నంగునూరు (మెదక్) : డెంగ్యూ వ్యాధితో మెదక్ జిల్లా నంగునూరు మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు... కట్కూరి కిష్టయ్య (50) కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. సిద్ధిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్లు డెంగ్యూ వ్యాధిగా భావించి హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించడంతో ఈ నెల 3న అతన్ని నిమ్స్‌లో చేర్పించాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న కిష్టయ్య శుక్రవారం మృతి చెందాడు.