ప్రకాశం జిల్లాలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
పర్చూరు: ప్రకాశం జిల్లాలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పర్చూరు సబ్‌స్టేషన్ సమీపంలో ఆటో ఢీకొని ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. అన్నంభొట్లవారిపాలెంకు చెందిన కరణం వీరభద్రరావు (51) బైక్‌పై పర్చూరు వైపు వెళుతున్నాడు. సబ్‌స్టేషన్ సమీపంలో టాటా ఏస్ ఆటో.. లారీని తప్పించోయి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరభద్రరావుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.