టిప్పర్, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒక విద్యార్థి చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది.
శంషాబాద్ (రంగారెడ్డి) : టిప్పర్, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒక విద్యార్థి చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. శంషాబాద్ మండలం అవుటర్ సర్వీస్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. హిమాయత్‌సాగర్ నుంచి వస్తున్న బుల్లెట్ బైక్ ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను హుడా కాలనీ సమీపంలో ఢీకొట్టింది.
ఈ ఘటనలో బుల్లెట్‌పై ఉన్న శంషాబాద్‌కు చెందిన సౌమిత్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. వెనుక కూర్చున్న సందీప్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సందీప్ స్థానిక కళాశాలలో ఎంబీఏ చదువుతుండగా.. సౌమిత్ రెడ్డి చెన్నైలో బీటెక్ చేస్తున్నాడు. అక్కడ వరదలు రావటంతో ఇటీవలే శంషాబాద్ వచ్చాడు.