పాలకొండ: శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం జొనగ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జొనగ గ్రామానికి చెందిన సవర కడాయి(26) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తా..ఒకరి మృతి
Published Sun, Jan 3 2016 3:01 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement