ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది.
పిడుగురాళ్ల (గుంటూరు): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల శివారులోని పంతులుగారి మిల్లు సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌కు చెందిన దంపతులు కారులో గుంటూరు వెళ్తున్న క్రమంలో గుంటూరు నుంచి పిడుగురాళ్లకు వెళ్తున్న వీఆర్‌ఎల పార్శిల్ లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న అనురాధ(48) అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.