లారీ ఢీకొని వ్యక్తి మృతి
లారీ ఢీకొని వ్యక్తి మృతి
Published Sat, Sep 17 2016 11:36 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
విజయవాడ(ఆటోనగర్) :
జవహర్ ఆటోనగర్‌లో లారీ ఢీకొని శనివారం ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కానూరు హరిజనవాడకు చెందిన డొక్కా రామమూర్తి(52) ఆటోనగర్‌లోరాడ్‌బెండింగ్ మేస్త్రీగా పనిచేస్తున్నారు. రామవరప్పాడు బల్లెంవారివీధి నుంచి ఆటోనగర్ కాటా సెంటర్‌కు బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. కిందపడిపోయిన రామమూర్తి మీదుగా లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు.రామమూర్తికి భార్య, కుమార్తె ఉన్నారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement