నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం చౌరస్తాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది.
వనస్థలిపురం (హైదరాబాద్) : నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం చౌరస్తాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. బైక్ పై వెళ్తున్న దంపతులపైకి వెనుక నుంచి వచ్చిన లారీ దూసుకెళ్లింది. దీంతో ద్విచక్రవాహనం పై వెనుక కూర్చుని ఉన్న భార్య మృతిచెందగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.