Mailardevpally
-
మైలార్‌దేవ్‌పల్లిలో లారీ బీభత్సం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మైలార్ దేవ్పల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మృతుడు అత్తాపూర్‌కు చెందిన రాజుగా గుర్తించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.అత్తాపూర్ నుండి మోటార్ సైకిల్ పై చంద్రాయన్ గుట్ట వైపు రాజు అతని స్నేహితుడు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దుర్గా నగర్ చౌరస్తా వద్దకు రాగానే ముందు వెళ్తున్న బైక్‌ను లారీ ఢీకొట్టింది. గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం -
భర్త, అత్తింటి వేధింపులు తాళలేక నవ వధువు కవిత ఆత్మహత్య
-
HYD: మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ డ్రగ్స్ మాఫియా కదలికలు పెరిగిపోతుండడం కలకలం రేపుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్‌ని పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా దగ్గర డ్రగ్స్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. మొత్తం 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు. స్థానికంగా జిమ్ నిర్వహించే ట్రైనర్ నితీష్, రాహుల్‌తో పాటు సోహెల్ అనే ముగ్గురిని ఈ వ్యవహారానికి సంబంధించి అరెస్ట్ చేశారు అధికారులు. జిమ్ ట్రైనరే ఈ డ్రగ్స్‌ని అమ్ముతున్నాడని తెలుసుకున్న అధికారులు.. ఆ ఇంజెక్షన్స్‌ని ఎక్కడి నుంచి తెస్తున్నారు? దీని వెనక ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరు? అనే అంశాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదీ చదవండి: నగరంలో ‘బ్లాక్మెయిల్’ విలేకరుల అరెస్ట్ -
హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లి శాస్త్రిపురంలో ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. రెండు డీసీఎంలతో పాటు గోదాంలో విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యింది. -
పెళ్లి మండపంలో షాకింగ్ ఘటన.. వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు..
మైలార్‌దేవ్‌పల్లి: మరి కొద్దిసేపట్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు...కటకటాల పాలయ్యాడు. తనను ప్రేమించి..పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ మరో యువతి పెళ్లి మండపం వద్దకు పోలీసుల్ని పంపింది. ప్రియుడ్ని అరెస్టు చేయించింది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన శుక్రవారం మైలార్‌దేవ్‌పల్లిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పి.మధు, బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మిగూడ ప్రాంతానికి చెందిన తుమ్మల పృథ్వీరాజ్ ముదిరాజ్‌కు మంచిరేవుల ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ మేరకు శుక్రవారం అజీజ్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాలులో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొద్దిసేపట్లో వివాహం జరగనుండగా..ఓ యువతి పృథ్వీరాజ్ తనను ఆరేళ్లుగా ప్రేమించి..పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసి ఫంక్షన్ హాలు వద్దకు పోలీసుల్ని పంపింది. ఈ మేరకు పోలీసులు పృథ్వీరాజ్‌ను అరెస్టు చేసి...వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కాగా పృథ్వీరాజ్ ఆస్తులపై కన్నేసిన యువతి కుటుంబ సభ్యులు తప్పుడు కేసు పెట్టి పెళ్లి ఆపించారని అతని తరపు బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు పృథ్వీరాజ్ సిద్ధపడినా కులం పేరు చెప్పి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని వారు పేర్కొన్నారు. -
కూలీ పనులకు తల్లిదండ్రులు.. బాలికకు మాయమాటలు చెప్పి..
సాక్షి, హైదరాబాద్: మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దంపతులు కొంత కాలంగా మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మిగూడ ప్రాంతంలో ఉన్న రాజీవ్‌గృహకల్పలో నివాసం ఉంటున్నారు. వీరికి 8వ తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. కుటుంబ పోషణ నిమిత్తం తల్లిదండ్రులు కులీపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. సమీపంలోని 26 సంవత్సరాల ఓ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి ఎవరూ లేని సమయంలో లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. అత్యాచారానికి గురైన బాలికకు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని చితకబాదిన టీచర్ చైతన్యపురి: నర్సరీ విద్యార్థిని క్లాస్ టీచర్ వాతలు వచ్చేలా చితకబాదిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రంగారెడ్డి తెలిపిన మేరకు..మున్సిపల్ కాలనీలో నివసించే సక్రూనాయక్, మోనికల కుమారుడు ధనుష్ (5) గణేష్‌పురి కాలనీలోని ప్రిన్స్ స్కూల్లో నర్సరీ చదువుచున్నాడు. సోమవారం అల్లరి చేస్తున్నాడని క్లాస్ టీచర్ భాను కట్టెతో ధనుష్‌ను వాతలు పడేలా కొట్టింది. ఇంటికి వెళ్లిన బాలుడికి జ్వరం వచ్చింది. ఆరా తీయగా.. టీచర్ కొట్టిందని చెప్పాడు. దీంతో ధనుష్ మేనమామ కిషోర్ పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపల్, కరెస్పాండెంట్ స్వరూపారాణిని అడిగాడు. దీంతో ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటమే కాక టీచర్ భానును సమర్థించింది. జరిగిన సంఘటనపై కుటుంబ సభ్యులు పిర్యాదు చేయగా బుధవారం ప్రిన్సిపల్ స్వరూపారాణి, టీచర్ భానుపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. చదవండి: Hyderabad: ఐటీ కారిడార్‌లో దారుణం -
మైలార్‌దేవ్‌పల్లిలోని ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
-
నిద్రిస్తున్న మహిళపై వెళ్లిన లారీ.. ‘ఇలా చావడానికే ఇక్కడకు వచ్చావా అమ్మా’
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి: పిల్లలకు భారంగా ఉండకూడదు.. నగరంలో ఏదైనా పనిచేసుకొని బతుకుదామని వచ్చిన ఆ దంపతులను విధి వెక్కిరించింది. ఉద్యోగంలో చేరిన 12 గంటలలోపే భార్యను మృత్యువు కబళించింది. నిద్రిస్తున్న మహిళపై లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కె.నర్సింహ, ఎస్ఐ శ్రీలతరెడ్డి తెలిపిన మేరకు.. వనపర్తి జిల్లా అడ్డాకూల గ్రామానికి చెందిన దంపతులు వెంకటమ్మ(55), రామస్వామి నగరంలో వాచ్‌మెన్‌గా పనిచేసేందుకు వచ్చారు. బుధవారం సాయంత్రం దుర్గానగర్ చౌరస్తాలోని ఓ వెంచర్లో వాచ్‌మెన్‌గా భార్యభర్తలు పనికి కుదిరారు. భోజనం చేసుకొని పనులు కొనసాగుతున్న ఇంట్లోనే నిద్రకు ఉపక్రమించారు. కరెంటు లేకపోవడం, దోమల బెడద తీవ్రంగా ఉండడంతో ఇంటికి సమీపంలో పడుకున్నారు. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ఓ లారీ ఇటుకలను ఆ ఇంటి వద్ద దించేందుకు వచ్చింది. డ్రైవర్ యాదగిరి.. రోడ్డుపై పడుకున్న వెంకటమ్మ, రామస్వాములను గమనించకుండా రివర్స్‌లో వచ్చాడు. ఆ సమయంలో వెంకటమ్మపైనుంచి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఇద్దరు కూతుళ్లు, కుమారుడు వచ్చి గుండెలవిసేలా రోదించారు. ఇలా చావడానికే ఇక్కడకు వచ్చావా.. అమ్మా.. అని వారు రోదించడం కంటతడిపెట్టించింది. నష్టపరిహారం అందజేత... మృతి చెందిన వెంకటమ్మ కుటుంబానికి యజమాని నష్టపరిహారం అందజేశారు. రంగారెడ్డి జిల్లా ఏఐటియూసీ నాయకుడు వనంపల్లి జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నష్టపరిహారం రెండు లక్షలను అందజేశాడు. -
పెరుగు కోసం యాక్టివాపై వెళ్లి..
