓ వ్యక్తిని, అతడి సమీప బంధువే హత్య చేశాడు. కామేపల్లి సీఐ యు.సాంబరాజు తెలిపిన వివరాలు...
జాస్తిపల్లి గ్రామస్తుడు చల్లా వెంకన్న(50) దం పతులు ఆదివారం రాత్రి తన ఇంటి ఆరుబయట పడుకున్నడు.
తెల్లవారుజామున, వెంకన్నపై సమీప బంధువులు కోట కత్తితో దాడికి దిగారు. వెంకన్న భార్య గమనించి గట్టిగా కేకలు వేయడంతో వారు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన వెంకన్న, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
భూతగాదాల కారణంగానే తన భర్తను సమీప బంధువులు చంపారని వెంకన్న భార్య వెంటకమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వవైద్యశాలకు తరలించారు. కేసును సీఐ సాంబరాజు దర్యాప్తు చేస్తున్నారు.
కఠినంగా శిక్షిస్తాం
వెంకన్న హంతకులను కఠినంగా శిక్షిస్తామని ఖమ్మంరూరల్ ఏసీపీ నరేష్‌రెడ్డి చెప్పారు. జాస్తిపల్లి గ్రామాన్ని సందర్శించారు. వెంకన్న భార్య వెంకటమ్మ నుంచి హత్య కారణాలను తెలుసుకున్నారు. ఆధారాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment