డ్రైవర్ నిర్లక్ష్యానికి ప్రయాణికుడు బలి
ఏలూరు : డ్రైవర్ నిర్లక్షానికి ఓ ప్రయాణికుడు నిండు ప్రాణం బలైంది. సోమవారం ఉదయం ఏలూరు మండలం మల్కాపురం ఆటోనగర్ వద్ద ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీను ఆర్టీసి బస్సు ఢీ కొనడంతో ప్రమాదంలో పాలకొల్లు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన జెడ్డు రత్తయ్య(55) మృతి చెందాడు. కండక్టర్‌తో పాటు మరో నలుగురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. గన్నవరం డిపోకు చెందిన ఏపీ 16 జెడ్ 0063 నెంబర్ గల బస్సు గోపాలపురంకు చెందిన 8 మంది తీర్ధ యాత్రికులు ఉన్న ప్రయాణికులతో ద్వారకాతిరుమల వెళుతోంది. ఉదయం 10 గంటలకు ఆశ్రం ఆసుపత్రి వద్ద ఏలూరు రోడ్డుపై నిలిచి ఉన్న ఏపీ16, 6955 నెంబర్ లారీని బస్సు డ్రైవర్ డీ కొట్టాడు.
దీంతో బస్సులో కండక్టర్ వైపు కూర్చున్న ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో యాత్ర బందంలోని సభ్యుడైన రత్తయ్య మతి చెందగా ఆయన తమ్ముడు ముత్తయ్య(45)కు చేయి విరిగిపోయింది. మరొక యాత్రికుడు తోట సూరిబాబుకు గాయాలయ్యాయి. మనవుడు పుట్టినరోజు వేడుక కోసం భీమడోలులో అల్లుడు ఇంటికి వెళుతున్న హనుమాన్ నగర్‌కు చెందిన టి జయలక్ష్మీ, గోపాలపురంకు చెందిన లేడీ కండక్టర్ ఎస్ నాగలక్ష్మీతో పాటు మరో ప్రయాణికుడు యాండ్రపు దుర్గారావు గాయపడ్డారు. వీరికి ఆశ్రం ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఏలూరు ఆర్టీసీ డిపో సీటీఎం ఎస్ మురళీకష్ణ సంఘటన వద్దకు చేరి పరిస్దితి సమీక్షించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పలువురు ప్రయాణికులు చెప్పారు.