గురుగ్రామ్:గురుగ్రామ్‌లో భారీ నకిలీ ఇన్‌వాయిస్ రాకెట్‌ను ఇంటెలీజెన్స్ ఐటీ అధికారులు ఛేదించారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి రూ.861 కోట్ల జీఎస్టీని ఎగ్గొట్టినట్లు వెల్లడించారు. ఫేక్ డాక్యుమెంట్‌ల ద్వారా 461 నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించారని పేర్కొన్నారు.
భారీ సంఖ్యలో నకిలీ ధ్రువపత్రాలు, రెంట్ అగ్రిమెంట్లు, కరెంట్ బిల్లులు, ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, పాన్ కార్డుల వంటివి ల్యాప్‌టాప్‌లో గుర్తించినట్లు చెప్పారు. ఈ ఫేక్ డాక్యుమెంట్‌లను ఉపయోగించుకుని నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టిస్తున్నట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే 461 ఫేక్ ఇన్‌వాయిస్‌ల ద్వారా రూ.861కోట్ల విలువైన పన్ను ఎగవేసినట్లు పేర్కొన్నారు. ఈ మోసానికి సంబంధించిన ఇద్దరు ప్రధాన నిందుతులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ ఫేక్ ఇన్‌వాయిస్‌లు ఇనుము, స్టీల్ సెక్టార్‌కు బదిలీ అవుతున్నాయని గుర్తించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి:సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు!
Comments
Please login to add a commentAdd a comment