racket
-
బాబూ.. అమ్మాయి, పిల్లలు బాగున్నారు?! అలాగే కిడ్నీలు జాగ్రత్త బాబూ..!
-
కిడ్నీ రాకెట్‌పై డీఎస్పీ మహేష్ కామెంట్స్
-
కిడ్నీ రాకెట్ లో సంచలన నిజాలు
-
కిడ్నీ రాకెట్.. దారుణమైన మోసం
-
మానవ అక్రమ రవాణా ముఠా అరెస్ట్.. 11 మంది భారతీయులకు విముక్తి!
నేపాల్ పోలీసులు మానవ అక్రమ రవాణా రాకెట్‌ను ఛేదించారు. ఈ ఉదంతంలో 11 మంది భారతీయులను రక్షించడంతో పాటు ఎనిమిది మంది భారతీయ మాఫియా ముఠా సభ్యులను, వారి నేపాలీ సహచరులను అరెస్టు చేశారు. ఈ ముఠా 11 మంది భారతీయ పౌరులను అమెరికాకు పంపుతామని చెబుతూ, రెండు వారాలకు పైగా బందీలుగా ఉంచినట్లు సమాచారం. ఈ ఉదంతం బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ‘డాంకీ’ చిత్రాన్ని పోలివుండడంతో నేపాల్ పోలీసులు దీనికి 'ఆపరేషన్ డాంకీ' అనే పేరు పెట్టారు. మాఫియా నుంచి రక్షణ పొందినవారు, ఇటు వారిని ఉచ్చులో బిగించినవారు భారత్‌లోని పంజాబ్, హరియాణాలకు చెందినవారు. ఖాట్మండు జిల్లా పోలీసు రేంజ్ బృందం ఫిబ్రవరి 14 రాత్రి నుండి ఈ ఆపరేషన్ ప్రారంభించింది. తెల్లవారుజాము వరకు దాడులు కొనసాగించింది. పక్కా సమాచారం మేరకు రాటోపుల్లోని ధోబిఖోలా కారిడార్‌లోని ఒక నేపాలీ పౌరుని నివాసంపై దాడి చేసి, 11 మంది భారతీయ పౌరులను రక్షించారు. వీరిని మెక్సికో మీదుగా అమెరికాకు పంపుతామని నమ్మించి బందీలను చేశారు. ఈ మానవ అక్రమ రావాణా ముఠా ముఖ్యంగా విద్యార్థులను అమెరికాకు పంపుతామని తప్పుడు హామీలిచ్చిందని జిల్లా పోలీసు చీఫ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భూపేంద్ర బహదూర్ ఖత్రి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ముఠా సభ్యులు తాము వల వేసినవారిని ఖాట్మండుకు తీసుకు వచ్చినప్పుడు వీసా రుసుముగా ఒక్కొక్కరి నుండి రూ.45 లక్షలతో పాటు అదనంగా మరో మూడు వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసింది. నిందితులపై నేపాలీ చట్టం ప్రకారం కిడ్నాప్, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితుల్లో ఒకరు మాట్లాడుతూ.. ఆ ఏజెంట్లు తమను బందీలను చేసి, రెండు వారాలకు పైగా అద్దె ఇంట్లో ఉంచినట్లు తెలిపారు. తమను మానసికంగా, శారీరకంగా హింసించి బెదిరించారన్నారు. వారు తమకు ఇచ్చిన వీసాలు, బోర్డింగ్ పాస్‌లతో సహా అన్ని పత్రాలు నకిలీవేనని పేర్కొన్నారు. కాగా నిందితుల నుంచి పోలీసులు నకిలీ రబ్బరు స్టాంపులు, ఇతర నకిలీ పత్రాలతో పాటు బాధితుల పాస్‌పోర్ట్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్ లో డ్రగ్స్ నిర్మూలన పై స్పెషల్ డ్రైవ్
-
మెడికల్ రాకెట్ సంచలనం: నకిలీ సర్టిఫికెట్లతో సర్జరీలు, ఏడుగురి మృతి
వైద్యో నారాయణో హరిః అన్న మాటలకే కళంకం తెస్తూ రోగుల పాలిట యమకింకరులుగా మారిపోయారు ఆ నలుగురు. ఎలాంటి జాలి, దయ, పాప భీతి లేకుండా వరుసగా రోగుల్ని బలితీసుకుంది ఈ ముఠా దేశ రాజధాని నగరం నడిబొడ్డున చోటు చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ మెడికల్ రాకెట్ వ్యవహారం కలకలం రేపింది.నకిలీ సర్టిఫికెట్లతో సర్జన్లు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం సంచలనం సృష్టించింది. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని ఓ క్లినిక్‌లో శస్త్రచికిత్సలు చేయించుకున్న ఇద్దరు పేషెంట్ల మృతితో వీరి వ్యవహారం వెలుగు చూసింది. దీనికి సంబంధించి ఇద్దరు వైద్యులతో పాటు నకిలీ మహిళా సర్జన్, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌ను అరెస్ట్ చేశారు. డాక్టర్ నీరజ్ అగర్వాల్, అతని భార్య పూజా అగర్వాల్ , డాక్టర్ జస్ప్రీత్ సింగ్‌తో పాటు, మాజీ లేబొరేటరీ టెక్నీషియన్ మహేందర్ సింగ్ అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వీరి సమాచారం ప్రకారం ఫేక్ సర్టిఫికేట్లతో శస్త్ర చికిత్స చేయడంతో ఇటీవల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీరి బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసుల విచారణ చేపట్టారు. అలా మెడికల్ రాకెట్ గుట్టు రట్టయింది. 2022లో అస్గర్ అలీ గాల్‌బ్లాడర్ సమస్యతో వీరి ఆసుపత్రికి వచ్చారు. అయితే ఇతనికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ సరిగ్గా థియేటర్లోకి వెళ్లేసరికి డాక్టర్ జస్ప్రీత్ స్థానంలో పూజ ,మహేంద్ర ఉన్నారు. చివరికి ఆపరేషన్ తరువాత సరియైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్రమైన కడుపు నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే లీ ప్రాణాలు పోయాయి. ఎలాంటి అర్హత లేకుండా, కనీస వైద్య ప్రోటోకాల్స్ పాటించకుండా చాలామంది రోగులకు ఇలాంటి శస్త్రచికిత్సలు చేశారని రోగుల బంధువుల ఆరోపణలు వెల్లువెత్తాయి. 2016 నుండి అగర్వాల్ నడుపుతున్న మెడికల్ సెంటర్‌పై కనీసం తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయని దర్యాప్తులో తేలింది. వీరి నిర్లక్ష్యం కారణంగా మొత్తంగా ఏడుగురు చని పోయారు. చివరికి నవంబర్ 1 న, నలుగురు వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు విచారణలో వీరి బండారం బయట పడిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) చందన్ చౌదరి వెల్లడించారు. ఈసందర్భంగా ఈ క్లినక్‌నుంచి డాక్టర్ల సంతకాలు మాత్రమే ఉన్న ప్రిస్క్రిప్షన్ స్లిప్‌లు, టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) వివరాల రికార్డులను కూడా గుర్తించారు. వీటితోపాటు గడువు ముగిసిన సర్జికల్ బ్లేడ్లు, అనేక నిషేధిత మందులు ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు 47 బ్యాంకుల చెక్‌బుక్‌లు, పలు ఏటీఎం కార్డులు , పోస్టాఫీసు పాస్‌బుక్‌లు, ఆరు POS టెర్మినల్ క్రెడిట్ కార్డ్ మెషీన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఆస్ట్రేలియా బీచ్‌లో చంద్రయాన్-3 రాకెట్ శకలం.. ఇస్రో చీఫ్ క్లారిటీ
