చౌటుప్పల్: నల్గొండ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మరణించగా, భార్యకు తీవ్ర గాయలయ్యాయి. చౌటుప్పల్ మండలం మందలగూడెం గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
చౌటుప్పల్ నుంచి వేగంగా వెళ్తున్న ఓ లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లింగోజీ గూడ గ్రామానికి చెందిన కృష్ణమూర్తి(48) అక్కడికక్కడే మృతిచెందగా..ఆయన భార్య ఈశ్వరమ్మకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఈశ్వరమ్మను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.