ఎడపల్లి : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి చెరువులో మిషన్ కాకతీయ పనులు చేపడుతుండగా శనివారం ప్రమాదవశాత్తు ఒకరు మృతి చెందారు. ఈ చెరువు కట్టకు మొరం పనులు చేస్తున్నారు. మొరం సరఫరా చేస్తున్న టిప్పర్ కట్టపై అదుపుతప్పి బోల్తా కొట్టింది.అందులో ఉన్న సబ్ కాంట్రాక్టర్ కర్రోల్ల ప్రసాద్(33) అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్‌కు నిద్ర రావడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై ఆసిఫ్ తెలిపారు.