హైదరాబాద్ : నగరంలో మరోసారి స్వైన్ ఫ్లూ కలకలం రేపింది. అనారోగ్యంతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చేరిన ముగ్గురు యువకులకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. వారిలో సుమన్(23) అనే యువకుడు చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందాడు. వినీత్(28), శ్రీనివాస్(22)ల పరిస్థితి విషమంగా ఉంది.