సదాశివనగర్(నిజామాబాద్ జిల్లా): సదాశివనగర్ మండలం దగ్గి గ్రామం వద్ద 44వ నంబర్ జాతీయరహదారిపై ఆదివారం ఓ వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. బాధితున్ని హుటాహుటిన కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ చనిపోయాడు. మృతుడు సదాశివనగర్ మండలం భూమిపల్లి గ్రామానికి చెందిన బాలయ్యగా గుర్తించారు. ఇందల్వాయ్ నుంచి స్వగ్రామం భూమిపల్లి వస్తుండగా లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.