
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మైలార్ దేవ్‌పల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మృతుడు అత్తాపూర్‌కు చెందిన రాజుగా గుర్తించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
అత్తాపూర్ నుండి మోటార్ సైకిల్ పై చంద్రాయన్ గుట్ట వైపు రాజు అతని స్నేహితుడు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దుర్గా నగర్ చౌరస్తా వద్దకు రాగానే ముందు వెళ్తున్న బైక్‌ను లారీ ఢీకొట్టింది. గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం
Comments
Please login to add a commentAdd a comment