
సాక్షి, హైదరాబాద్: నగరంలో కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ ఫామ్‌హౌస్‌లో శనివారం కాల్పులు చోటుచేసుకున్నాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ముస్తఫా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. భూవివాదమే ఈ కాల్పులకు కారణమని తెలుస్తోంది. పోలీసులు రంగంలోకి దిగారు.
పాతబస్తీకి చెందిన జుబేర్ అనే వ్యక్తి ముస్తఫాను బర్త్‌డే పార్టీ పేరిట ఫామ్‌హౌస్‌కు పిలిచాడు. ఈ సందర్భంగా వీరి మధ్య నడుస్తున్న భూవివాదంపై గొడవ జరిగింది. దీంతో జుబేర్ తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో ముస్తఫాపై కాల్పులు జరిపాడు. ముస్తఫా ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment