చౌటుప్పల్: నల్లగొండ జిల్లాలో కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామశివారులో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం కారు అదుపు తప్పి పల్టీలు కొట్టిడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన రఘునందన్‌రెడ్డి (46) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఆయన భార్యతోపాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి ఆరెగూడెం గ్రామం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.