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ మైనర్ విద్యార్థి మృతి చెందిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. 15 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం రాయలసీమ ప్రాంతం నుంచి వెంకటరామయ్య, అరుణ దంపతులు ఓల్డ్ కర్నూల్ రోడ్డు నేతాజీనగర్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. మేస్త్రీ పని చేస్తున్న వెంకటరామయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు వెంకటమణిదీప్ (14) స్థానిక ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న మణిదీప్ పెరుగు తీసుకురావాలని ఇంట్లో చెప్పడంతో తండ్రి యాక్టివా వాహనాన్ని తీసుకుని వెళ్లాడు. పెరుగు తీసుకుని ఇంటికి వస్తున్న క్రమంలో నేతాజీనగర్‌లోని రోడ్డు డివైడర్‌కు ఢీకొని పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి తగిలి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తెలివైన విద్యార్థిగా ఆటపాటలలో ముందుండే వాడని ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల యాజమాన్యం వెంకటమణిదీప్ మృతికి సంతాపం తెలిపి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. చదవండి: హైదరాబాద్: కుమారుడికి చిత్రహింసలు ... కాదు కిడ్నాప్ ! -
మైలార్‌దేవ్‌పల్లిలో ఘోర ప్రమాదం: ముగ్గురు దుర్మరణం
సాక్షి, రాజేంద్రనగర్: మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్లున్న ఓ లారీ వెనుక నుంచి ముగ్గరు వ్యక్తిలను ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సైబరాబాద్ అడిషనల్ డీసీపీ వెంకట్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. -
మైలార్‌దేవ్‌పల్లిలో కిడ్నాప్ కలకలం
సాక్షి, హైదరాబాద్: యువకుడి కిడ్నాప్ ఉదంతం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలవరం రేపింది. మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం.. దూద్‌బౌలి ప్రాంతానికి చెందిన అల్తాఫ్హుస్సేన్(27)కు.. మైలార్‌దేవ్‌పల్లి కింగ్స్ కాలనీకి చెందిన ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈమెకు ఇటీవల ఇదే ప్రాంతానికి చెందిన నదీంఖాన్(28)తో ఎంగేజ్మెంట్ జరిగింది. విషయం తెలుసుకున్న అల్తాఫ్హుస్సేన్ శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి నదీంఖాన్‌ను కిడ్నాప్ చేశాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న నదీమ్ విధులు ముగించుకుని రాత్రి 10.30 గంటల బైక్‌పై ఇంటికి బయలుదేరగా.. మార్గ మధ్యలో వాహనం ఆపిన అల్తాఫ్.. నదీమ్‌ను కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లాడు. స్థానికులు ఏం జరుగుతుందో అనుకునేలోపే కారు దూసుకెళ్లిపోయింది. బాధితుడి కుటుంబ సభ్యులు, మైలార్దేవుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితులు సంగారెడ్డిలో ఉన్నారని మైలార్దేవుపల్లి పోలీసులకు సమాచారం రావడంతో తెల్లవారుజామునే ఆ ప్రాంతానికి వెళ్లి అల్తాఫ్‌ను అదుపులోకి తీసుకుని నదీంఖాన్‌ను రక్షించారు. అపహరణ తరువాత కొద్ది దూరం కారులో వెళ్లి తర్వాత అల్తాఫ్ ఇంటికెళ్లిపోయాడు. నిందితులు మొదట నదీంఖాన్‌ను బీదర్‌కు తీసుకెళ్లాలనుకున్నా.. సంగారెడ్డి వరకూ వెళ్లినట్లు తెలుస్తోంది. కిడ్నాపర్లు నదీం నుంచి రూ.10వేలను తీసుకున్నారు. ( చదవండి: ప్రేయసికి నిశ్చితార్థం: అంతలోనే కిడ్నాప్ చేసిన లవర్ ) -
మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో దారుణం..
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ డివిజన్ మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. అసద్‌ఖాన్ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఇండియా ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడు అసద్‌ఖాన్ ఓ హత్య కేసులో నిందితుడని.. ప్రత్యర్థులు హతమార్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం చేరుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లో రెండు నెలలుగా వరుస హత్యలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: హైదరాబాద్‌లో బయటపడుతున్న వేల కోట్ల బ్లాక్‌మనీ నాంపల్లి హైకోర్టుకు హాజరైన విజయశాంతి -
బంధువులమంటూ వస్తారు.. బాలికను పంపించి.. ఆపై
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి(రంగారెడ్డి): బంధువుల వలే వివాహాలకు హాజరై అదును చూసి విలువైన వస్తువులు, నగదును కాజేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. వీరిలో ఆరు సంవత్సరాల బాలిక కూడా ఉంది. మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజ్ఘడ్ జిల్లాకు చెందిన ప్రశాంత్(22), శ్రావణ్(21)తోపాటు ఓ మహిళ, ఆరు సంవత్సరాల బాలికతో నెలరోజుల క్రితం నగరానికి వచ్చారు. కారును అద్దెకు తీసుకోని మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ల పరిధిలోని ఫంక్షన్‌హాల్స్‌లో జరిగే శుభకార్యాల్లో బంధువుల వలే హాజరయ్యేవారు. ఆయా శుభకార్యాల్లో బంధువులు ఇచ్చిన ఖరీదైన గిప్టులను ఎక్కడ పెట్టారో తెలిపి బాలికను పంపించే వారు. ఆడుకుంటూ వెళ్లి ఆ చిన్నారి వాటిని తీసుకువచ్చి ఆ మహిళకు అందించేది. దొంగలించిన సొత్తుతో నిమిషాల వ్యవధిలో శుభకార్యం నుంచి వెళ్లిపోయే వారు. మైలార్‌దేవ్‌పల్లితో పాటు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలా మూడు దొంగతనాలకు పాల్పడ్డారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గతనెల మూడవ వారంలో జరిగిన శుభకార్యంలో విందు నిర్వహించిన కుటుంబ సభ్యులు విలువైన వస్తువులతో పాటు నగదును ఓ బ్యాగ్‌లో వేసి స్టేజిపైనే ఉంచారు. ఈ శుభకార్యంలో పాల్గొన్న చిన్నారి చాకచక్యంగా దానిని తీసుకోని ఉడాయించింది. విందులో ఏర్పాటు చేసిన వీడియో కెమెరాలో చిన్నారి బ్యాగ్ తీసుకువెళ్లిన సంఘటన రికార్డయ్యింది. కుటుంబ సభ్యులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శంషాబాద్ ఎస్ఓటీ సహాయాన్ని కోరారు. ఆ రోజు ఫంక్షన్‌హాల్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు బయటకు వెళ్లిన వాహనాల పూర్తి వివరాలను సేకరించి బుధవారం నిందితులైన ఇద్దరు యువకులు, మహిళ, చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐ20 కారు, నాలుగు సెల్ఫోన్లు, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చదవండి: డ్యాన్సర్‌కు రూ.11.75 లక్షల టోకరా బాధితుడే నిందితుడిగా మారిన వైనం మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి -
అల్లరి చేయొద్దన్నందుకు.. ఇంట్లోకి దూరి హత్య
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి: అల్లరి చేయొద్దని వారించిన యువకుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అనంతరం భయాందోళనతో పరుగులు తీయగా ఇంట్లోకి చొరబడి కత్తిపోట్లు పొడవడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మృతుడి కుటుంబీకులు, సీఐ సత్తయ్యగౌడ్ కథనం ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధి రోషన్ కాలనీలో మహ్మద్ అబ్దుల్ ముజీబ్(28), అజర్ నివాసముంటున్నారు. ముజీబ్ క్యాబ్ డ్రైవింగ్ చేస్తూ స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. పలు ఠాణాల్లో కేసులు నమోదైన అజర్(26) ఇతరులతో గొడవలు పడుతూ ఖాళీగా తిరుగుతుండేవాడు. ముజీబ్(ఫైల్); యువకుడి మృతదేహం కొంతకాలంగా ముజీబ్ ఇంటి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద అజర్ తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి వరకు మద్యం తాగుతూ అల్లరి చేస్తున్నాడు. ఈనేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి అదేవిధంగా జరిగింది. దీంతో అల్లరి చేయొద్దని ముజీబ్ అజర్‌ను వారించాడు. తనకు చెప్పడానికి నీవెవరు అంటూ ఆగ్రహానికి గురైన అతడు ముజీబ్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో భయాందోళనకు గురైన అతడు తన స్నేహితులతో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు. ముజీబ్ ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్న అజర్ లోపలికి చొరబడి తల, ఛాతీపై నాలుగైదు కత్తిపోట్లు వేశాడు. తీవ్రంగా గాయపడిన ముజీబ్‌ను కుటుంబీకులు ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. విషయాన్ని తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు రోషన్ కాలనీకి చేరుకొని వివరాలు సేకరించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న అజర్ కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. పోకిరీగా తిరుగుతున్న అజర్ కొంతకాలంగా ముజీబ్‌తో గొడవపడుతున్నారని కుటుంబీకులు తెలిపారు. రోషన్ కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్న పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడం లేదని ఆరోపించారు. -
మాల్ ఓనర్ కీచకత్వం..తల్లి ఆత్మహత్య
-
బుగ్గిపాలైన కొబ్బరి నూనె గోదాం
సాక్షి, హైదరాబాద్: నగర శివారు మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నప్రమాదం జరిగింది. కొబ్బనినూనే డబ్బాలను నిల్వ ఉంచిన ఓ గోదాంలో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేయత్నం చేశారు. ముందు జాగ్రత్తగా సమీపంలోని ఇతర కంపెనీలను మూసివేయించారు. ఈ ఘటనలో ఎవరికైనా గాయాలైంది లేనిదీ తెలియాల్సిఉంది. -
మంటపాలైన కొబ్బరి నూనె గోదాం
-
మైలర్దేవర్పల్లి టాటానగర్‌లో అగ్ని ప్రమాదం
-
ఆ ‘మూడే’ కాల్పులకు దారితీశాయా..?
సాక్షి, హైదరాబాద్ : రియల్ ఎస్టేట్ వ్యాపారి ముస్తఫాపై కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల ఎంఐఎం నేత షానవాజ్ ఇంటిపై జరిగిన ఐటీ దాడులకు సంబంధించిన సమాచారం ముస్తఫానే ఇచ్చి ఉంటాడన్న అనుమానమే ముస్తఫాపై కాల్పు లు జరగడానికి కారణంగా పోలీసులు భావి స్తున్నారు. దీంతోపాటు మరో రెండు కారణాలు కూడా పోలీసులు చెబుతున్నారు. షాన్వాజ్ కుమారుడు జుబేర్, ముస్తఫాలు కలసి నగర శివారు ప్రాంతాల్లో మూడు ఓపెన్ లే అవుట్లు చేసి విక్రయిస్తున్నారు. ఈ ఆర్థిక విషయాల్లోనూ ముస్తఫా చేతి వాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. దీనికితోడు జుబేర్ ప్రేమించిన అమ్మాయితో ముస్తఫా సన్నిహితంగా ఉండటం కూడా కాల్పులకు దారి తీసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయాలన్నీ పోలీసు అదుపులో ఉన్న జుబేర్ స్నేహితులు విచారణలో ప్రస్తావించినట్టు తెలిసింది. చికిత్స పొందుతున్న బాధితుడు ముస్తఫా వాంగ్మూలం నమోదు చేసేందుకు ఆస్పత్రికి వెళ్లిన పోలీసులతో ఆయనేమీ మాట్లాడలేదు. అసలు ఏం జరిగిందో తర్వాత చెబుతానంటూ సైగలు చేశాడు. దీంతో ఈ కేసులో ఏ పురోగతి సాధించలేదని పోలీసులు చెబుతున్నారు. కింగ్స్ కాలనీలోని జుబేర్ కార్యాలయంలోనే కాల్పులు జరిగాయని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆదివారం మరోసా రి క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. మిగతా వారు ఎక్కడ..? జుబేర్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి జరిగిన విందులో 10 మంది వరకు పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముస్తఫాను ఐదుగురు యువకులు ఓ కారులో తీసుకొచ్చినట్లు ఆస్పత్రి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. ఆస్పత్రికి ఎంత వేగంగా వచ్చారో... అంతే వేగంగా ఆ యువకులు వెళ్ళిపోయారు. వారు ఎవరన్నది ప్రస్తుతం పోలీసులు నిర్ధారించే పనిలో పడ్డారు. ఇప్పటివరకూ తమకు ఎలాంటి సమాచారం లభ్యం కాలేదని పోలీసులు చెబుతున్నారు. -
స్నేహితుడిని పార్టీకి పిలిచి రివాల్వర్‌తో కాల్పులు
-
బర్త్‌డే.. బుల్లెట్స్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లి కింగ్స్‌కాలనీ (శాస్త్రీపురం జిల్లెలగుట్ట)లో శనివారం తెల్లవారుజామున కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. తన వ్యాపారాలపై ఆదాయపన్ను శాఖకు సమాచారమిచ్చాడనే అనుమానంతో జుబేర్ అనే రియల్టర్ ముస్తఫా అనే తన స్నేహితుడిని తుపాకీతో కాల్చాడు. పుట్టినరోజు పార్టీకి పిలిచి.. ఆ పార్టీ అయిపోయిన తర్వాత తుపాకీతో రెండు రౌండ్లు కాల్చాడు. అనంతరం ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు. కాల్పులు జరిపినట్లుగా భావిస్తున్న జుబేర్ ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ఎంఐఎం నేత, రియల్ఎస్టేట్ వ్యాపారి షానవాజ్ కుమారుడు. వ్యాపార లావాదేవీలు, అప్పుల వివాదంతోపాటు ఐటీకి సమాచారమిచ్చాడనే అనుమానాలు ఈ కాల్పుల ఘటనకు కారణాలని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటన అనంతరం గాలింపు చేపట్టిన పోలీసులు జుబేర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. పుట్టినరోజు పార్టీలో.. మొఘల్‌పురా ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ముస్తాఫా (35). శుక్రవారం రాత్రి ఓ పుట్టినరోజు పార్టీ కోసం కింగ్స్కాలనీలోని తన స్నేహితుడు, వ్యాపారి జుబేర్ వద్దకు వచ్చారు. పార్టీ చేసుకున్నారు. అయితే శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ముస్తాఫాపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముస్తాఫా ఛాతీలో బుల్లెట్ దిగడంతో కుప్పకూలిపోయాడు. అనంతరం జుబేర్‌తో పాటు తోటి స్నేహితులు ఆయనను వెంటనే బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ముస్తాఫాకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఒక బుల్లెట్‌ను వెలికితీశారని మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ వెల్లడించారు. ప్రస్తుతం ముస్తాఫా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కోలుకున్న తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాల్పుల ఘటన విషయం తెలిసిన వెంటనే పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు జుబేర్‌కు గతంలో నేరచరిత్ర ఉన్నట్లు గుర్తించారు. అతడికి, ముస్తాఫాకు మధ్య రియల్ ఎస్టేట్ గొడవలు కూడా ఉన్నట్లు తెలిసింది. తనను జుబేర్ బెదిరిస్తున్నాడని గతంలోనే ముస్తాఫా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుర్తించారు. వారి మధ్య లావాదేవీలు, వివాదాలను తేల్చేందుకు శాస్త్రీపురం జిల్లెలగుట్ట (శాస్త్రీపురం గుట్ట)పై ఉన్న జుబేర్ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో సోదాలు చేశారు. కింగ్స్ కాలనీ, శాస్త్రీపురం ప్రధాన రహదారి, జుబేర్ కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. జుబేర్, ఆయన తండ్రి షానవాజ్‌లు ఇద్దరికీ లైసెన్స్ రివాల్వర్లు ఉన్నాయి. అయితే ముస్తాఫాపై కాల్పులు జరిపింది ఈ లైసెన్స్ రివాల్వర్తోనేనా..? ఇంకేదైనా రివాల్వర్‌తో కాల్పులు జరిపారా అన్నది తేల్చాల్సి ఉంది. ఎవరీ జుబేర్, ముస్తాఫా? ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ఎంఐఎం నేత, రియల్ఎస్టేట్ వ్యాపారి షానవాజ్ కుమారుడు జుబేర్. జుబేర్ కూడా కొన్నేళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్నారు. ఇక మొఘల్‌పురా ప్రాంతానికి చెందిన ముస్తాఫా గతంలో చిన్నపాటి రియల్ ఎస్టేట్ వ్యాపారి. తర్వాతి కాలంలో జుబేర్‌తో స్నేహం ఏర్పడింది. అనంతరం ముస్తాఫా కొంతకాలంలోనే పెద్ద రియల్టర్‌గా ఎదిగారు. అప్పటినుంచి జుబేర్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తున్నాడని, ఆయన వ్యాపారాల్లో భాగస్వామిగా కూడా ఉన్నారని సమాచారం. అయితే కొంతకాలం కింద జుబేర్ కార్యాలయం, ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఐటీ శాఖకు సమాచారమిచ్చింది ముస్తాఫాయేనని జుబేర్ అనుమానించడంతో.. వారి మధ్య విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. -
బర్త్‌డే పార్టీ పేరిట ఫామ్‌హౌస్‌కు పిలిచి..
-
బర్త్‌డే పేరిట పిలిచి కాల్పులు జరిపాడు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ ఫామ్‌హౌస్‌లో శనివారం కాల్పులు చోటుచేసుకున్నాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ముస్తఫా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. భూవివాదమే ఈ కాల్పులకు కారణమని తెలుస్తోంది. పోలీసులు రంగంలోకి దిగారు. పాతబస్తీకి చెందిన జుబేర్ అనే వ్యక్తి ముస్తఫాను బర్త్‌డే పార్టీ పేరిట ఫామ్‌హౌస్‌కు పిలిచాడు. ఈ సందర్భంగా వీరి మధ్య నడుస్తున్న భూవివాదంపై గొడవ జరిగింది. దీంతో జుబేర్ తన వద్ద ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్‌తో ముస్తఫాపై కాల్పులు జరిపాడు. ముస్తఫా ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. -
డివైడర్‌ను ఢీకొన్న బైక్..ముగ్గురి మృతి
-
మైలార్‌దేవ్‌పల్లిలో భారీగా కొత్త కరెన్సీ పట్టివేత
రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లాలో భారీగా కొత్త కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ మండలం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌పరిధిలో మంగళవారం రూ.37 లక్షల కొత్త కరెన్సీని పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరెన్సీ మార్పిడికి ఈ నగదును తీసుకువచ్చి ఉంటారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మైలార్‌దేవ్‌పల్లిలో కార్డన్‌సెర్చ్
హైదరాబాద్: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్‌బోర్డ్ కాలనీలో పోలీసులు సోమవారం తెల్లవారుజామున కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగిన తనిఖీల్లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. 23 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వారు ఇక్కడ ఎక్కువగా నివసిస్తున్నారని, ఇటీవల బ్యాంకు దోపిడీ ఘటన నేపథ్యంలో ఇంటింటి తనిఖీలు నిర్వహించామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. -
మైలార్‌దేవ్‌పల్లి పాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలో మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోడౌన్లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
మైలార్‌దేవ్‌పల్లిలో పోలీసులు ముమ్మర తనిఖీలు
హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలో రాజీవ్ గృహకల్ప, పహాడీ షరీఫ్ ప్రాంతాలలో పోలీసులు ఆదివారం తెల్లవారుజాము నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 సిలిండర్లు, 4 కార్లు, 3 ఆటోలు, 17 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారందరిని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆ సోదాలలో దాదాపు 350 మంది పోలీసులు పాల్గొన్నారు.