కూసుమంచి పట్టణంలోని నాగన్న హోటల్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి.
కూసుమంచి (ఖమ్మం) : కూసుమంచి పట్టణంలోని నాగన్న హోటల్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్ శంబోలిన్(37) మృతిచెందాడు. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన మరో లారీని స్థానిక లారీగా గుర్తించారు.
ప్రమాదంలో రామస్వామి, రాజేందర్ స్వామి అనే ఇద్దరు క్లీనర్‌లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.