జాలదిన్నె(అనంతపురం) : వేగంగా వెళ్తున్న పోలీస్ వాహనం(మినీ బస్సు) .. ముందు వెళ్తున్న బైక్ బ్రేక్ వేసిన విషయం గమనించకపోవడంతో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా జాలదిన్నె మండలం గుడ్డాలపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి అనంతపురం వైపు వెళ్తున్న కర్ణాటకకు చెందిన పోలీస్ వ్యాన్ గుడాలపల్లి వద్ద ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కాగా ద్విచక్రవాహనం ముందు ప్రయాణి స్తున్న ఆటో ఒక్కసారిగా పంక్చర్ కావడంతో.. బైక్‌ను సడన్‌గా ఆపాల్సి వచ్చింది. ఇది గమనించని వ్యాన్ డ్రైవర్ బైక్‌ను ఢీకొట్టడంతో.. ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యెక్ష సాక్షులు అంటున్నారు.