దత్తిరాజేరు (విజయనగరం) : దత్తిరాజేరు మండలం చౌడంతివలస గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం బైక్‌పై వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య గొల్లు రమణమ్మ(45) అక్కడికక్కడే మృతిచెందగా..భర్తకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.