పామాయిల్ అనేది పామ్ పండ్ల నుంచి తీసే ఒక రకమైన కూరగాయ నూనె ఇది. దీన్ని ప్రాసెసింగ్ చేసే ఆహారపదార్థాల్లోనూ, సౌందర్య సాధనాలు, గృహోపకరణాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. తక్కువ ధరలోనే లభించే నూనె కావడంతో చాలామంది దీన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అయితే పామాయిల్ ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతుంటారు. అదీగాక ఈ పామాయిల్ చెట్ల పెంపకం అటవీ నిర్మూలన, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు వంటి పర్యావరణ నష్టాలతో ముడిపడి ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అసలు నిజంగానే ఈ పామాయిల్ ఆరోగ్యానికి మంచిది కాదా? ఎందువల్ల? తదితరాల గురించి సవివరంగా చూద్దాం.
ఎలా ఆరోగ్యానికి హానికరం అంటే..
ఇందులో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి సుమారు 50% వరకు ఉంటాయి. అందువల్ల దీన్ని అధికంగా ఉపయోగిస్తే శరీరంలో ఎల్‌డీఎల్ అనే చెడు కొలస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ప్రాసెస్ చేసిన పామాయిల్‌లో సంభావ్య ట్రాన్స్‌ఫ్యాట్స్‌లు ఏర్పడతాయి. ఇవి గుండెజబ్బులు, మంట, ఇన్సులిన్ నిరోధకతతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
అంతేగాదు అధిక ఉష్ణోగ్రతల వద్ద ప్రాసెస్ చేయడం వల్ల ఆ ఆయిల్‌లో ఆరోగ్యానికి హానికరమైన కలుషితాలు ఉత్పత్తి అవుతాయి. ఈ సమ్మేళనాలు కేన్సర్ కలిగించేవని పరిశోధనల్లో తేలిందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు జంతు అధ్యయనంలో మూత్రపిండాలు, కాలేయం సంబంధ సమస్యలను కలిగిస్తుందని తేలిందని వెల్లడించారు.
కొన్ని అధ్యయనాల్లో డీప్ ఫ్రైడ్ ఫుడ్స్‌లో ఈ పామాయిల్ శరీరంలో మంటను పెంచుతుందని తేలింది కూడా. దీర్ఘకాలిక మంట అనేది గుండె జబ్బులు, మధుమేహం, కేన్సర్‌లతో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
పామాయిల్‌ను కలిగి ఉండే ఆహారాలు తరుచుగా ప్రాసెస్ చేసినవి, కేలరీలు దట్టమైనవి. అందువల్ల తరుచుగా ఇవి తినడం వల్ల బరువు పెరిగి ఊబకాయానికి దారితీస్తుంది. పైగా టైప్ 2 మధుమేహం, గుండెజబ్బులు, కేన్సర్ వంటి దీర్ఘకాలికి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అలాగే పామాయిల్ ఉత్పత్తి ప్రక్రియలో పురుగుమందుల అవశేషాలు, ఇతర పర్యావరణ కలుషితాలు కలిగి ఉండవచ్చు. ఇది ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుంది.
ముడి పామాయిల్‌లో విటమిన్ ఈ, బీటా కెరోటిన్ వంటి ప్రయోజనకరమైన పోషకాలు ఉంటాయి. అయినప్పటికీ ఆహార ఉత్పత్తులలో ఉపయోగించే చాలా పామాయిల్ శుద్ధి చేయబడిందే. దీనిలో ప్రయోజనకరమైన పోషకాలు ఉండనే ఉండవని చెబుతున్నారు.
పామాయిల్ మితంగా వినియోగిస్తే సమతుల్య ఆహారంలో భాగం కావచ్చు. మంచి ప్రయోజనాలను పొందగలుగుతారని చెబుతున్నారు నిపుణులు. అయితే ఏదీఏమైనా పామాయిల్ కంటే ఆలివ్, కొబ్బరి లేదా అవకాడో వంటి ఆరోగ్యకరమైన వంట నూనెలకే ప్రాధాన్యత ఇవ్వమని సూచిస్తున్నారు నిపుణులు.
(చదవండి: పీసీఓసీ ఉంటే పాల ఉత్పత్తులు నివారించాలా..?)
Comments
Please login to add a commentAdd a comment