
షికాగోలో కాల్పుల కలకలం
షికాగో(అమెరికా): షికాగో నగరంలో మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ఒకరు చనిపోగా ఆరుగురు గాయపడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వెళ్తున్న వారిపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు.
ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతోపాటు మరో ఆరుగురు గాయపడ్డారు. వారికి ఎటువంటి అపాయం లేదని వైద్యులు తెలిపారు. షికాగో పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు.