అమెరికాలో కాల్పుల కలకలం | Shooting at West Texas school, at least one dead | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పుల కలకలం

Published Thu, Sep 8 2016 9:41 PM | Last Updated on Sun, Oct 15 2017 2:30 PM

అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికాలో కాల్పుల కలకలం

టెక్సాస్: పశ్చిమ టెక్సాస్ నగరమైన ఆల్ఫైన్ లో గుర్తు తెలియని వ్యక్తి గురువారం కాల్పులకు తెగబడ్డాడు. స్థానిక హైస్కూల్ పై దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. దుండగుడు పాఠశాలలో దాగి ఉండటంతో స్కూల్ ను మూసేసివుంచినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఆల్పైన్ నగరంలోని మిగిలిన పాఠశాలలు సెలవు ప్రకటించాయి.

హైస్కూల్ పరిసర ప్రాంతాలను అదుపులోకి తీసుకున్న భద్రతాదళాలు.. ఇద్దరు దుండగులు పాఠశాల లోపల ఉన్నట్లు భావిస్తున్నారు. రెండు నుంచి మూడు సార్లు స్కూలు లోపలి నుంచి కాల్పుల శబ్దాలు వినిపించినట్లు విద్యార్ధులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement