జమ్మూకశ్మీర్లో మంగళవారం ఉదయం మరోసారి అల్లర్లు చెలరేగాయి. బందిపూరా, బిజ్హీహరా ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం భద్రతా దళాలకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, సుమారు 20మంది గాయపడ్డారు. జూన్ నుంచి కశ్మీర్ లోయలో చెలరేగిన హింసలో ఇప్పటివరకూ మృతి చెందినవారి సంఖ్య 80కి చేరింది.