ఎమ్మిగనూరు: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన నర్సయ్య అనే రైతు పండిన పంటను ఇంటికి తేవడం కోసం ట్రాక్టర్‌పై కూలీలతో వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో నర్సయ్య(30) అక్కడికక్కడే మృతిచెందగా... ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.