బూర్గంపాడు మండల సమీపంలో గురువారం గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొంది.
బూర్గంపాడు (ఖమ్మం జిల్లా) : బూర్గంపాడు మండల సమీపంలో గురువారం గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడకికక్కడే మృతిచెందాడు. మృతుడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వెంకన్నబాబుగా గుర్తించారు.
వెంకన్న కోకోకోలా కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.