విజయనగరం : ఆర్టీసీ బస్సు ఢీకొని రోడ్డు దాటుతున్న వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన విజయనగరం మండలం వేణుగోపాలపురం గ్రామ శివారులో ఆదివారం జరిగింది. ఒంటిగడ్డ గ్రామానికి చెందిన నరవ తాత(50) రోడ్డు దాటుతుండగా.. పాలకొండ నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.