ఆస్ట్రేలియా బీచ్‌లో సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకువచ్చిన శకలం ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. అంతేకాకుండా దీనిపై ఓ వార్త కూడా హల్‌చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ శకలాలు చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన ఎల్వీఎం రాకెట్వని అంతా భావిస్తున్నారు. అయితే తీరంలో కనిపించిన రాకెట్ శకలంపై తాజాగా ఇస్రో చీఫ్ సోమనాథ్ స్పందించారు. తాము ఆ శకలాన్ని పరిశీలించకుండా అది తమదా కాదా అనేది చెప్పలేమన్నారు. అయితే ఆ శకలం మాత్రం కచ్చితంగా రాకెట్‌దేనని స్పష్టం చేశారు. మరో విషయం ఏమిటంటే.. అది భారత్ చెందిన రాకెట్ది కావచ్చు.. కాకపోవచ్చు అని సోమనాథ్ అభిప్రాయపడ్డారు. కాగా పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో అకస్మాత్తుగా రాకెట్ శకలాలకు సంబంధించిన వస్తువులా ఒకటి దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అంతకు మందు భారత్ చంద్రయాన్-3ను ఎల్వీఎం రాకెట్ నింగిలోకి మోసుకెళ్లిన దృశ్యాలు ఆస్ట్రేలియన్ గగనతలంలో కనిపించడంతో ఇది చంద్రయాన్‌కు సంబంధించినది వస్తువు అయ్యిండచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయంలో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా భారతీయ అంతరిక్ష సంస్థ క్లారిటీ ఇచ్చింది. చదవండి భర్తతో విడాకులు, ఇన్‌స్టా పరిచయం ప్రేమగా.. పలుమార్లు కలుసుకుని.. ఇప్పుడు ఏకంగా.. -
HYD: మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ డ్రగ్స్ మాఫియా కదలికలు పెరిగిపోతుండడం కలకలం రేపుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్‌ని పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా దగ్గర డ్రగ్స్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. మొత్తం 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు. స్థానికంగా జిమ్ నిర్వహించే ట్రైనర్ నితీష్, రాహుల్‌తో పాటు సోహెల్ అనే ముగ్గురిని ఈ వ్యవహారానికి సంబంధించి అరెస్ట్ చేశారు అధికారులు. జిమ్ ట్రైనరే ఈ డ్రగ్స్‌ని అమ్ముతున్నాడని తెలుసుకున్న అధికారులు.. ఆ ఇంజెక్షన్స్‌ని ఎక్కడి నుంచి తెస్తున్నారు? దీని వెనక ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరు? అనే అంశాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదీ చదవండి: నగరంలో ‘బ్లాక్మెయిల్’ విలేకరుల అరెస్ట్ -
నకిలీ ఇన్వాయిస్ రాకెట్..రూ.861 కోట్ల జీఎస్టీ ఎగవేత..
గురుగ్రామ్:గురుగ్రామ్‌లో భారీ నకిలీ ఇన్వాయిస్ రాకెట్‌ను ఇంటెలీజెన్స్ ఐటీ అధికారులు ఛేదించారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి రూ.861 కోట్ల జీఎస్టీని ఎగ్గొట్టినట్లు వెల్లడించారు. ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా 461 నకిలీ ఇన్వాయిస్లను సృష్టించారని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో నకిలీ ధ్రువపత్రాలు, రెంట్ అగ్రిమెంట్లు, కరెంట్ బిల్లులు, ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, పాన్ కార్డుల వంటివి ల్యాప్‌టాప్‌లో గుర్తించినట్లు చెప్పారు. ఈ ఫేక్ డాక్యుమెంట్లను ఉపయోగించుకుని నకిలీ ఇన్వాయిస్లను సృష్టిస్తున్నట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే 461 ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా రూ.861కోట్ల విలువైన పన్ను ఎగవేసినట్లు పేర్కొన్నారు. ఈ మోసానికి సంబంధించిన ఇద్దరు ప్రధాన నిందుతులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ ఫేక్ ఇన్వాయిస్లు ఇనుము, స్టీల్ సెక్టార్‌కు బదిలీ అవుతున్నాయని గుర్తించినట్లు చెప్పారు. ఇదీ చదవండి:సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు! -
ఇన్స్టంట్ లోన్ ముఠా గుట్టు రట్టు... నిర్వహించేది చైనావాళ్లే!
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ లోన్ దోపిడి మాయను బట్టబయలు చేశారు ఢిల్లీ పోలీసులు. సుమారు రెండు నెలలపాటు సాగిన ఈ గ్యాంగ్ అపరేషన్ పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ నెట్వర్క్ విస్తరించి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....లక్నోలోని కాల్ సెంటర్లలో ఉన్న ఈ ముఠా తొలుత చిన్నమొత్తాల్లో రుణం అందించడానికి దరఖాస్తులు కోరుతుంది. ఆ తర్వాత యూజర్ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసి యాప్‌కు అనుమతులు మంజూరు చేసిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే వారి ఖాతాలో రుణం జమ అవుతుంది. అంతేకాదు ఫేక్ ఐడీలపై సేకరించిన వివిధ నంబర్ల నుంచి వినియోగదారులకు ఫోన్ చేసి ఒత్తిడి చేయడం మొదలు పెడతాయి. ఒకవేళ పట్టించుకోకపోతే వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని బెదిరింపులకు దిగుతుంది. దీంతో బాధితులు భయంతో అధిక మొత్తంలో డబ్బులు చెల్లించడం జరుగుతోంది. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఆ ముఠా హవాల ద్వారా లేదా క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేసి చైనాకు పంపిస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రతి ఖాతాకు కోటి రూపాయాల పైనే డబ్బులు జమ అవుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు దాదాపు 500 కోట్ల ఇన్స్టంట్ లోన్ దోపిడి రాకెట్‌తో ప్రమేయం ఉన్న సుమారు 22 మందిని అరెస్టు చేశారు. అంతేకాదు ఈ దందా కోసం ఆ ముఠా దాదాపు వంద లోన్‌యాప్‌లను ఉపయోగించనట్లు వెల్లడించారు. నిందుతుల నుంచి 51 మొబైల్ ఫోన్లు, 25 హార్డ్ డిస్క్‌లు, తొమ్మిది ల్యాప్‌టాప్‌లు, 19 డెబిట్ కార్డ్‌లు/క్రెడిట్ కార్డ్‌లు, మూడు కార్లు, సుమారు రూ. 4 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చైనా జాతీయులు సూచనల మేరకే ఈ రాకెట్‌ని తాము నిర్వహిస్తున్నామని నిందితులు చెప్పనట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసుల చైనాకు చెందిన కొంతమంది దుండగులను గుర్తించామని, వారి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. -
ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలం.. నిరుపయోగంగా శాటిలైట్స్
సూళ్లూరుపేట(తిరుపతి): ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ డీ1 ప్రయోగం విఫలమైందని అధికారికంగా ప్రకటించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఆ రాకెట్ మోసుకెళ్లిన రెండు ఉపగ్రహాలు ఇకపై పనికిరావని ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలిపింది. మూడు దశలను విజయవంతంగా దాటిన రాకెట్.. టర్మినల్ దశలో అదుపు తప్పింది. రెండు ఉపగ్రహాలను 356x76 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే.. ఎస్ఎస్ఎల్వీ-డీ1 రాకెట్ వాటిని 356 కిలోమీటర్లు వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టింది. అందువల్ల ఈ ఉపగ్రహాలు పనికి రావని ఇస్రో వెల్లడించింది. సెన్సార్ విఫలమవటం వల్లే ఈ సమస్య తలెత్తిందని పేర్కొంది. టర్మినల్ దశలో తలెత్తిన సాంకేతిక సమస్యపై ఇస్రో ఏర్పాటు చేసిన కమిటీ విశ్లేషిస్తోందని, ఈ కమటీ ఇచ్చే నివేదిక, ప్రతిపాదనల ఆధారంగా త్వరలోనే ఎస్ఎస్ఎల్వీ-డీ2 ప్రయోగాన్ని చేపడతామని పేర్కొంది. ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహా వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ డీ1ను తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించారు. ఈ రాకెట్ ఈవోఎస్-02, ఆజాదీశాట్ ఉపగ్రహాలను మోసుకెళ్లింది. ఈవోఎస్-02 ఉపగ్రహం బరువు 140 కిలోలు. ఇది భూమిని పరిశీలిస్తుంది. ఆజాదీశాట్ బరువు 8 కిలోలు. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు దీన్ని రూపొందించారు. ఈ ప్రయోగంలో మూడు దశలు అనుకున్నట్లుగానే పూర్తయినట్లు ఇస్రో మొదట వెల్లడించింది. టెర్మినల్ దశకు సంబంధించిన సమాచారం రావడంలో కొంత జాప్యం జరిగినట్లు తెలిపింది. (1/2) SSLV-D1/EOS-02 Mission update: SSLV-D1 placed the satellites into 356 km x 76 km elliptical orbit instead of 356 km circular orbit. Satellites are no longer usable. Issue is reasonably identified. Failure of a logic to identify a sensor failure and go for a salvage action— ISRO (@isro) August 7, 2022 -
రాకెట్ లాంచ్‌ని ప్రత్యక్షంగా చూడాలనుందా?..అయితే ఇది మీకోసమే!
న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా గగనతలంలోకి రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపిస్తారు శాస్త్రవేత్తలు. నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్తాయి రాకెట్లు. ఆ దృశ్యాలను ఎవరైనా టీవీలో చూడాల్సిందే. అయితే.. ఆ అద్భుతాన్ని ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో). ఈ వారాంతంలో తన తదుపరి స్పేస్ మిషన్‌ను ప్రయోగించనుంది ఇస్రో. ఆ ప్రయోగాన్ని లాంచ్ వ్యూ గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తోంది. నేరుగా చూడాలనుకునేవారు ముందుగా రిజిస్టర్ చేసుకోండి మరి. ఎస్ఎస్ఎల్వీ-డీ1/ఈఓఎస్-02 మిషన్‌ను 2022, ఆగస్టు 7న ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది ఇస్రో. ఆంధ్రప్రదేశ్, శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పెస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుందని ట్విట్టర్లో పేర్కొంది ఇస్రో. ప్రత్యక్షంగా వీక్షించాలనే ఆసక్తి ఉన్నవారు తమ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలంటూ ఓ లింక్‌ను షేర్ చేసింది. ఈ మిషన్ ద్వారా ఈఓఎస్-02 , ఆజాదిసాట్ అనే రెండు శాటిలైట్లను మోసకెళ్లనుంది రాకెట్. The launch of the SSLV-D1/EOS-02 Mission is scheduled for Sunday, August 7, 2022, at 9:18 am (IST) from Satish Dhawan Space Centre (SDSC), Sriharikota. ISRO invites citizens to the Launch View Gallery at SDSC to witness the launch. Registration is open at https://t.co/J9jd8yDs4a pic.twitter.com/rq37VfSfXu — ISRO (@isro) August 1, 2022 ఇదీ చదవండి: Viral Video: సముద్రంలో తెల్లటి చుక్కల్లా....జెల్లీ ఫిష్ సముహం -
Viral Video: భూమిపైకి దూసుకొచ్చిన చైనా రాకెట్ శకలాలు
వాషింగ్టన్: చైనా కొద్ది రోజుల క్రితం ప్రయోగించిన లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్‌కు సంబంధించిన భారీ శకలాలు భూకక్ష్యలోకి ప్రవేశించాయి. రాత్రి వేళ వివిధ రంగుల్లో మిరిమిట్లు గొలుపుతూ రాకెట్ శిథిలాలు భూమివైపు దూసుకొచ్చాయి. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రజలు వీటిని ఉల్కాపాతంగా భావించి వీడియోలు తీశారు. శనివారం రాత్రి హిందూ మహాసముద్రంపై 10.45 గంటల సమయంలో భూవాతావరణంలోకి రాకెట్ శకలాలు ప్రవేశించినట్లు అమెరికా అంతరిక్ష కమాండ్ సైతం నిర్ధరించింది. తూర్పు, దక్షిణాసియాలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఈ శకలాలు మండుతూ భూకక్ష్యలోకి రావటాన్ని వీక్షించారు. మలేసియా మీదుగా ఇవి ప్రయాణిస్తోన్న వీడియోను నాసా ఆస్ట్రోనాట్ క్రిస్ హాడ్ఫీల్డ్ ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే.. అందులో ఎన్ని భూమిని తాకి ఉంటాయనేదానిపై సమాచారం లేదు. మరోవైపు.. చైనా స్పేస్ ఏజెన్సీ పనితీరును నాసా ప్రతినిధి బిల్ నిల్సన్ తప్పుపట్టారు. తన రాకెట్ల శిథిలాలు భూవాతావరణంలోకి రాకుండా అడ్డుకోలేకపోతోందని పేర్కొన్నారు. లాంగ్‌మార్చ్ 5బీ వంటి రాకెట్ల శిథిలాలు ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలుగజేసే ప్రమాంద ఉందన్నారు. జులై 24న చైనా ఈ రాకెట్‌ను ప్రయోగించింది. Looks like that Chinese rocket just burned up over Malaysia. Now wait to hear what big pieces splashed/thumped to Earth. https://t.co/SVh2UXVIyG — Chris Hadfield (@Cmdr_Hadfield) July 30, 2022 ఇదీ చదవండి: ల్యాబ్ మాడ్యూల్‌లోకి ప్రవేశించిన చైనా వ్యోమగాములు -
హైదరాబాద్ పోలీస్.. టార్గెట్ న్యూ ఇయర్ పార్టీస్!
సాక్షి, సిటీబ్యూరో: డిసెంబర్ 31 రాత్రి జరగనున్న న్యూ ఇయర్ వేడుకలను టార్గెట్‌గా చేసుకున్న డ్రగ్ పెడ్లర్లు దందా వేగం పెంచారు. గంజాయికి బదులుగా దాని కంటే తేలిగ్గా రవాణా చేయగలిగే హష్ ఆయిల్‌పై దృష్టి పెట్టారు. దీనిని గమనించిన నగర పోలీసు విభాగం నిఘా ముమ్మరం చేసింది. ఫలితంగా నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముగ్గురిని పట్టుకుని, రూ.25 లక్షల విలువైన 3.5 లీటర్ల ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, డీసీపీ చక్రవర్తి గుమ్మిలతో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ► విశాఖపట్నం జిల్లా, పాయకరావుపేటకు చెందిన సంపతి కిరణ్‌కుమార్ ఐటీఐ పూర్తి చేశాడు. ఆపై విజయవాడ, కాకినాడల్లో ఉద్యోగాలు చేసినా నిలదొక్కుకోలేదు. పాడేరు ఏజెన్సీకి చెందిన గంజాయి విక్రేతలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ► గత ఏడాది మేలో గంజాయి రవాణా చేస్తూ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పోలీసులకు చిక్కాడు. మూడు నెలలకు బెయిల్‌పై బయటకు వచ్చిన ఇతగాడు నగరానికి వచ్చి మణికొండ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ► గత కొద్ది కాలంగా పోలీసులు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో రవాణా చేĶæడానికి అనువుగా మారిన హష్ ఆయిల్‌పై ఇతడి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో పాడేరు ప్రాంతానికి చెందిన వినోద్‌తో పరిచయం పెంచుకున్నాడు. ► వినోద్ స్థానికంగా లభించే గంజాయి మొక్కలతో ఈ ఆయిల్ తయారు చేస్తున్నాడు. అక్కడ తక్కువ రేటుకు 1.5 లీటర్లు ఖరీదు చేసిన కిరణ్ ట్రావెల్స్ బస్సులో సిటీకి తెచ్చాడు. విక్రయించడానికి ప్రయత్నిస్తూ గోల్కొండ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కాడు. ► జహనుమ, యాప్రాల్ ప్రాంతాలకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్, షేక్ కమల్ దూరపు బంధువులు. చిన్న చిన్న పనులు చేసే వీరు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం అక్రమ మార్గం పట్టారు. పాడేరుకు చెందిన గౌతమ్ నుంచి హష్ ఆయిల్ కొంటున్నారు. ► తొలినాళ్లల్లో వీళ్లే వినియోగించే వారు. అయితే న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో ఈ సరుకు డి మాండ్ పెరగడంతో దందా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల సింహాచలం వరకు వెళ్లి గౌతమ్ నుంచి 2 లీటర్ల కొని తీసుకువచ్చారు. ► దీనిని విక్రయించే ప్రయత్నాల్లో ఉండగా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఫల క్‌నుమ ప్రాంతంలో పట్టుకున్నారు. వీడ్ ఆయిల్‌గానూ పిలిచే దీన్ని ఒక్కో మిల్లీ లీటర్ రూ.700 నుంచి రూ.1000 వరకు అమ్ముతున్నారు. ► న్యూ ఇయర్ సీజన్లో ఇది రూ.2000కు చేరే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ పార్టీలపై కన్నేసి ఉంచామని, పబ్ ఓనర్లనూ హెచ్చరించామని కొత్వాల్ పేర్నొఆ్నరు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై కన్నేసి ఉంచాలని సూచించారు. చదవండి: నవవధువు ఆత్మహత్య: భర్త వేధింపుల వల్లే మా కుమార్తె చనిపోయింది -
వ్యభిచారం నిర్వహిస్తున్న ఇళ్లపై దాడి: పలువురి అరెస్టు
సాక్షి,పంజగుట్ట( హైదరాబాద్): గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు ప్రాంతాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, సీసీఎస్, పంజగుట్ట పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు... కర్నాటకకు చెందిన రాజేష్ నాయక్ (34) నగరంలో ఫలక్నామాలో ఉంటున్నాడు. ఇతను ఎర్రమంజిల్, హిల్‌టాప్ కాలనీలో ఓ భవనంలో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడని సీసీఎస్ పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. మంగళవారం రాత్రి దాడి చేసి నిర్వాహకుడు రాజేష్నాయక్తో పాటు ఇద్దరు కస్టమర్లు, ఇద్దరు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ నాయక్‌ను విచారించగా శ్రీనగర్‌కాలనీలో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఈస్ట్‌గోదావరి జిల్లాకు చెందిన కె.రాము(28) కూడా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని దానిపై కూడా దాడి చేసి నిర్వాహకుడు రాము, ఒక సెక్స్ వర్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Kukatpally:వివాహేతర సంబంధం.. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య -
మొదట డేటింగ్..ఆపై ఇంటికి రప్పించుకుని.. నగ్నంగా మార్చి..
న్యూఢిల్లీ: ఆన్లైన్లో డేటింగ్ పేరిట పురుషులను ట్రాప్ చేసి, ఆపై వారిని బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న కిలాడీలను కటకటాల వెనక్కి నెట్టారు ఢిల్లీ పోలీసులు. ఈ డేటింగ్ బాగోతం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో చోటుచేసుకుంది. తాజాగా ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో ఇందులో ప్రధాన పాత్ర పోషించిన మహిళను ఆమెకు సహకరించిన మరో నలుగురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నిందితులు మొదట ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా బాధితులతో స్నేహం చేసి, తర్వాత వారిని తమ ఇంటికి రప్పించుకుంటారు. అలా వచ్చని వారికి మత్తుమందు కలిపిన నీరు లేదా కూల్‌డ్రింక్స్ ఇస్తారు. అది తాగి స్పృహ కోల్పోయిన తరువాత వారిని మహిళతో చనువుగా ఉన్నట్లు ఫోటోలు తీయడంతో పాటు అభ్యంతకరమైన ఫోటోలు తీసి బెదిరింపుల పర్వాన్ని మొదలుపెడతారు. ఈ తరహాలోనే ఇటీవల ఓ వ్యాపారికి ప్లై బోర్డు కావాలని ఓ మహిళ నుంచి కాల్ వచ్చింది. దీంతో అతను అక్టోబర్ 21న జనక్‌పురి ప్రాంతంలోని నిందితురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె తాగడానికి ఒక గ్లాసు మంచినీరు ఇవ్వగా దాన్ని తాగిన వెంటనే అతను స్పృహతప్పి పడిపోయాడు. వ్యాపారి స్పృహలోకి వచ్చినప్పుడు నగ్నంగా మంచం మీద ఉన్నాడు. కళ్లు తెరచి చూడగా చూట్టూ ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు అతనిపై దాడి చేసి, తన వద్ద ఉన్న సుమారు 16 వేల రూపాయల నగదు, చేతి గడియారం, బంగారు ఉంగరం లాక్కున్నారు. అంతే కాకుండా మరో రూ.7 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తుల నుంచి తాము కొన్ని ఫైళ్లు, డబ్బు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. గత రెండేళ్లలో ఈ ముఠా దాదాపు 40 మంది పురుషుల నుంచి విలువైన వస్తువులను తీసుకున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. చదవండి: భర్తకు అన్నం వడ్డించి.. అంగడికి వెళ్లొస్తానని చెప్పి నవవధువు అదృశ్యం -
‘హాయ్ బేబీ’ అంటూ వలపు వల.. టెంప్ట్ అయ్యారా కొంప కొల్లేరే..!
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో యూజర్ల సంఖ్య పెరగడంతో సైబర్ కేటుగాళ్ల దీన్నే అదునుగా మార్చుకుని నెట్టింట ఇష్టారాజ్యంగా నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు డబ్బు వస్తాయంటూ ఆశ చూపి మోసం చేస్తుండగా, మరికొందరు ఆన్లైన్లో పరిచయం పెంచుకుని కాస్త సన్నిహిత్యంగా మెలిగిన తర్వాత మన ఫోటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకర చిత్రాలు పంపి డబ్బులు దండుకుంటున్నారు. అలాంటి ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. బాధితుడికి ఫేస్బుక్ అకౌంట్‌కి ఓ యువతి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఇక ఆ రిక్వెస్ట్‌ను అంగీకరించగానే కాస్త క్లోజ్‌గా మెలుగుతూ అతని వాట్సాప్ నెంబర్‌ను పంపాలని కోరడంతో బాధితుడు పంపాడు. కొన్ని రోజుల తర్వాత సదరు వ్యక్తి నుంచి అభ్యంతరకర కంటెంట్‌తో ఉన్న వీడియో అతనికి వచ్చింది. ఏంటని చూడగా.. అందులో అడల్ట్ కంటెంట్ వీడియోని మార్ఫ్డ్ చేసి బాధితుడి ముఖాన్ని పెట్టారు. దీనీ చూసిన అతను షాక్‌కి గురయ్యాడు. ఆ వీడియో పంపిన తర్వాత నిందితుడు డబ్బుల కోసం బెదిరింపులు మొదలుపెట్టాడు. భయంతో బాధితుడు రూ.1,96,000 వరకు సమర్పించుకున్నాడు. ఇంకా పంపాలని బెదించగా బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు రాకెట్ గుట్టు రట్టు చేసి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారుకు కాల్ చేసేందుకు ఉపయోగించిన నెంబర్లు అస్సాంకు చెందినవిగా, వాటిని రాజస్ధాన్‌లోని భరత్పూర్ జిల్లా నుంచి వాడినట్టు గుర్తించారు. నిందితుడు అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన ముగ్గురు అనుమానితుల కోసం గాలిస్తున్నారు. వీరు ఫేస్బుక్ సహా సోషల్ మీడియా వేదికల్లో యువతుల పేరుతో పరిచయం పెంచుకుని బాధితుల వద్ద డబ్బుల గుంజుకోవడమే పనిగా పెట్టుకున్నారని పోలీసులు దర్యాప్తులో తేలింది. చదవండి: ఘోరం: ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్‌పై.. కజిన్ అత్యాచారం -
ఇస్రో విజయపరంపరలో తాజా కలికితురాయి!
చంద్రయాన్–2కు, అంతరిక్ష మానవ సహిత ప్రయోగాలకు అందివస్తుందని భావిస్తున్న జీఎస్ ఎల్వీ మార్క్3–డీ2 రాకెట్ ద్వారా బుధవారం మన శాస్త్రవేత్తలు జీ శాట్–29 భారీ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. గగనవీధుల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నమోదు చేసుకుంటున్న విజయ పరంపరలో తాజా ప్రయోగం కలికితురాయి అని చెప్పాలి. అంతా ముందనుకున్నట్టే సాయంత్రం 5–08 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం లోని ప్రయోగవేదిక నుంచి మార్క్3–డీ2 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కౌంట్ డౌన్ పూర్తయి రాకెట్ నిప్పులు చిమ్మడం మొదలైన దగ్గరనుంచి నిర్దేశిత కక్ష్యకు ఉపగ్రహం చేరు కోవడం వరకూ చూస్తే... మొత్తం 16 నిమిషాల 43.5 సెకన్ల సమయం పట్టింది. ప్రయోగం విజయ వంతమయ్యాక ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ చెప్పినట్టు ఇన్నాళ్లూ చేసిన ప్రయోగాలతో పోలిస్తే ఇది నిస్సందేహంగా ఎవరెస్టు శిఖరం వంటిది. చాలామంది దీన్ని ‘బాహుబలి’గా అభివర్ణించారు కూడా. రాకెట్ మొదటి దశకు రెండువైపులా 200 టన్నుల ఘన ఇంధన బూస్టర్లుంటే, రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధన బూస్టర్లున్నాయి. మూడో దశ కోసం 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనం బూస్టర్‌ను వాడారు. ఈ మూడూ శాస్త్రవేత్తలిచ్చిన కమాండ్లకు అనుగుణంగా సక్రమంగా పనిచేసి వారిలో ఆత్మసై్థర్యాన్ని నింపాయి. ఇస్రో ఈ ఏడాది చేసిన వరస ప్రయోగాల్లో ఇది అయిదవది. మార్క్3 రాకెట్‌ను ఉపయోగించడం ఇది రెండోసారి. 2014 జూన్‌లో మార్క్ 3 రాకెట్ద్వారా జీశాట్–19 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. చెన్నై–శ్రీహరికోట మధ్య తీరం దాటుతుందని అంచనావేసిన పెను తుపాను ‘గజ’ దారి మార్చుకోవడంతో అనుకున్న సమయానికే ప్రయోగం సాధ్యపడింది. మన శాస్త్రవేత్తలకు పీఎస్ఎల్వీ రాకెట్ మాదిరి జీఎస్ఎల్వీ చాన్నాళ్లు కొరుకుడు పడలేదు. జీఎస్ఎల్వీని ప్రయోగించినప్పుడల్లా వైఫల్యాలే ఎదురయ్యాయి. కానీ రెండు దశాబ్దాలపాటు ఆ రాకెట్ విషయంలో అకుంఠిత దీక్ష బూని పనిచేయడం ఫలితంగా అది సైతం పట్టుబడింది. ప్రయోగం విఫలమైనప్పుడల్లా కూలంకషంగా అధ్యయనం చేసి సూక్ష్మ స్థాయిలో జరిగిన పొర పాట్లను సైతం గుర్తించడం, డిజైన్‌లో దానికి అనుగుణంగా అవసరమైన మార్పులు చేసుకోవడం, మళ్లీ ప్రయోగానికి సిద్ధపడటం విడవకుండా కొనసాగింది. ఒక దశలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొం దించిన ఇంజిన్ విఫలం కాగా, మరో దశలో రష్యా తయారీ ఇంజిన్ సైతం మొరాయించింది. కానీ మన శాస్త్రవేత్తలు పట్టువదలని విక్రమార్కుల్లా పనిచేశారు. విసుగూ, విరామం లేకుండా శ్రమిం చారు. ఫలితంగా జీఎస్ఎల్వీ కూడా సులభగ్రాహ్యమైంది. సుదూర కక్ష్యల్లోకి అధిక బరువుండే ఉప గ్రహాలను పంపాలంటే క్రయోజెనిక్ సాంకేతికతను వినియోగించే జీఎస్ఎల్వీ ఆసరా తప్పనిసరి. జీఎస్ఎల్వీలో మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని, మూడో దశలో క్రయోజెనిక్ ఇంధనాన్ని వినియోగించాల్సివస్తుంది. మొదటి రెండు దశల విషయంలో శాస్త్రవేత్త లకు ఎప్పుడూ సమస్యలేదు. మూడోదైన క్రయోజెనిక్ సాంకేతికతే చాన్నాళ్లు ఇబ్బంది పెట్టింది. ఇందులో వాడే హైడ్రోజన్‌నూ, దాన్ని మండించడానికి ఉపయోగించే ఆక్సిజన్‌ను ద్రవరూపంలోకి మార్చడం సాధారణమైన పని కాదు. అందుకోసం ఆ రెండు ఇంధనాలనూ నిర్దిష్ట స్థాయికి శీతలీ కరించాలి. ఈ క్రమంలో ఎక్కడ లోపం జరిగినా ఆ రెండు ఇంధనాలూ నేరుగా వాయు రూపంలోకి మారిపోతాయి. పైగా హైడ్రోజన్ ద్రవరూపంలోకి మారాలంటే మైనస్ 253 డిగ్రీల సెల్సియస్ వద్ద, ఆక్సిజెన్ ద్రవరూపంలోకి మారడానికి మైనస్ 183 డిగ్రీల వద్ద ఉండాలి. ఇందుకు తగినట్టుగా ఇంజిన్‌లోని పరికరాలు, పైపులూ శీతల స్థితిలో ఉండాలి. అడుగడుగునా ఎదురయ్యే ఈ సవాళ్లను అధిగమించే మార్గంలో ఎన్నో అడ్డంకులు! ఈ సాంకేతికతను ఇవ్వడంపై అమెరికా ఆంక్షలు విధిం చగా, రష్యా అత్యధిక మొత్తాన్ని డిమాండు చేసింది. కనుకనే ఇందుకోసం దేశీయ సాంకేతి కతను అభివృద్ధి చేసుకోవడం తప్పనిసరని మన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంతటి అపారమైన కృషి వల్లనే జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 ప్రయోగం విజయవంతమైంది. పదేళ్లపాటు సేవలందించగల జీశాట్–29లో అత్యంతాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందు బాటులోకి రాగలిగేందుకు అనువైన ఉపకరణాలను అమర్చారు. ప్రపంచంలో మరే దేశమూ కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో ఈ మాదిరి ఉపకరణాలు ఇంతవరకూ వినియోగించలేదు. దేశంలోని మారుమూల పల్లెల్లో ఉండే వనరులు, అక్కడుండే సదుపాయాలు సులభంగా తెలుసుకోవడానికి ఈ ఉపగ్రహం దోహదపడుతుంది. అటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ, ఇటు జమ్మూ–కశ్మీర్‌లోనూ మూల మూలలకూ ఇంటర్నెట్ సర్వీసులు అందుబాటులోకొస్తాయి. ఈ ఉపగ్రహంలోని ఆప్టికల్ కమ్యూ నికేషన్ పేలోడ్ వల్ల డేటా బదిలీ అత్యంత వేగవంతంగా ఉండగలదని చెబుతున్నారు. ఈ ప్రయో గానికి వినియోగించిన జీఎస్ఎల్వీ మార్క్3–డీ2 రాకెట్ రకాన్నే వచ్చే జనవరిలో చంద్రయాన్–2 ప్రయోగానికీ, 2022లో తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష కార్యక్రమానికీ వినియోగించాలని భావిస్తున్నారు. మొత్తానికి అంతరిక్ష రంగంలో గుత్తాధిపత్యాన్ని నెరపాలన్న అగ్రరాజ్యాల కలను మన శాస్త్రవేత్తలు చెదరగొట్టారు. ఈ వరస విజయాలు వాణిజ్యపరంగా కూడా దేశానికి లాభదా యకమవుతాయి. మన శాస్త్రవేత్తల పర్యవేక్షణలో రూపొందే రాకెట్లు, ఉపగ్రహాలు, వాటిల్లో విని యోగించే ట్రాన్స్పాండర్లు, ఇతర పరికరాలు అంతర్జాతీయంగా విశ్వసనీయతను సాధించాయి. పైగా అగ్రరాజ్యాలతో పోలిస్తే రాకెట్ ప్రయోగాల వ్యయం చాలా తక్కువ అవుతోంది. అందువల్లే అంతరిక్ష రంగంలో భారత్ సేవలు వినియోగించుకోవడానికి పలు దేశాలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరికొన్ని ప్రయోగాల తర్వాత మార్క్3 కూడా అరియాన్, అట్లాస్ తరహాలో వాణిజ్యపరమైన రాకెట్‌గా రూపుదిద్దుకోవడం ఖాయం. -
క్రికెట్ బుకీల అరెస్టు
సాక్షి, అమరావతిబ్యూరో: ల్యాప్‌ట్యాప్‌లు, సెల్ఫోన్లు వినియోగిస్తూ ఆన్లైన్లో రాష్ట్రవ్యాప్తంగా యథేచ్ఛగా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ప్రధాన బుకీ సప్పా రవిచంద్ర మౌలిని విజయవాడ నగర పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన బుకీతోపాటు బెట్టింగ్ నిర్వహిస్తున్న మరో 21 మందిని కూడా అదపులోకి తీసుకుని వారివద్ద నుంచి సెల్ఫోన్లు, లాప్‌ట్యాప్‌లు, టీవీ, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. గత నెల జరిగిన ఆసియా కప్ క్రికెట్ పోటీల సందర్భంగా నగరంలో ‘బంతి బంతికి బెట్టింగ్’ అనే శీర్షిక పేరిట సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన పోలీసు కమిషనర్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసే బాధ్యతలను సిటీ టాస్క్ఫోర్సు పోలీసులకు అప్పగించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రధాన బుకీతో పాటు నిర్వాహకులను అరెస్టు చేశారు. విజయవాడ కేంద్రంగా బెట్టింగ్.. నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు విజయవాడ కేంద్రంగా రాజ మండ్రి, గుంటూరు, భీమవరం తదితర ప్రాం తాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులపై టాస్క్ ఫోర్సు పోలీసులు నిఘా పెంచారు. ఈ నేపథ్యం లో గత నెల 27వ తేదీన ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంట్లో రెండో అంతస్తులో ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ల్యాప్‌ట్యాప్‌లు, 19 సెల్ఫో న్లు, ఎల్ఈడీ టీవీ, ఒక కారుతోపాటు రూ. 1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో విజయవాడ, గుం టూరు నగరాలకు చెందిన మరో 12 మందిని కూ డా అరెస్టు చేసి వారి నుంచి రూ. 1.51 లక్షల నగదుతోపాటు 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ‘టాస్క్ఫోర్సు’ దాడులతో గుట్టురట్టు.. నగరంలో ఒకే రోజు క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న రెండు ముఠాలను అరెస్టు చేశాక.. టాస్క్ఫోర్సు పోలీసులు ప్రధాన బుకీ కోసం వేట ప్రారంభించారు. గత నెలలోనే ఇబ్రహీంపట్నంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. సప్పా రవిచంద్ర నగరానికి వచ్చాడన్న సమాచారంతో పోలీసులు శనివారం అతన్ని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఒక లాప్‌టాప్‌తోపాటు రూ. 7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ‡రవీచంద్ర ఇచ్చిన సమాచారంతో గుంటూరు, రాజమండ్రి, హైదరాబాద్ నగరాలకు చెందిన ఆరు మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు సెల్ఫోన్లు, రూ. 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నేరాలపై ఉక్కుపాదం : సీపీ రాజధాని ప్రాంతంమైన విజయవాడలో క్రికెట్ బెట్టింగ్, హైటెక్ వ్యభిచారం, సైబర్ నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని నగర పోలీసు కమిషనర్ ద్వారాక తిరుమలరావు స్పష్టం చేశారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన ప్రధాన బుకీ రవిచంద్ర అరెస్టు చేసిన సందర్భంగా శనివారం సీపీ మీడియాతో మాట్లాడారు. నగరంలో ఎవరైనా క్రికెట్‌బెట్టింగ్‌లు నిర్వహించినా.. పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని.. రౌడీషీట్లు తెరవడంతోపాటు పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తామని.. బహిష్కరణకు వెనుకాడబోమని హెచ్చరించారు. -
ఆస్ట్రేలియన్ వీసా రాకెట్ బట్టబయలు..
సిడ్నీ: భారతీయులకు ఉద్యోగాలు, విద్యావకాశాల పేరుతో నకిలీ వీసాలను అందిస్తున్న అతిపెద్ద నకిలీ వీసా రాకెట్ ను మెల్ బోర్న్ లో నివసిస్తున్న భారతీయుడు బట్టబయలు చేశారు. దాదాపు 40 మంది భారతీయులకు ఈ స్కాంతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. మెల్ బోర్న్ లోని ఆర్ఎమ్ఐటీ యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేస్తున్న జస్విందర్ సిద్దూ ను కొద్దిరోజుల క్రితం ఫేస్ బుక్ ద్వారా ఓ వ్యక్తి భారతీయులకు వీసాలు కావాలంటే ఏర్పాటు చేస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని, విద్యార్థులు ఎవరైనా ఆస్ట్రేలియాలో చదువుకోవాలంటే వీసాలు ఇప్పిస్తానంటూ సంప్రదించాడు. ఒక వ్యక్తికి ఉద్యోగానికి గానీ, చదువు కోసం గానీ వీసాను ఏర్పాటు చేస్తే ఐదు వేల యూఎస్ డాలర్లను సిద్దూకి ఆఫర్ చేశాడు. మెకానిక్స్, హోటల్ మేనేజ్ మెంట్, ఐటీ రంగాల్లో ఉద్యోగాలు ఉన్నాయని, తెలిసిన వారు ఉంటే తనకు చెప్పాలని అడిగాడు. కాగా, సిద్దూ ఆ వ్యక్తి తో జరిపిన సంప్రదింపులన్నింటినీ హిడెన్ కెమెరా ద్వారా రికార్డు చేసి కేసును బలపరిచేందుకు దీనిని సాక్ష్యంగా ఉపయోగించారు. స్కాంపై మాట్లాడిన సిద్దూ.. గత పదేళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నానని చెప్పారు. వీసా సమస్యలు వస్తే ఇక్కడి ఉద్యోగ సంస్థలు భారతీయులను రేప్ చేసిన సంఘటనలు ఉన్నాయని, పెద్ద ఎత్తున వీసా మోసాలు జరుగుతున్నాయని తరచూ తన దృష్టికి వచ్చేదని తెలిపారు. వీటన్నింటినీ బయటపెట్టి ముఠా ఆట కట్టించాలని తాను భావించినట్లు వివరించారు. అనుకున్నట్లే తనను సంప్రదించిన వ్యక్తికి తెలియకుండా మొత్తం స్కాంను రికార్డు చేసినట్లు చెప్పారు. ఈ స్కాంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందని తెలిపారు. పెద్ద స్థాయిలో ఉన్న ఆస్ట్రేలియన్ అధికారులకు, కొంతమంది భారతీయులకు స్కాంతో సంబంధం ఉందని వివరించారు. -
కొకైన్ స్మగ్లింగ్ వెనుక దావూద్!
దర్యాప్తు జరుపుతున్న నేపాల్ పోలీసులు కఠ్మాండు: తమ దేశం మీదుగా మాఫియా ముఠా నాయకుడు అంతర్జాతీయ మార్కెట్‌కి కొకైన్‌ను స్మగ్లింగ్ చేస్తున్నట్టు నేపాల్ పోలీసులు అనుమానిస్తున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మార్కెటింగ్‌కు సంబంధించి దావూద్‌కు సన్నిహితులుగా అనుమానిస్తున్న ముగ్గురు పాక్ జాతీయులను ఇటీవల అరెస్టు చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ కోణంలో యోచిస్తున్నారు. నకిలీ కరెన్సీలో ప్రమేయం, హెరాయిన్ స్మగ్లింగ్‌తోపాటు యూరప్‌కు ఆసియామీదుగా కొకైన్ స్మగ్లింగ్‌లో పాక్ జాతీయుల ప్రమేయంపై నేపాల్ పోలీసులు ఓ నిర్ధారణకొచ్చారు. ఇద్దరు స్థానికుల వద్ద నేపాల్ నార్కోటిక్ బ్యూరో (ఎన్సీబీ).. రెండు కిలోలకుపైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది. దీని విలువ మార్కెట్లో దాదాపు 492 డాలర్లు ఉంటుంది. ఇందులో కొంతమంది ప్రభావవంతమైన డ్రగ్ లార్డుల ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ విషయమై ఎన్సీబీ చీఫ్, డీఐజీ జై బహదుర్ మీడియాతో మాట్లాడుతూ మెరిస్ కార్మెన్ నర్వేజ్ (వెనిజులా), మహ్మద్ లామైన్ డబో (నైజీరియా), తౌహిద్ ఖాన్ (భారత్), దిల్ బహదుర్ గురుంగ్ (నేపాల్)లను అరెస్టు చేసి, వారి వద్దనుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ జాతీయుల సహాయంతో వీరు హాంగ్‌కాంగ్‌కు చెందిన వ్యక్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని, సదరు పాక్ జాతీయులను వాహిద్ ఖాన్, అబ్దుల్ రజాక్, దావూద్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన అతని సోదరుడిగా గుర్తించామని చెప్పారు. భారతీయ గూఢచార విభాగం ఇచ్చిన సమాచారం మేరకు ఈ రాకెట్లో ప్రమేయమున్నట్టుగా అనుమానిస్తున్న పాక్ జాతీయులను అరెస్టు చేశామని డీఐజీ చాంద్ చెప్పారు. -
జాబన్నారు.. కిడ్నీ కోట్టేశారు!!
