ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం | Fire breaks out in the medicines dept of a Govt hospital in Murshidabad | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

Published Sat, Aug 27 2016 1:44 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

కిటికీల్లోంచి బయటకు వస్తున్న రోగులు - Sakshi

కిటికీల్లోంచి బయటకు వస్తున్న రోగులు

ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ ప్రభుత్వాసుపత్రిలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని మందుల విభాగంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు భయభ్రాంతులకు లోనయ్యారు. పలువురు ఆసుపత్రి కిటికీ అద్దాలను పగులగొట్టి బయటపడ్డారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement