Telangana Crime: Huge Drug Racket Busted Ranga Reddy Mailardevpally, Details Inside - Sakshi
Sakshi News home page

రంగారెడ్డి: మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Published Mon, Jun 19 2023 12:37 PM | Last Updated on Mon, Jun 19 2023 4:45 PM

Telangana Crime: Huge Drug Racket Busted Mailardevpally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మళ్లీ డ్రగ్స్‌ మాఫియా కదలికలు పెరిగిపోతుండడం కలకలం రేపుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్‌ని పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు.

వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా దగ్గర డ్రగ్స్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. మొత్తం 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్‌లను సీజ్ చేశారు.

స్థానికంగా జిమ్ నిర్వహించే ట్రైనర్ నితీష్, రాహుల్‌తో పాటు సోహెల్‌ అనే ముగ్గురిని ఈ వ్యవహారానికి సంబంధించి అరెస్ట్ చేశారు అధికారులు. జిమ్ ట్రైనరే ఈ డ్రగ్స్‌ని అమ్ముతున్నాడని తెలుసుకున్న అధికారులు.. ఆ ఇంజెక్షన్స్‌ని ఎక్కడి నుంచి తెస్తున్నారు? దీని వెనక ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరు? అనే అంశాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి: నగరంలో ‘బ్లాక్‌మెయిల్‌’ విలేకరుల అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement