కారు ఢీకొని రైతు మృతి
గుర్తుతెలియని కారు ఢీకొని రైతు మృతి చెందాడు. జాతీయ రహదారిపై మూలపాడు గ్రామం వద్ద ఈసంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కాకి బాబూరావు(55) సైకిల్‌పై పొలం వెళ్తుండగా గుర్తు తెలియని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్‌పై ఉన్న బాబూరావు సుమారు 5మీటర్ల ఎత్తున ఎగిరి రోడ్డు పక్కన ర్యాంపుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
మూలపాడు(ఇబ్రహీంపట్నం) :
గుర్తుతెలియని కారు ఢీకొని రైతు మృతి చెందాడు. జాతీయ రహదారిపై మూలపాడు గ్రామం వద్ద ఈసంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కాకి బాబూరావు(55) సైకిల్‌పై పొలం వెళ్తుండగా గుర్తు తెలియని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్‌పై ఉన్న బాబూరావు సుమారు 5మీటర్ల ఎత్తున ఎగిరి రోడ్డు పక్కన ర్యాంపుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు. ఎస్‌ఐ కృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద స్థలంలో లభించిన కారు రిజిస్ట్రేçషన్ నంబర్ బోర్డును స్వాధీనం చేసుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ నివాళి
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్రఅధికార ప్రతినిధి జోగి రమేష్ రోడ్లు ప్రమాదంలో మరణించిన కాకి బాబూరావు మృతదేహాన్ని సందర్శించారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ బొమ్మసాని వెంకట చలపతి, పార్టీ నేత మేడపాటి నాగిరెడ్డి ఉన్నారు.
27ఎంవైఎంఐఆర్02: మూలపాడు వద్ద కారుప్రమాదంలో రోడ్డు ర్యాంపు పక్కన మరణించిన కాకి బాబూరావు మృతదేహం