-
కాల్‌మనీ వ్యవహారంలో కొత్త కోణాలు
-
విజయవాడలో భారీ ఫైరసీ రాకెట్
-
విశాఖలో వడ్డీ వ్యాపారుల అరాచకాలు
-
కోల్‌కతాలో ప్రకంపనలు రేపుతున్న మనీలాండరింగ్
-
నకిలీ పాస్ పుస్తకాల ముఠా గుట్టురట్టు
అనంతపురం : అనంతపురం జిల్లా కదిరి కేంద్రంగా నకిలీ పాస్ పుస్తకాల తయారు చేస్తున్న ముఠా గుట్టును అనంతపురం పోలీసులు శనివారం రట్టు చేశారు. అందుకు సంబంధించిన 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 247 నకిలీ పాస్ పుస్తకాలు, రెండు కంప్యూటర్లు, 148 స్టాంప్లతోపాటు 25 రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు సమక్షంలో ముఠా సభ్యులను విలేకర్ల సమావేశంలో పోలీసులు నిలబెట్టారు. -
బ్లూఫిల్మ్ రాకెట్‌ను పట్టుకున్న పోలీసులు
-
విశ్లేషణం: ఆడిటరీ డిజిటల్ పర్సన్
రాకెట్‌తో బంతిని బాదినా, అందంతో అభిమానులను ఆకట్టుకున్నా, అంతర్జాతీయ టెన్నిస్‌లో పతకాలు సాధించి భారతీయ మహిళా సామర్థ్యాన్ని సాటి చెప్పినా... అది సానియా మీర్జాకే సాధ్యం. టెన్నిస్ కోర్టులో సానియా సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు... ఆమె సాధించిన పతకాలే మాట్లాడతాయి. కానీ సానియా మాట్లాడేటప్పుడు మీరెప్పుడైనా గమనించారా? తల కొంచె ఎడమవైపుకు వాలి ఉంటుంది. ఏం మాట్లాడాలన్నా ముందు ఎడమవైపు కిందకు చూస్తూ తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా మాట్లాడి, ఆ తర్వాతే తలెత్తి ఎదుటి వ్యక్తిని చూస్తూ స్పాంటేనియస్‌గా, గలగలా మాట్లాడుతుంది. అడిగినా అడగకున్నా అనేక వివరాలు చెప్తుంది. అంతేకాదు తరచూ... యూ నో, యూ నో... అంటూ ఉంటుంది. ఇవన్నీ ఆమెను ‘ఆడిటరీ డిజిటల్’ పర్సన్ అని చెప్తాయి. ఈ వ్యక్తిత్వమున్న వారు ఏం మాట్లాడాలన్నా ముందు తమలో తాము మాట్లాడుకుంటారు. ఏ అంశాన్నైనా వివరంగా చెప్తారు. చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు. తార్కికంగా ఆలోచించాకే, తమకు ఓకే అనిపిస్తేనే నిర్ణయం తీసుకుంటారు. ప్రిపరేషన్, అనాలసిస్, ప్లానింగ్, ఆర్గనైజింగ్ వీరి బలాలు. ఈ బలాలన్నీ సానియాలో స్పష్టంగా కనిపిస్తాయి. సానియా మాట్లాడేటప్పుడూ తరచూ చిరునవ్వులు చిందిస్తుంది... మనసారా నవ్వుతుంది... అందులో ఎలాంటి దాపరికం ఉండదు. ఎవరితో మాట్లాడుతున్నా తానెంత ఈజ్‌గా ఉంటుందో ఆ నవ్వే చెబుతుంది. అయితే ఇబ్బందికరమైన విషయాల గురించి అడిగినప్పుడుకూడా నవ్వేస్తూ తన ఇబ్బందిని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తుంది. మాట్లాడేటప్పుడు చేతుల కదలికలు తక్కువగా ఉన్నా.. అవి మాట్లాడే మాటలకు అనుగుణంగానే ఉంటాయి. అంతేకాదు తన కష్టాలను, సమస్యలను ఎలాంటి భేషజాలు లేకుండా అంగీకరిస్తుంది. వాటినెలా ఎదుర్కుందో వివరిస్తుంది. తనకు సాయం చేసిన వారిని గుర్తుచేసుకుంటుంది. తానెంత ఎదిగినా ఒదిగే ఉంటుందనడానికి ఇదే నిదర్శనం. సానియాకు కావాల్సినంత ఆత్మవిశ్వాసం ఉంది. సాహసోపేతంగా ఆలోచిస్తుంది. బురఖా వేసుకునే హైదరాబాదీ ముస్లిం సంప్రదాయ కుటుంబంనుంచి వచ్చి షార్ట్స్ ధరించి టెన్నిస్ ఆడినా, మోడరన్ దుస్తులతో ర్యాంప్‌పై అందాలు చిందించినా, భారతీయ మహిళ కలలో కూడా ఊహించని గ్రాండ్‌స్లామ్‌ను సాధించినా, ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా సంప్రదాయాలకు వెరవకుండా మ్యారేజ్‌ను రద్దుచేసుకున్నా, భారతదేశాన్ని శత్రువులా భావించే పాకిస్థాన్‌కు చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడినా... అందులో సానియా సాహసమే కనిపిస్తుంది. అలాంటి సాహసోపేతమైన ఆలోచనా ధోరణి తనకు ఉంది కాబట్టే ఎవరూ ఊహించని విజయాలను సాధించగలిగింది. సానియా మానసికంగా కూడా చాలా శక్తివంతురాలు. పరాజయాన్ని తేలిగ్గా అంగీకరించదు. వాటిని ఛాలెంజ్‌గా తీసుకుంటుంది. తన సత్తా చాటుతుంది. తీవ్ర గాయాలపాలైనా కుంగిపోకుండా తిరిగి ఆరు నెలల్లో మళ్లీ ఆమె తన సామర్థ్యాన్ని చూపడం ఈ విషయాన్నే తెలుపుతుంది. ‘‘నంబర్ల గురించి నేను పట్టించుకోను. అలా ఆలోచిస్తే మనం పూర్తి సామర్థ్యంతో ఆడలేము. ప్రత్యర్థి ర్యాంకు ఆధారంగా ఆడాల్సివస్తుంది’’ అని చెప్పడం ఆమె క్రీడా స్ఫూర్తిని తెలుపుతుంది. విమర్శలకు రియాక్ట్ కాకుండా ప్రొయాక్టివ్‌గా ఆలోచించడం సానియా స్వభావం. విమర్శలు ఎందుకొస్తాయో, ఎలా వస్తాయో సానియాకు బాగా తెలుసు. వాటిని నవ్వుతూ ఎదుర్కోవడం ఇంకా బాగా తెలుసు. ‘‘మనకు తెలియని వారు, మనమేమిటో తెలియని వారు మనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడే మనకేదో ప్రాధాన్యత ఉందని అర్థమవుతుంది’’ అని చెప్పడం విమర్శలపట్ల ఆమె ఆలోచనా ధోరణిని తెలుపుతుంది. ‘‘మతం నా వ్యక్తిగతం’’, ‘‘నేనెక్కడున్నా, ఎవర్ని పెళ్లాడినా, ఏం జరిగినా... భారతదేశం నా మాతృభూమి’’, ‘‘పెళ్లి ఒక తీయని రాజీ’’, ‘‘నాకు దేశం చాలా ఇచ్చింది. నా అకాడమీ ద్వారా అందులో కొంతైనా తిరిగివ్వాలి’’.. అని చెప్పడంలో సానియా పరిణతి కనిపిస్తుంది. పదిహేనేళ్లకే వచ్చిన స్టార్డమ్ మత్తులో పడిపోకుండా నిలకడగా రాణిస్తూ, రాకెట్‌తోనే విమర్శకులకు సమాధానం చెపుతూ, ఎప్పుడు తగ్గాలో తెలుసుకుని సింగిల్స్‌ను విడిచి డబుల్స్‌కు పరిమితమవుతూ... సానియా ముందుకు సాగిపోతూనే ఉంది! -
పంజాబ్‌లో 18కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం