పాములపాడు : కర్నూలు జిల్లా పాములపాడు మండలం రుద్రవరం గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జూపాడు బంగ్లా మండలం లింగాపురం గ్రామానికి చెందిన రాజు (43) సంక్రాంతి పండుగ సందర్భంగా రుద్రవరంలోని అత్తగారింటికి బైక్‌పై వెళుతున్నాడు.
అత్తగారింటికి చేరుకునేలోపే... గ్రామ శివార్లలో ఎదురుగా వచ్చిన ఓ బైక్ ఢీకొంది. ఈ ఘటనలో రాజు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మరో బైక్‌పై ప్రమాదానికి కారణమైన ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కుంట గ్రామానికి చెందిన రమేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
రెండు బైక్‌లు ఢీ: ఒకరు మృతి
Published Mon, Jan 11 2016 5:07 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement