Invoices
-
నకిలీ ఇన్వాయిస్ల కట్టడికి బయోమెట్రిక్ అథెంటికేషన్
నకిలీ ఇన్వాయిసింగ్ కేసులను అరికట్టడానికి దేశవ్యాప్తంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మోసపూరిత ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ లను ఎదుర్కోవడానికి ఆధార్ ఆథెంటికేషన్ దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.మోదీ ప్రభుత్వం 3.0 ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇదే కావడం గమనార్హం. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.ఆలిండియా ప్రాతిపదికన బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ అథెంటికేషన్ వ్యవస్థను దశలవారీగా అమలు చేస్తామని, ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసాలను అరికట్టడంలో సహాయపడటంతో పాటు, జీఎస్టీలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను బలోపేతం చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
అమరావతిలో ‘ప్రత్తిపాటి’ దోపిడీ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో జరిగిన కుంభకోణాల్లో మరో భారీ అవినీతి బయటపడింది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం రాజధానిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టుల పేరిట రూ.66.03 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు వెల్లడైంది. ప్రత్తిపాటి కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల పేరుతో బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు కొల్లగొట్టి.. షెల్‌కంపెనీల ద్వారా దారి మళ్లించినట్టు ఆధారాలతోసహా బట్టబయలైంది. కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ), రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీ డీఆర్ఐ) సోదాల్లో ఈ వ్యవహారం మొత్తం బయటకొచ్చింది. ఈ కంపెనీ కేంద్ర జీఎస్టీ విభాగాన్ని బురిడీ కొట్టించడంతోపాటు రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడినట్లు తేటతెల్లమైంది. దీంతో డీఆర్ఐ ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి అవెక్సా కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను గురువారం అరెస్టు చేశారు. ఆయనతోపాటు మరో ఆరుగురిపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 467, 471, 477(ఎ), 120 (బి) రెడ్‌విత్ 34 కింద కేసు నమోదు చేశారు. ఆయన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. తీగ లాగితే కదిలిన డొంక ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్‌కు హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం, నెల్లూరు, విజయనగరం జిల్లా మానాపురంలలో బ్రాంచి కార్యాలయాలున్నాయి. ప్రత్తిపాటి పుల్లారావు భార్య తేనే వెంకాయమ్మ డైరెక్టర్‌గా, ఆయన కుమారుడు ప్రత్తిపాటి శరత్ అదనపు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ కంపెనీకి టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టింది. వాటి పనులు చేయకపోయినప్పటికీ, చేసినట్లు గా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించిన అవెక్సా కంపెనీ బిల్లులు డ్రా చేసుకోవడంతోపాటు జీఎస్టీ విభాగం నుంచి అడ్డగోలుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని కూడా పొందింది. దేశవ్యాప్తంగా అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన కంపెనీలపై డీజీజీఐ విచారణ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అవెక్సా కంపెనీ అక్రమంగా ఐటీసీ పొందిందని వెల్లడి కావడంతో ఆ కంపెనీకి డీజీజీఐ రూ.16 కోట్ల జరిమానా విధిస్తూ షోకాజ్ కమ్ డిమాండ్ నోటీసు జారీ చేయాలని ప్రతిపాదించింది. అసలు అవెక్సా కార్పొరేషన్ వ్యవహారాలు, కాంట్రాక్టులు, బిల్లుల చెల్లింపులపై డీజీజీఐ, ఏపీ డీఆర్ఐ దృష్టిసారించాయి. ఆ కంపెనీ కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించడంతో మొత్తం బాగోతం బట్టబయలైంది. షెల్ కంపెనీలను సబ్ కాంట్రాక్టర్లుగా చూపించి రూ.21.93 కోట్లు అవెక్సా కార్పొరేషన్ ముసుగులో ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. 2017 నుంచి అవెక్సా కార్పొరేషన్ పేరుతో ప్రత్తిపాటి కుటుంబం అమరావతిలో కాంట్రాక్డు సంస్థలను బెదిరించి సబ్ కాంట్రాక్టులు తీసుకుంది. పనులు చేయకుండానే అక్రమంగా నిధులు కొల్లగొట్టింది. జాక్సన్ ఎమినెన్స్ (ప్రస్తుత పేరు జైశ్నవి ఎమినెన్స్) అనే కంపెనీ అమరావతిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టును పొందింది. ఆ కంపెనీ నుంచి రూ.37.39 కోట్ల విలువైన పనులను అవెక్సా కార్పొరేషన్ సబ్ కాంట్రాక్టుకు తీసుకుంది. సీఆర్డీయే పరిధిలో రోడ్లు, వరదనీటి కాలువలు, కల్వర్టులు, సివరేజ్ పనులు, వాకింగ్ ట్రాక్‌లు, పచ్చదనం తదితర పనులు అవెక్సా కార్పొరేషన్ చేయాల్సి ఉంది. అయితే, ఈ సంస్థ తానిషా ఇన్ఫ్రా, రాలాన్ ప్రోజెక్ట్స్, అనయి ఇన్ఫ్రా అల్వేజ్ టౌన్ ప్లానర్స్ అనే నాలుగు కంపెనీలకు రూ.21.93 కోట్లకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చినట్టు చూపించింది. ఆ సబ్ కాంట్రాక్టుల ముసుగులోనే అవెక్సా కంపెనీ ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు డీఆర్ఐ సోదాల్లో వెల్లడైంది. సబ్ కాంట్రాక్టుకు ఇచ్చామని చెప్పిన నాలుగు కంపెనీల నుంచి బోగస్ ఇన్వాయిస్లు, బిల్లులు పొంది ఆ మేరకు పనులు చేసినట్టుగా కనికట్టు చేసింది. ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లుల సొమ్ము పొందింది. కేంద్ర జీఎస్టీ నుంచి అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను కూడా తీసుకుంది. వాస్తవానికి సబ్ కాంట్రాక్టు సంస్థల నుంచి అవెక్సా కంపెనీ ఎలాంటి సేవలూ పొందలేదు. అవి ఏ పనులూ చేయలేదు. ఆ నాలుగు కంపెనీలూ షెల్ కంపెనీలే. వాటి పేరుతో మొత్తం రూ.21,93,08,317 నిధులను ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అక్రమంగా తరలించింది. రహదారి కాంట్రాక్టుల ముసుగులో రూ.26.25 కోట్లు దోపిడీ అంతటితో అవెక్సా కంపెనీ అక్రమాలు ఆగలేదు. అమరావతిలోని ఉద్దండరాయపురం నుంచి నిడమర్రు వరకు ఎన్ 9 రోడ్డు నిర్మాణ కాంట్రాక్టును బీఎస్ఆర్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్టుకు తీసుకుంది. కానీ ఎలాంటి రోడ్డు పనులు చేయకుండానే అక్రమంగా బిల్లులు సమర్పించి ప్రజాధనాన్ని సొంత ఖాతాలోకి మళ్లించుకుంది. రహదారి నిర్మాణం కోసం మెటీరియల్ కొనుగోలు చేసినట్టు, వివిధ వృత్తి నిపుణుల సేవలు పొందినట్టు బీఎస్ఆర్ కంపెనీ పేరిట బోగస్ బిల్లులు సమర్పించి కనికట్టు చేసింది. అందుకోసం క్వాహిష్ మార్కెటింగ్ లిమిటెడ్, నోయిడా ఎస్పాత్ లిమిటెడ్, ప్రశాంత్ ఇండస్ట్రీస్, గోల్డ్ ఫినెక్స్ ఐరన్ – స్టీల్ కంపెనీల నుంచి మెటీరియల్ కొనుగోలు చేసినట్టు బోగస్ బిల్లులు సమర్పించింది. ఆ విధంగా ఏ పనీ చేయకుండానే వివిధ దశల్లో రూ.26,25,19,393 దోపిడీ చేసింది. గృహ నిర్మాణ ప్రాజెక్టుల పేరిట అక్రమంగా రూ.17.85 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టులోనూ అవెక్సా కంపెనీ అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టింది. ఏపీ టిడ్కో కింద జి+3 గృహ నిర్మాణ ప్రాజెక్టు, విశాఖపట్నంలో హుద్‌హుద్ తుపాను బాధితులకు 800 గృహాల నిర్మాణ ప్రాజెక్టు, మిడ్ పెన్నార్ ప్రాజెక్టు ఆధునీకరణ సబ్ కాంట్రాక్టులు పొందింది. ఆ ప్రాజెక్టుల బిల్లుల కింద బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము పొందింది. ఈమేరకు ఆధ్యా ఎంటర్‌ప్రైజస్, మెస్సెర్స్ సంజయ్ కుమార్ భాటియా, తనిష్క్ స్టీల్ లిమిటెడ్, మౌంట్ బిజినెస్ బిల్డ్ లిమిటెడ్ కంపెనీల నుంచి మెటీరియల్ కొన్నట్లు బోగస్ ఇన్వాయిస్లు, బిల్లులు సమర్పించింది. ఆ పేరుతో ఏకంగా రూ.17,85,61,864 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందింది. ఈ విధంగా అవెక్సా కార్పొరేషన్ కంపెనీ ద్వారా ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం మొత్తం రూ.66,03,89,574 ప్రజాధనాన్ని కొల్లగొట్టింది. అవును ...భోగస్ బిల్లులతో నిధులు కొల్లగొట్టాం – అవెక్సా కంపెనీ డైరెక్టర్ కుర్ర జగదీశ్వరరావు ఈ వ్యవహారంపై డీజీజీఐ, ఏపీ డీఆర్ఐ విచారణలో మొత్తం లోగుట్టు బట్టబయలైంది. అవెక్సా కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న కుర్ర జగదీశ్ తాము బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి అక్రమంగా బిల్లులు డ్రా చేసుకున్నామని అంగీకరించారు. ఈ కుంభకోణానికి ఎలా పాల్పడిందీ ఆయన సవివరంగా వెల్లడించారు. దాంతో అవెక్సా కంపెనీ ముసుగులో ప్రత్తిపాటి కుటుంబం అవినీతి బాగోతం ఆధారాలతోసహా బట్టబయలైంది. తనయుడి కోసం తండ్రి పుల్లారావు చక్కర్లు విజయవాడ స్పోర్ట్స్/గుణదల (విజయవాడ తూర్పు): అమరావతి పనుల కుంభకోణంలో దొరికిపోయిన ప్రత్తిపాటి శరత్ కోసం అతని తండ్రి, టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి పత్త్రిపాటి పుల్లారావు విజయవాడలో చక్కర్లు కొట్టారు. డీఆర్ఐ ఫిర్యాదుపై శరత్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు అత్యంత గోప్యంగా విచారణ చేపట్టారు. దీంతో శరత్ జాడ కోసం అతని తండ్రి పుల్లారావు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఇతర టీడీపీ నాయకులను వెంటేసుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షణలు చేశారు. ముందుగా గురునానక్ కాలనీలోని ఏసీపీ కార్యాలయానికి, అక్కడ లేకపోవడంతో మాచవరం పోలీస్ స్టేషన్‌కు, ఆ తర్వాత టాస్‌్కఫోర్స్ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం తన అనుచరులను నగరం నలుదిక్కులకు పంపారు. ఆ తరువాత సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతోందని తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. అక్కడా లేకపోవడంతో టీడీపీ కార్యాలయానికి వచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో పుల్లారావు, పట్టాభి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులతో కలిసి పోలీసు కమిషనరేట్‌కు చేరుకొని తన కొడుకును చూపించాలంటూ ఆందోళనకు దిగారు. కొద్ది సేపటి తరువాత రూరల్ డీసీపీ కె.శ్రీనివాసరావు వచ్చి ఓ గంటలో న్యాయమూర్తి వద్ద నిందితుడు శరత్‌ను ప్రవేశపెడతామని చెప్పడంతో ఆందోళన విరమించి మాచవరంలోని జడ్జి క్వార్టర్స్‌కు వెళ్లారు. -
‘భారత్‌పే’లో నిధులు బొక్కేశారు!,మరో వివాదంలో అశ్నీర్ గ్రోవర్ దంపతులు
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే కో-ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్లు మరో వివాదంలో చిక్కుకున్నారు. ది ఎకనామిక్స్ ఆఫెన్స్ వింగ్స్ (ఈవోడ్ల్యూ) విచారణలో ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పేలో ఉండగా ఉద్యోగాల పేరిట మోసపూరిత లావాదేవీలు చేసినట్లు తేలింది. ఈ లావాదేవీలను భారత్‌పేలో కోచింగ్, డెవలప్మెంట్, రిక్రూట్మెంట్, రిసోర్స్ ప్లానింగ్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన అశ్నీర్ భార్య మాధూరి జైన్ గ్రోవర్‌ను అడ్డుపెట్టుకుని చేసినట్లు తెలుస్తోంది. ఈ స్కాంలో మాధూరి జైన్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఈఓడబ్ల్యూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రిక్రూట్మెంట్ వర్క్‌కు సంబంధించిన కమిషన్లు చెల్లించేందుకు నిధులు కావాలంటూ తప్పుడు తేదీలు, ఇన్వాయిస్లు తయారు చేసినట్లు ఆరోపిస్తుంది. అంతేకాదు భారత్‌పేలో ఉద్యోగుల్ని నియామకాల కోసం నియమించుకున్న హెచ్ఆర్ కన్సల్టెన్సీలకు రూ.7.6 కోట్లు, జీఎస్టీ సకాలంలో చెల్లించలేదని, అదనపు ఛార్జీల కింద రూ.1.6 కోట్లు, ఇతర ఫేక్ ట్రాన్సాక్షన్స్ రూ.71.76 కోట్లు ఉన్నట్లు తేలింది. ఇలా మూడు సార్లుగా చేసిన మోసపూరిత లావాదేవీలు విలువ రూ.81 కోట్లుగా ఉందని ఈఓడబ్ల్యూ విచారణలో గుర్తించింది. ఆ విచారణ ఇంకా కొనసాగుతుంది. -
పక్కా కుట్రతోనే స్కిల్ దోపిడీ
సాక్షి, అమరావతి : ‘చంద్రబాబు పక్కా కుట్రతోనే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రాజెక్ట్ ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. 2014–15లో ముఖ్యమంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేస్తూ, కుట్ర పూరితంగా షెల్ కంపెనీలు సృష్టించి ఫేక్ ఇన్వాయిస్లు సమర్పించి రూ.371 కోట్లను అక్రమంగా తరలించారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట రూ.3,300 కోట్ల ప్రాజెక్టును కేవలం కాగితాలపై సృష్టించడం.. ప్రాజెక్టు చేపట్టకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయడం.. షెల్ కంపెనీల ద్వారా తరలించడం.. ఇలా అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. ప్రజాధనం కొల్లగొట్టాలనే పక్కా పన్నాగంతో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ సృష్టికర్త.. ఆ కుంభకోణంతో అక్రమంగా నిధులు పొందిన లబ్ధిదారూ రెండూ చంద్రబాబే’ అని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసులో అరెస్ట్ చేసిన చంద్రబాబును ఆదివారం ఉదయం విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఈ సందర్భంగా 29 పేజీల రిమాండ్ రిపోర్ట్‌ను సీఐడీ న్యాయస్థానంలో సమర్పించింది. అవినీతి కుంభకోణాన్ని పూర్తిగా వెలికి తీసి, దోషులను శిక్షించేందుకు సమగ్ర దర్యాప్తు సాఫీగా సాగాలంటే చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరింది. ‘గత టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుతోపాటు ఇతర నిందితులు 38 మంది సహకారంతో చంద్రబాబు ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించడంలో చంద్రబాబు తనయుడు నారా లోకేశ్, ఆయన సన్నిహితుడు కిలారు రాజేష్ కీలక పాత్ర పోషించారు’ అని వెల్లడించింది. రిమాండ్ రిపోర్ట్‌లో ఇంకా ఏం చెప్పిందంటే.. దోచేందుకే ప్రాజెక్ట్.. యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకే ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు రూపొందించారు. టీడీపీ నేత ఇల్లెందుల రమేశ్ ద్వారా డిజైన్‌టెక్, ఎస్‌ఐఎస్‌డబ్ల్యూ సంస్థలు ఆయన్ను సంప్రదించాయి. దాంతో రాష్ట్ర కేబినెట్ ఆమోదం లేకుండానే ఏపీఎస్ఎస్డీసీని ఏర్పాటు చేశారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ఇండియా హెడ్‌గా ఉన్న సుమన్‌బోస్, డిజైన్ టెక్ ఎంపీ వికాస్ వినాయక్ కన్వేల్కర్ ఈ కుట్రలో భాగస్వాములయ్యారు. ఏపీఎస్ఎస్డీసీ, సీమెన్స్–డిజైన్‌టెక్ కంపెనీలు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అనంతరం ఏపీఎస్‌ఎస్‌డీకి డైరెక్టర్‌గా తన సన్నిహిడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎండీ–సీఈవోగా గంటా సుబ్బారావును నియమించారు. ఏపీఎస్ఎస్డీసీని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎంటర్ ప్రైజస్, ఇన్నోవేషన్ విభాగాన్ని ఏర్పాటు చేసి అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు బాధ్యతలు అప్పగించారు. ఎలాంటి సర్వే లేకుండానే కేవలం డిజైన్‌టెక్ కంపెనీ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఆధారంగా ఆ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో డిజైన్‌టెక్ భాగస్వామిగా ప్రాజెక్ట్‌ను ఖరారు చేశారు. రూ.3,300 కోట్లతో ప్రాజెక్ట్‌ను ఆమోదించి.. అందులో సీమెన్స్–డిజైన్‌టెక్ కంపెనీలు 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరుస్తాయని ఒప్పందంలో పేర్కొన్నారు. నిధులు ఇచ్చేయండని చంద్రబాబు ఆదేశం ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ కంపెనీ తన వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్ఎస్డీసీ వాటా 10 శాతం కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించేశారు. అందుకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శి సునీత నోట్ ఫైళ్లపై లిఖితపూర్వకంగా అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదు. చంద్రబాబు ఆదేశాలతోనే సీమెన్స్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆర్థిక శాఖ అధికారులు ఆ నోట్‌ఫైళ్లలో స్పష్టం చేస్తూ ఆ నిధులు విడుదల చేశారు. లోకేశ్‌దీ కీలక పాత్ర షెల్ కంపెనీల ద్వారా నిధులు ముంబయి నుంచి హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి చంద్రబాబు నివాసానికి చేర్చడంలో ఆయన తనయుడు నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారు. లోకేశ్ తన సన్నిహితుడు కిలారు రాజేశ్ ద్వారా ఆ నిధుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు. ఫైళ్లు మాయంటీడీపీ హయాంలోనే 2018లో కేంద్ర జీఎస్టీ అధికారులు ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణాన్ని గుర్తించారు. పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను జప్తు చేశారు. వాటిలో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. నిధులు కొల్లగొట్టేందుకుగ్రీన్ చానల్ ఆ ప్రాజెక్ట్ నిధులను షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా గ్రీన్ చానల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. విద్యా శాఖతో నిమిత్తం లేకుండా ఏపీఎస్ఎస్డీసీ నుంచి నేరుగా ఎంటర్‌ప్రైజస్– ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ అక్కడ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైళ్లు పంపాలని ఆదేశించారు. ఆ మేరకు డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేసిన రూ.371 కోట్లలో రూ.279 కోట్లను యోగేశ్ గుప్తా మన దేశంతోపాటు సింగపూర్, దుబాయ్‌లలోని షెల్ కంపెనీలకు తరలించారు. అనంతరం షెల్ కంపెనీల కమీషన్లు మినహాయించుకుని హవాలా మార్గంలో, బ్యాంకు నుంచి డ్రా చేసి మొత్తం రూ.241 కోట్లను షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి ముంబయిలో అందించారు. ఆ నగదును మనోజ్ పార్థసాని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. ఆయన ఆ రూ.241 కోట్లు చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. కస్టడీలో విచారించాల్సినఅవసరం ఉంది ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం మాస్టర్ మైండ్ చంద్రబాబుకు అత్యున్నత స్థాయిలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే సిట్ విచారణ కోసం నోటీసులు జారీ చేసిన యోగేశ్ గుప్తా, మనోజ్ పార్థసాని విదేశాలకు పరారయ్యారు. మిగిలిన సాక్షులను కూడా చంద్రబాబు బెదిరించి దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన్ను అరెస్టు చేశాం. ఆయన బయట ఉంటే కేసు దర్యాప్తు పక్కదారి పట్టే అవకాశాలున్నాయి. అందువల్ల ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది. -
నికర ఇన్వాయిస్ ధరను బట్టే లైఫ్ ట్యాక్స్
సాక్షి, అమరావతి: మోటారు కార్ల కొనుగోలు సమయంలో విధించే జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్).. వాహన నికర ఇన్వాయిస్ ధర (పన్నులు కలపక ముందు నిర్ణయించిన ధర) ఆధారంగానే ఉండాలని హైకోర్టు తెలిపింది. అంతేకానీ.. వాహన ఎక్స్ షోరూమ్ ధర (పన్నులన్నీ కలిపి నిర్ణయించిన ధర) ఆధారంగా కాదని స్పష్టం చేసింది. ఏపీ మోటారు వాహనాల ట్యాక్సేషన్ చట్టంలోని 6వ షెడ్యూల్ ప్రకారం లైఫ్ ట్యాక్స్‌ను వాహన ధర ఆధారంగానే వసూలు చేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఇద్దరు వాహనదారుల నుంచి అధికంగా వసూలు చేసిన లైఫ్ ట్యాక్స్ మొత్తాన్ని నాలుగు వారాల్లో వారికి వాపసు ఇవ్వాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయన సుజాత ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. తాను కొనుగోలు చేసిన హ్యుందాయ్ వెన్యూ కారుకు వాహన ధర మీద కాకుండా నికర ఇన్వాయిస్ ధర మీద 14 శాతం పన్నును చట్టవిరుద్ధంగా వసూలు చేశారని విజయవాడకు చెందిన తలశిల సౌజన్య 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన నుంచి అదనంగా వసూలు చేసిన రూ.52,168 తిరిగి వాపసు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని విన్నవించారు. అలాగే ఇదే రీతిలో తన నుంచి అదనంగా వసూలు చేసిన రూ.1.16 లక్షలను వాపసు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విజయవాడకు చెందిన వల్లూరు పవన్ చంద్ 2021లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ సుజాత ఇటీవల తుది విచారణ జరిపారు. వాహన ధరపైనే లైఫ్ ట్యాక్స్.. రవాణా శాఖ తరఫు న్యాయవాది కోనపల్లి నర్సిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. లైఫ్ ట్యాక్స్‌ను వాహన ధరపైనే నిర్ణయిస్తారన్నారు. వాహన ధర అంటే డీలర్‌కు వాహన కొనుగోలుదారు చెల్లించే మొత్తమని.. ఇందులో జీఎస్టీ, సెస్ వంటివి కలిపి ఉంటాయని తెలిపారు. అందువల్ల పన్నులు కలిపిన మొత్తం మీదనే లైఫ్ ట్యాక్స్ విధించామన్నారు. ఇలా చేయడం ఎంత మాత్రం చట్టవిరుద్ధం కాదన్నారు. అంతేకాకుండా 1994లో రవాణా శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం వాహన ధర అంటే అన్ని పన్నులతో కలిపి చెల్లించే మొత్తమన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ల తరఫు న్యాయవాది చక్రవర్తి వాదనలతో ఏకీభవించారు. లైఫ్ ట్యాక్స్‌ను వాహన నికర ఇన్వాయిస్ ధర ఆధారంగానే వసూలు చేయాలని తేల్చిచెప్పారు. ఎక్స్‌షోరూం ధర వాహన ధర కాదు.. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎమ్మార్కే చక్రవర్తి వాదనలు వినిపిస్తూ.. వాహన ధర అంటే వాహనదారు డీలర్‌కు చెల్లించే మొత్తమన్నారు. ఈ ధర ఆధారంగానే డీలర్.. వాహనదారుకు వాహనాన్ని బదలాయిస్తారని తెలిపారు. అంతేతప్ప పన్నులన్నింటితో కలిపి చెల్లించే ఎక్స్ షోరూం ధర ఎంతమాత్రం వాహన ధర కాదన్నారు. హ్యుందాయ్ వెన్యూ ఇన్వాయిస్ ధర రూ.8,60,853 అని తెలిపారు. నిబంధనల ప్రకారం.. రూ.10 లక్షలకన్నా తక్కువ విలువ చేసే వాహనానికి 12 శాతం మాత్రమే లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీని ప్రకారం రూ.8.60 లక్షలకు 12 శాతం లెక్కన రూ.1,03,302 లైఫ్ ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుందని నివేదించారు. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో ఎక్స్‌షోరూం ధరను రూ.11,10,500గా పేర్కొంటూ.. వాహన ధర రూ.10 లక్షలకు మించింది కాబట్టి 14 శాతం పన్ను చెల్లించాలని పిటిషనర్‌తో బలవంతంగా రూ.1,55,470ను లైఫ్ ట్యాక్గా కట్టించుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. తద్వారా రూ.52168 అదనంగా వసూలు చేశారన్నారు. అలాగే రెండో పిటిషనర్ వల్లూరు పవన్ చంద్‌కు చెందిన బీఎండబ్ల్యూ కారు విషయంలో కూడా ఇలాగే జరిగిందన్నారు. ఇన్వాయిస్ ధరపై కాకుండా ఎక్స్‌షోరూమ్ ధరపై 14 శాతం పన్ను వసూలు చేశారని తెలిపారు. ఇలా పవన్ చంద్ నుంచి రూ.1.16 లక్షలు అదనంగా పన్ను కట్టించుకున్నారని వివరించారు. -
నకిలీ ఇన్వాయిస్ రాకెట్..రూ.861 కోట్ల జీఎస్టీ ఎగవేత..
గురుగ్రామ్:గురుగ్రామ్‌లో భారీ నకిలీ ఇన్వాయిస్ రాకెట్‌ను ఇంటెలీజెన్స్ ఐటీ అధికారులు ఛేదించారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి రూ.861 కోట్ల జీఎస్టీని ఎగ్గొట్టినట్లు వెల్లడించారు. ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా 461 నకిలీ ఇన్వాయిస్లను సృష్టించారని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో నకిలీ ధ్రువపత్రాలు, రెంట్ అగ్రిమెంట్లు, కరెంట్ బిల్లులు, ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, పాన్ కార్డుల వంటివి ల్యాప్‌టాప్‌లో గుర్తించినట్లు చెప్పారు. ఈ ఫేక్ డాక్యుమెంట్లను ఉపయోగించుకుని నకిలీ ఇన్వాయిస్లను సృష్టిస్తున్నట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే 461 ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా రూ.861కోట్ల విలువైన పన్ను ఎగవేసినట్లు పేర్కొన్నారు. ఈ మోసానికి సంబంధించిన ఇద్దరు ప్రధాన నిందుతులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ ఫేక్ ఇన్వాయిస్లు ఇనుము, స్టీల్ సెక్టార్‌కు బదిలీ అవుతున్నాయని గుర్తించినట్లు చెప్పారు. ఇదీ చదవండి:సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు! -
జీఎస్టీ నిబంధనల్లో మార్పులు.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్!
జీఎస్టీ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం.. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు ఆగస్టు 1 నుంచి బిజినెస్-టు-బిజినెస్ (B2B) లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ లేదా ఈ -ఇన్‌వాయిస్‌ని రూపొందించడం తప్పనిసరి. ప్రస్తుతం రూ.10 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు ఈ -ఇన్వాయిస్ నిబంధన అమలులో ఉంది. ఇదీ చదవండి: సిటీ గ్రూపు నుంచి డిజిటల్ క్రెడిట్ కార్డ్.. లాభాలేంటో తెలుసా? కేంద్ర ఆర్థిక శాఖ మే 10 నాటి నోటిఫికేషన్ ద్వారా ఈ -ఇన్వాయిస్ నమోదు పరిమితిని తగ్గించింది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు B2B లావాదేవీలకు సంబంధించి ఈ -ఇన్వాయిస్లను సమర్పించాలి. ఈ నిబంధన ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! జీఎస్టీ చట్టం ప్రకారం.. 2020 అక్టోబర్ 1 నుంచి రూ. 500 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు B2B లావాదేవీల సంబంధించి ఈ -ఇన్వాయిసింగ్ సమర్పించడం తప్పనిసరిగా ఉండేది. ఆ తర్వాత 2021 జనవరి 1 నుంచి రూ.100 కోట్లకు మించిన టర్నోవర్ ఉన్న సంస్థలకూ ఇది అమలలోకి వచ్చింది. 2021 ఏప్రిల్ 1 నుంచి రూ. 50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు B2B ఈ -ఇన్వాయిస్లను సమర్పిస్తున్నాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన రూ. 20 కోట్ల టర్నోవర్ కు, 2022 అక్టోబర్ 1 నుంచి రూ. 10 కోట్ల టర్నోవర్ కు తగ్గింది. -
New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు!
వ్యాపార సంస్థలకు సంబంధించి జీఎస్టీ కొత్త రూల్ మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తోంది. రూ. 100 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు తమ ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్లను జారీ చేసిన 7 రోజులలోపు ఐఆర్పీ (ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్)లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని జీఎస్టీ నెట్వర్క్ తెలిపింది. ప్రస్తుతం వ్యాపార సంస్థలు తమ ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్లను జారీ చేసిన తేదీతో సంబంధం లేకుండా ఐఆర్‌పీలో అప్లోడ్ చేస్తున్నాయి. ఇకపై అలా కుదరదు. రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులు ఈ-ఇన్వాయిస్ ఐఆర్పీ పోర్టల్లలో పాత ఇన్వాయిస్లను అప్లోడ్ చేయడానికి కాల పరిమితిని విధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జీఎస్టీ నెట్వర్క్ పేర్కొంది. ఈ కొత్త ఫార్మాట్ 2023 మే 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ పరిమితి ఇన్వాయిస్లకు మాత్రమే వర్తిస్తుంది. డెబిట్ లేదా క్రెడిట్ నోట్లను నివేదించడంలో ఎలాంటి కాల పరిమితి లేదు. జీఎస్టీ చట్టం ప్రకారం.. ఐఆర్‌పీలో ఇన్వాయిస్లు అప్లోడ్ చేయకపోతే వ్యాపార సంస్థలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందలేవు. ప్రస్తుతం రూ. 10 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు అన్ని బీ2బీ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ను రూపొందించడం తప్పనిసరి. జీఎస్టీ చట్టం ప్రకారం.. 2020 అక్టోబర్ 1 నుంచి రూ. 500 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలకు బిజినెస్-టు-బిజినెస్ (B2B) లావాదేవీల కోసం ఈ-ఇన్వాయిస్ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆ తర్వాత 2021 జనవరి 1 నుంచి రూ. 100 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వారికి కూడా దీన్ని వర్తింపజేసింది. 2021 ఏప్రిల్ 1 నుంచి రూ. 50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు B2B ఈ-ఇన్వాయిస్లను సమర్పిస్తున్నాయి. అయితే 2022 ఏప్రిల్ 1 నుంచి ఆ పరిమితి రూ. 20 కోట్లకు, 2022 అక్టోబర్ 1 నుంచి రూ.10 కోట్లకు తగ్గించారు. -
రూపీలోనే ఇన్వాయిస్, చెల్లింపులు, భారీ ఊరట
న్యూఢిల్లీ: రూపాయి మారకంలోనే ఇన్వాయిసింగ్, చెల్లింపులు, ఎగుమతుల, దిగుమతుల సెటిల్ మెంట్లకు అనుమతిస్తూ వాణిజ్య శాఖ నిర్ణయం తీసుకుంది. రూపాయి మారకంలో వాణిజ్య నిర్వహణకు ఆసక్తి పెరగడంతో.. ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలకు వీలుగా అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్బీఐ ఈ ఏడాది జూలైలోనే బ్యాంకులను కోరడం గమనార్హం. ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా విదేశీ వాణిజ్య విధానంలో కొత్త పారాగ్రాఫ్‌ను చేర్చినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ప్రకటించింది. -
రాబడి కోసం కొత్త మార్గం..!
కొందరు ఇన్వెస్టర్లు కొత్త పెట్టుబడి సాధనాల కోసం తరచూ అన్వేషిస్తుంటారు. పెట్టుబడుల్లో ఎక్కువ వైవిధ్యం కోరుకుంటారు. కొందరికి రాబడే ప్రామాణికం. రిస్క్ ఉన్నా ఫర్వాలేదు ఎక్కువ రాబడి కావాలన్నది వారి విధానం. ముఖ్యంగా నేటి తరం యువ ఇన్వెస్టర్లు స్థిరమైన ఆదాయం కోసం డెట్‌కు ప్రత్యామ్నాయ సాధనాల కోసం చూస్తున్నారు. సంప్రదాయ డెట్ సాధనాలతో పోలిస్తే వారికి ఎక్కువ రాబడి కావాలి. ఈక్విటీ మార్కెట్లలో మాదిరిగా అస్థిరతలు ఉండకూడదు. ఎలానూ ఈక్విటీల్లో కొంత ఇన్వెస్ట్ చేస్తారు. కనుక ప్రత్యామ్నాయాలు కోరుకునే వారు పెరిగిపోతున్నారు. ఈ తరహా ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చిన సాధనమే ‘ఇన్వాయిస్ ఇన్వెస్టింగ్’. ఇది ఎలా పనిచేస్తుంది? రాబడులు ఏ మేరకు ఉంటాయి? తదితర వివరాలను అందించే ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది.. ఇన్వాయిస్ ఫైనాన్స్ / డిస్కౌంటింగ్ అంటే... ఇన్వాయిస్ ఫైనాన్స్, డిస్కౌంటింగ్‌ను సులభంగా అర్థం చేసుకుందాం. ఒక పేపర్ తయారీ కంపెనీ ఉంది. రూ.లక్ష విలువ చేసే పేపర్‌ను నోట్‌బుక్ తయారీ కంపెనీకి విక్రయించింది. ఒప్పందం ప్రకారం 90 రోజుల తర్వాత రూ.లక్షను నోట్‌బుక్ తయారీ కంపెనీ చెల్లిస్తే చాలు. కానీ, అంతకంటే ముందే నిధుల అవసరం పేపర్ కంపెనీకి ఏర్పడింది. దీంతో నోట్‌బుక్ కంపెనీ నుంచి రావాల్సిన రూ.లక్ష ఇన్వాయిస్ను రూ.90వేలకే ఒక ప్లాట్ఫామ్లో విక్రయానికి ఉంచింది. దీన్ని ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అంటారు. ఈ డీల్‌లో పేపర్ కంపెనీకి వెంటనే రూ.90వేల క్యాష్ ఫ్లో అందుతుంది. దీన్ని కొనుగోలు చేసిన ఇన్వెస్టర్‌కు 90 రోజులకే రూ.10వేల లాభం వస్తుంది. అలా కాకుండా.. ఇదే పేపర్ తయారీ కంపెనీ నోట్ బుక్ కంపెనీ నుంచి రావాల్సిన రూ.లక్ష ఇన్వాయిస్ను వెంటనే నగదుగా మార్చుకోవాలని అనుకుంది. డిస్కౌంట్‌కు విక్రయించకుండా, 90 రోజుల కాలానికి 12 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తూ రూ.లక్ష రుణం కోరింది. దీన్ని ఇన్వాయిస్ ఫైనాన్సింగ్ అంటారు. ఎలా పనిచేస్తుంది..? ఇది స్టార్టప్‌ల కాలం. ఏటేటా వందలాది స్టార్టప్‌లు ఉనికిలోకి వస్తున్నాయి. వీటి విస్తరణకు నిధులు అవసరం ఎంతో ఉంటుంది. అదే సమయంలో అవి నిధుల కోసం ప్రతిసారి ఈక్విటీ జారీ మార్గాన్ని ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఈక్విటీ విలువ పలుచబడిపోతుంది. దీనివల్ల రాబడులూ పలుచన అవుతాయి. ఇక్కడే రెవెన్యూ బేస్డ్ ఫైనాన్సింగ్ (కంపెనీల ఆదాయాన్ని చూసి రుణాలు ఇవ్వడం) అవసరం ఎదురవుతుంది. ఇది అటు స్టార్టప్‌లకు, ఇటు పెట్టుబడి అందించే వారికీ ప్రయోజనం చేకూరుస్తుంది. కంపెనీలకు తలనొప్పి లేని నిధులు అందుతాయి. జిరాఫ్, బెటర్ఇన్వెస్ట్, క్రెడ్ఎక్స్ ఇలా పలు సంస్థలు ఇన్వెస్టింగ్ ఫైనాన్సింగ్‌కు సంబంధించి మంచి పెట్టుబడుల అవకాశాలను ఆఫర్ చేస్తుంటాయి. వెంచర్ క్యాపిటల్ (వీసీ), ఏంజెల్ ఇన్వెస్టర్లు ఉన్నారు కదా? అన్న ప్రశ్న ఎదురుకావచ్చు. కానీ, ఇవి ఊరికే పెట్టుబడులు అందించవు. భారీ రాబడులు ఆశిస్తాయి. లేదంటే తాము అందించే పెట్టుబడులకు భారీ వాటా కోరుకుంటుంటాయి. రిస్క్ ఎక్కువగా ఉండే వ్యాపారాలకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి నిధులు లభించడం అసాధ్యం. అందుకనే ఆదాయం చూసి రుణాలు అందించే ఆర్బీఎఫ్ మార్కెట్ విస్తరిస్తోంది. ఈ విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్లకు ‘ఇన్వాయిస్ ఫైనాన్స్/ఇన్వాయిస్ డిస్కౌంటింగ్’ రూపంలో పెట్టుబడుల అవకాశాలు లభిస్తాయి. ఇన్వాయిస్ల రూపంలో కంపెనీలు తమకు కావాల్సిన నిధులను సమకూర్చుకుంటాయి. ఇన్వాయిస్లపై కంపెనీలకు నిధులు రావాల్సి ఉన్నప్పుడు.. వాటిని ఇన్వెస్టర్లకు హామీగా ఉంచి/లేదా విక్రయించి కంపెనీలు నిధులు కోరతాయి. సౌకర్యవంతం... ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. వారికి భిన్నమైన పెట్టుబడుల అవకాశాలను అందించేందుకు ఎన్నో ఆన్లైన్ వేదికలు కూడా ఏర్పాటువుతున్నాయి. అలా వచ్చిందే ఇన్వాయిస్ ఇన్వెస్టింగ్. 18 ఏళ్లు నిండి, కేవైసీ పూర్తి చేసిన వారు వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనీస పెట్టుబడి లక్ష రూపాయిల నుంచి మొదలవుతుంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌లు, కొన్ని కేసుల్లో కనీసం రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. తమ ప్లాట్‌ఫామ్‌పై నమోదైన ఇన్వెస్టర్లకు ఆయా సంస్థలు పెట్టుబడుల అవకాశాలను తీసుకొస్తుంటాయి. ఇందుకోసం ఇన్వెస్టర్, రుణ గ్రహీత ఇద్దరి నుంచి ‘స్ప్రెడ్ (వడ్డీ రేటు మధ్య వ్యత్యాసం) రూపంలో చార్జీలను వసూలు చేస్తాయి. పెట్టుబడుల అవకాశాలను లిస్టింగ్ చేసేందుకు కూడా చార్జీ తీసుకుంటాయి. రుణం కోసం కంపెనీలు ఆఫర్ చేసే ఇన్వాయిస్లను ఆయా ప్లాట్‌ఫామ్‌లు ముందుగా తనిఖీ చేస్తాయి. అవి నిజమైనవా, కావా అన్నది నిర్ధారించుకుంటాయి. అంతా డీజిటల్‌గా జరిగిపోయే విధానం కావడంతో ఇరువైపుల వారికి సౌకర్యంగా ఉంటుంది. పైగా అందుబాటు ధరలకే నిధులు కంపెనీలకు లభిస్తాయి. ఇన్వెస్టర్లకు కూడా మెరుగైన రాబడులు అందుతాయి. కొత్తవారు, అనుభవం లేని వారు అయితే తెలిసిన ఇన్వెస్టర్‌తో సంయుక్తంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడుల అవకాశాలు జిరాఫ్ ప్లాట్‌ఫామ్.. ఏడేళ్ల చరిత్ర కలిగిన లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ డీల్ ను అందిస్తోంది. కాలవ్యవధి కేవలం 91 రోజులు. దీని ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఐఆర్ఆర్) 12.25 శాతంగా ఉంది. అంటే రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే మూడు నెలల్లో రూ.1.03 వేలు లభిస్తాయి. జిరాఫ్ డీల్‌ను లిస్ట్ చేయడానికే పరిమితం కాదు. సదరు పెట్టుబడిని కాల వ్యవధి వరకు పర్యవేక్షిస్తుంటుంది. ఇన్వెస్టర్లకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఇస్తుంది. డిఫాల్ట్ అవకాశాలు ఏర్పడితే... డిఫాల్ట్ (ఎగవేత) అవకాశాలు ఉన్నట్టు భావిస్తే ఇన్వెస్టర్ల తరఫున తనే ఆయా హక్కులను వినియోగించుకుని డీల్స్‌ను క్లోజ్ చేసి, నిధులు రాబడుతుంది. జిరాఫ్ ప్లాట్‌ఫామ్‌పై 30/60 రోజుల కాలవ్యవధితో కూడిన ‘ఇన్వాయిస్ డిస్కౌంటింగ్’ డీల్ కూడా ఉంది. క్రెడ్ఎక్స్ ప్లాట్ఫామ్లో కనీస పెట్టుబడి రూ.3 లక్షలుగా ఉంది. కాల వ్యవధి 30/90 రోజులు. ఇక బెటర్ఇన్వెస్ట్ ప్లాట్‌ఫామ్ అయితే ఆకర్షణీయమైన పెట్టుబడుల అవకాశాలను ఆఫర్ చేస్తోంది. సినీ నిర్మాణంలో పెట్టుబడులకు వీలు కల్పిస్తోంది. సినిమా విడుదలైన 60/90 రోజుల తర్వాత నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సినీ నిర్మాణ సంస్థలకు ఆదాయం వస్తుంది. మరి అప్పటి వరకు వాటికి నిధుల అవసరం ఎంతో ఉంటుంది కదా. అందుకుని సినీ నిర్మాణ సంస్థలు ఓటీటీ ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి ఇన్వాయిస్లను ఇన్వెస్టర్లకు విక్రయిస్తుంటాయి. ఇక్కడ ఓటీటీ సంస్థలే నేరుగా ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేస్తాయి. వీటి వార్షిక రాబడి 12.18 శాతంగా ఉంది. ఆయా అంశాలు అన్నింటిపై నిపుణుల సలహాలు అవసరం. రిస్క్‌లు ఏమిటంటే.. ఏ పెట్టుబడిలో అయినా రిస్క్ ఉంటుంది. ఈ ఆన్లైన్ వేదికలు రాబడి నుంచి పన్ను మేర తగ్గించి ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేస్తాయి. ఇక ఇన్వెస్టర్లు తమవైపు నుంచి ఎటువంటి పన్ను చెల్లించక్కర్లేదని అవి చెబుతుంటాయి. కానీ, మిగిలిన ప్లాట్‌ఫామ్‌లకు ఈ విషయంలో స్పష్టత లేదు. కనుక ప్లాట్‌ఫామ్‌లు పన్ను కోత అమలు చేస్తే, ఆ మేరకు టీడీఎస్ అడిగి రిటర్నుల్లో చూపించుకోవడం మంచిది. తక్కువ సందర్భాల్లో పెట్టుబడికి కూడా నష్టం ఏర్పడొచ్చు. కాకపోతే ఆయా పెట్టుబడుల అవకాశాలకు సంబంధించి రిస్క్‌ను తాము ముందే విశ్లేషించినట్టు ప్లాట్‌ఫామ్‌లు ఇన్వెస్టర్లకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అదే సమయంలో ఇన్వెస్టర్లకు చెల్లింపులు ఆలస్యం అయినా, ఎగ వేతలు ఏర్పడినా, మోసాలు జరిగినా, తప్పుదోవ పట్టించినా బాధ్యత తీసుకోవు. ఇవి కేవలం ఇరువైపుల వర్గాలను కలిపేందుకు, వారికి సేవలు అందించడానికే పరిమితమవుతుంటాయి. దేనీకి హామీ ఇవ్వవు. కనుక సంప్రదాయ డెట్ పెట్టుబడి సాధనాలకు ఇవి ప్రత్యామ్నాయం కావు. పీపీఎఫ్‌లో 7%, ఎఫ్‌డీల్లో 6–7% మేర రాబడి వస్తుంది. కానీ, వాటిల్లో హామీ ఉంటుంది. ఇన్వాయిస్ ఇన్వెస్టింగ్‌కు ఇటువంటి హామీ ఉండదు. నిధులు ఆశించే సంస్థల పేరు, బ్రాండింగ్ తదితర అంశాల ఆధారంగా రిస్క్‌ను కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. ఆయా సంస్థలకు సంబంధించి గత చరిత్ర ఆధారంగానూ నిర్ణయం తీసుకోవచ్చు. మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటే రిస్క్ ఎదురుకావచ్చు. దీర్ఘకాలానికి ఇన్వాయిస్లపై రుణాలు తీసుకునే సంస్థల విషయంలో ముందుగానే తగినంత అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మూడేళ్లకు పైగా కాలంలో ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మారిపోయే రిస్క్ ఉంటుంది. మూడు నెలల నుంచి ఏడాదిలోపు ఇన్వాయిస్లపై రిస్క్ తక్కువగా ఉంటుంది. -
అక్టోబరు 1 నుంచి ఇ–ఇన్వాయిస్ తప్పనిసరి
న్యూఢిల్లీ: వార్షిక టర్నోవర్ రూ. 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నమోదిత బిజినెస్‌లు బీ2బీ లావాదేవీల కోసం ఇ–ఇన్వాయిస్లను జనరేట్ చేయడం అక్టోబర్ 1 తప్పనిసరని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం రూ. 20 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలు అన్ని బీ2బీ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ను జనరేట్ చేస్తున్నాయి. -
జీఎస్స్టీ నుంచి లబ్ధిపొందేలా వేలకోట్ల ఫేక్ ఇన్వాయిస్లు
జీఎస్స్టీ నుంచి లబ్ధి పొందే వేలకోట్ల ఫేక్ ఇన్వాయిస్లు జారీ చేసిన నిందితుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వస్తు,సేవల పన్ను కింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ప్రయోజనాలను పొందేందుకు రూ.4,521కోట్ల ఫేక్ ఇన్వాయిస్లు జారీ చేసేందుకు సిండికేట్‌ను నిర్వహిస్తున్న ఓ నిందితుణ్ని జీఎస్టీ అధికారులు అరెస్టు చేశారు. ఈ సిండికేట్ ద్వారా 636 సంస్థల ఆడిట్ నిర్వహిస్తున్నట్లు పరిశీలనలో తేలిందని, ఈ సంస్థల్లో కేవలం ఇన్వాయిస్లు మాత్రమే జారీ చేశామని, వాటికి వ్యతిరేకంగా ఎలాంటి వస్తువులను సరఫరా చేయలేదని సిండికేట్ నిర్వహించే సూత్రధారి అంగీకరించారని జీఎస్టీ అధికారులు పేర్కొన్నారు. నిందితులు దాదాపు రూ.4,521 కోట్ల పన్ను విలువతో కూడిన ఇన్వాయిస్లను జారీ చేశారు. ఇందులో దాదాపు రూ. 741 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రభావం ఉందని ప్రకటన పేర్కొంది. విచారణ సమయంలో ఈ సంస్థల ఐటీసీ లెడ్జర్లో అందుబాటులో ఉన్న ఐటీసీని తిరిగి మార్చడం ద్వారా రూ.4.52 కోట్ల జీఎస్టీ జమ చేయబడింది. ఇంకా, ఇప్పటి వరకు, ఈ సంస్థల యొక్క వివిధ బ్యాంకు ఖాతాలలో ఉన్న సుమారు రూ. 7 కోట్లను స్తంభింపజేసినట్లు పేర్కొంది. జనవరి 13న నిందితుల అరెస్ట్ ఈ నకిలీ సంస్థల వెనుక సూత్రధారిని పట్టుకునేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారులు జనవరి 6న ఢిల్లీలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ప్రొప్రైటర్ తన సర్వర్లలో 'క్లౌడ్ స్టోరేజ్' సేవలను వివిధ కస్టమర్లకు వారి ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు తాము గుర్తించిన తెలిపారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న సర్వర్లలో పరిశీలించగా అందులో కొన్ని సంస్థల వివరాలు టాలీ డేటాలో వెలుగులోకి వచ్చాయని సోదా నిర్వహించిన అధికారులు తెలిపినట్లు పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. కోల్‌కతా కేంద్రంగా ఉన్న ఒక సిండికేట్ ఈ ఆడిట్ డేటాను నిర్వహిస్తోందని, దాని తర్వాత జనవరి 10న కోల్‌కతాలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు జీఎస్టీ ఉన్నతాధికారులు వెల్లడించారు. అంతేకాదు నిందితుల నుంచి భారీఎత్తున సిమ్‌కార్డ్‌లు, కుంభకోణాలకు పాల్పడినట్లు గుర్తించిన కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: సీనియర్ సిటిజన్స్ కోసం అదిరిపోయే స్కీమ్, రిస్క్ లేకుండా అధిక వడ్డీతో.. -
నకిలీ ఇన్వాయిస్లతో రూ.18 కోట్లు స్వాహా
సాక్షి, విశాఖపట్నం: నకిలీ ఇన్వాయిస్లతో కోట్లాది రూపాయల జీఎస్టీ క్రెడిట్ కొల్లగొట్టిన వ్యవహారాన్ని విశాఖపట్నం సెంట్రల్ జీఎస్టీ ఎగవేత–నిరోధక విభాగం బట్టబయలు చేసింది. వివరాలు.. విజయవాడకు చెందిన మదన్‌మోహన్‌రెడ్డి అనపర్తి కేంద్రంగా డ్యూడ్రాప్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్, కృష్ణసాయి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీలు నిర్వహిస్తున్నాడు. రెండు కంపెనీలకు వేర్వేరు ఎండీలు, డైరెక్టర్లు ఉన్నప్పటికీ ఒకే చిరునామా ఉండటంతో సెంట్రల్ జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే సోదాలు నిర్వహించగా.. కోట్లాది రూపాయల మోసం బట్టబయలైంది. ఏ వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండా.. వీటిని చెలామణి చేస్తున్నట్లు గుర్తించారు. సెంట్రల్ జీఎస్టీ అదనపు కమిషనర్ ఈదర రవికిరణ్ మాట్లాడుతూ.. నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్లు సృష్టించి ఇన్పుట్ క్రెడిట్ సొంతం చేసుకుంటున్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటివరకు రూ.18 కోట్లకు పైగా జీఎస్టీ క్రెడిట్ బదిలీ అయినట్లు తేలిందన్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి మదన్‌మోహన్‌రెడ్డి సహా ముగ్గుర్ని జీఎస్టీ అధికారులు అరెస్టు చేసి.. విశాఖలోని ఆర్థిక నేరాల కోర్టులో బుధవారం హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించడంతో.. వీరిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
ఇంటర్ చదివి.. 20 ఫేక్ కంపెనీల సృష్టి!
సాక్షి, విశాఖపట్నం: కేవలం ఇంటర్ వరకే చదివిన ఆ యువకుడు చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో పనిచేస్తూ.. జీఎస్టీ లొసుగుల్ని పసిగట్టాడు. అంతే, గుంటూరు, హైదరాబాద్ మొదలైన నగరాల్లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 ఫేక్ కంపెనీలను సృష్టించి.. పన్ను మోసాలకు పాల్పడేందుకు ఎత్తుగడవేశాడు. నిరంతర తనిఖీల్లో భాగంగా విశాఖపట్నంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) అధికారులు ఆ యువకుడి మోసాన్ని బట్టబయలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన 34 ఏళ్ల యువకుడు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో 20 నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి బిల్లులు సృష్టించాడు. ఈ సంస్థల నుంచి దేశంలోని వివిధ నగరాల్లోని కంపెనీలకు సరకు లావాదేవీలు జరిపినట్టు రూ.265 కోట్ల మేర నకిలీ ఇన్వాయిస్లను రూపొందించాడు. వీటిని ఉపయోగించుకుని రూ.31 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ.. పన్నుల చెల్లింపును ఎగవేసేలా వ్యూహాన్ని అమలుపరిచాడు. ఈ భారీ నకిలీ ఇన్వాయిస్లని పరిశీలించిన డీజీజీఐ, సెంట్రల్ జీఎస్టీ వర్గాలు.. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు 20 నకిలీ సంస్థల రాకెట్ గుట్టు రట్టయ్యింది. వెంటనే రంగంలోకి దిగి.. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ విశాఖపట్నం జోనల్ యూనిట్ జాయింట్ డైరెక్టర్ భాస్కరరావు చెప్పారు. గతేడాది నవంబర్ నుంచి ఈ తరహా మోసాలపై దేశవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విశాఖపట్నం జోనల్ యూనిట్ పరిధిలో దాదాపు 180 నకిలీ కంపెనీల గుట్టు రట్టు చేసి రూ.60 కోట్లు రికవరీ చేయడంతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు భాస్కరరావు చెప్పారు. -
‘ఆహార’ బిల్లుల్లో లైసెన్స్ నంబరు తప్పనిసరి
న్యూఢిల్లీ: ఆహార వ్యాపార సంస్థలు ఇకపై తమ ఇన్వాయిస్లు, బిల్లుల్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు నంబరు లేదా రిజిస్ట్రేషన్ నంబరును తప్పనిసరిగా పొందుపర్చాల్సి ఉంటుంది. అక్టోబర్ 2 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట సమాచారం లేకపోవడం వల్ల చాలా మటుకు ఫిర్యాదులు అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. తాజా పరిణామంతో నిర్దిష్ట ఎఫ్ఎస్ఎస్ఏఐ సంఖ్యతో ఆహార వ్యాపార సంస్థపై వినియోగదారులు ఆన్లైన్లో ఫిర్యాదు చేయడానికి వీలవుతుందని తెలిపింది. ‘‘లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్ అధికారులు ఈ విషయానికి విస్తృతంగా ప్రచారం కల్పించాలి. అక్టోబర్ 2 నుంచి కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి’’ అని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. ఆహార వ్యాపార వ్యవస్థ చాలా భారీగా ఉంటుందని, ఆపరేటర్లకు కేటాయించే 14 అంకెల ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబరు అంత సులభంగా కనిపించకపోవచ్చని, అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపింది. ఫలితంగా పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలంటే వినియోగదారుకు చాలా కష్టసాధ్యంగా ఉంటుందని పేర్కొంది. నియంత్రణ సంస్థలు సైతం సదరు ఫిర్యాదు మూలాలను గుర్తించి, సత్వరం పరిష్కరించడానికి సాధ్యపడటం లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ప్రస్తుతం ప్యాకేజ్డ్ ఆహార ఉత్ప్తతులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబరును తప్పనిసరిగా ముద్రించాల్సి ఉంటున్నప్పటికీ.. రెస్టారెంట్లు, మిఠాయి షాపులు, కేటరర్లు, రిటైల్ స్టోర్స్ వంటివి పాటించడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ప్రభుత్వ కళ్లు గప్పి రూ.110 కోట్లకు టోకరా
పుణె: లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రభుత్వానికి ఏకంగా వందల కోట్ల మేర టోకరా వేసేందుకు ప్రయత్నించిన వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. వస్తు సేవల (జీఎస్టీ) అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. రూ.110 కోట్ల విలువైన బోగస్ ఇన్వాయిస్లు జారీ చేసిన పుణేకు చెందిన వ్యాపారవేత్త బాబుషా శ్రణప్ప కస్బేను మహారాష్ట్ర వస్తు సేవల అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఈనెల 25వ తేదీ వరకూ జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. కస్బే రూ 16.86 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్‌ను ఎలాంటి సరుకు, సేవలను డెలివరీ చేయకుండానే గుర్తింపు పొందిన సంస్థల ఖాతాలకు మళ్లించాడు. ఇది గుర్తించిన మహారాష్ట్ర వస్తు, సేవల చట్టం, కేంద్ర వస్తు సేవల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా అతడి కదలికలను గమనించి మంగళవారం కస్బేను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం పుణేలోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. -
నకిలీ ఇన్వాయిస్లతో రూ.700 కోట్ల మోసం
పుణె: నకిలీ జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) ఇన్వాయిస్లతో భారీ మోసానికి పాల్పడిన ముఠా గుట్టు రట్టయ్యింది. ఈ కేసుకు సంబంధించి పుణెలో ఇద్దరు అరెస్టయ్యారు. పుణె నగరానికి చెందిన రిలయబుల్ మల్టీట్రేడింగ్, హిమాలయా ట్రేడ్‌లింక్స్ సంస్థలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్ చేసుకునేందుకు రూ.700 కోట్ల విలువ చేసే నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్లు జారీ చేసినట్లు కేంద్రీయ వస్తు, సేవల పన్నుల (సీజీఎస్టీ) విభాగం గుర్తించింది. -
జీఎస్టీ... బిజినెస్ షురూ!
♦ ఇన్వాయిస్లు, రిటర్న్లకే ఏటా రూ.20వేల కోట్లు ♦ ఐటీ సంస్థలు, ట్యాక్స్ కన్సల్టెంట్లకు కొత్త అవకాశాలు ♦ సొల్యూషన్లతో రంగంలోకి 34 మంది సువిధ ప్రొవైడర్లు ♦ సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ఐటీ; శాప్, ఒరాకిల్ నిపుణులకు గిరాకీ ♦ 3 నెలల్లో లక్షకు పైగా ఉద్యోగుల అవసరముంటుందని అంచనా ♦ జీఎస్టీ ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులతో స్టార్టప్స్ రంగంలోకి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎస్టీగా పిలుస్తున్న వస్తు సేవల పన్ను శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రాబోతోంది. కొన్నింటి ధరలు పెరుగుతున్నాయి.. మరిక్నొం టివి తగ్గుతున్నాయి. రోజువారీ అవసరమయ్యే సేవలు, వస్తువుల రేట్లు పెరుగుతుండటంతో మొత్తమ్మీద జీఎస్టీతో సామాన్యులకు భారమేనన్నది అత్యధికుల మాట. సామాన్యులకే కాదు!! చిన్న చిన్న వ్యాపారాలకు, మధ్య స్థాయి కంపెనీలక్కూడా ఇది భారమే. ఎందుకంటే పన్నుల నిర్వహణకు, ఐటీకి వారు పెట్టాల్సిన ఖర్చు పెరగబోతోంది. ఈ ఖర్చు... రూ.20వేల కోట్ల వ్యాపారాన్ని కూడా సృష్టిస్తోంది మరి!!: జీఎస్టీ సాఫ్ట్వేర్ విక్రయించడానికి, ఐటీ సేవలందించడానికి 34 సంస్థలు సిద్ధమయ్యాయి. జీఎస్టీ లావాదేవీలు, పన్ను చెల్లింపుల నిర్వహణ సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ఇప్పటికే పలు కంపెనీలు నిమగ్నమయ్యాయి. గ్రామాల్లోని చిన్న చిన్న వ్యాపారాలూ జీఎస్టీ పరిధిలోకి వస్తుండటంతో వాటికి సేవలందించటానికి స్థానిక యువత శిక్షణకు వెళుతున్నారు. పలు సంస్థలు ఇప్పటికే జీఎస్టీ శిక్షణ కోర్సులు మొదలెట్టగా... ఇంకొన్ని ఆన్లైన్ కోర్సులు కూడా ఆరంభించేశాయి. ఇదీ... జీఎస్టీ చుట్టూ అల్లుకున్న కొత్త వ్యాపార ప్రపంచం. అసలు జీఎస్‌పీలు ఏం చేస్తాయి? జీఎస్పీ... అంటే జీఎస్టీ సువిధ ప్రొవైడర్లు. ఇవి పన్ను రిజిస్ట్రేషన్, చెల్లింపులకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి, దాన్ని థర్డ్ పార్టీ పన్ను చెల్లింపుదారులకు, ట్యాక్స్ కన్సల్టెంట్లకు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు విక్రయిస్తాయి. వ్యాపారుల నమోదు, క్రయవిక్రయాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ పొందుపర్చడం, ప్రతి నెలా, వార్షిక పన్ను రిటర్ను దాఖలు చేయటం కూడా వీటిపని. సువిధ ప్రొవైడర్లలో ఒకటైన టాలీ సొల్యూషన్స్.. ‘టాలీ.ఈఆర్పీ9 రీలీజ్ 6’ జీఎస్టీ సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేసింది. జీఎస్టీ కన్నా ముందు 11 లక్షల మంది యూజర్లున్న తమకు.. జీఎస్టీ సాఫ్ట్‌వేర్‌తో సబ్స్క్రిప్షన్ 6 రెట్లు పెరిగినట్లు కంపెనీ చెబుతోంది. మరో సువిధ ప్రొవైడర్ జోహో.. చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ‘జోహో ఫైనాన్స్ ప్లస్’ను విడుదల చేసింది. 10 వేల మంది వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నామని కంపెనీ చెబుతోంది. మరో జీఎస్పీ ట్యాక్స్‌మాన్..‘‘వన్ సొల్యూషన్’’ పేరిట సాఫ్ట్‌వేర్‌ను తెచ్చింది. అప్లికేషన్ సేవలందించేవారు కూడా... జీఎస్పీలే కాకుండా క్లియర్ ట్యాక్స్, జెనిసిస్ వంటి అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడర్లూ (ఏఎస్పీ) జీఎస్టీ వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇవి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ) సాఫ్ట్వేర్లను ఆధారం చేసుకొని పన్ను చెల్లింపుదారుల క్రయ విక్రయాల డేటాను సేకరించి... జీఎస్టీ రిటర్న్‌కు బదలాయించి పన్నులు దాఖలు చేస్తాయి. వీటి ధరలు రూ.2,700 నుంచి ఉన్నాయి. జీఎస్టీ సాఫ్ట్వేర్ ధర రూ.18–54 వేలు! జీఎస్టీ సాఫ్ట్వేర్ ధరలు సేవలను బట్టి మారుతున్నాయి. ‘‘ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్), ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్), ఆడిట్ రిపోర్ట్, జీఎస్టీ వంటివన్నీ ఉంటే ఏడాదికి రూ.19 వేలు చార్జీ ఉంటుంది. కేవలం వన్ సొల్యూషన్కైతే ఏడాదికి రూ.8,500’’ అని ట్యాక్స్‌మాన్ సీఈఓ పీయూష్ కుమార్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. 125 మంది ఐటీ నిపుణులు, 9 నెలలు శ్రమించి ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారని.. ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, బీమా సంస్థలు కొనుగోలు చేశాయని చెప్పారు. జీఎస్టీ సాఫ్ట్‌వేర్‌తో పాటు ఉత్పత్తుల క్రయ విక్రయాల బిల్లింగ్ సాఫ్ట్వేర్, చెల్లింపుల సాఫ్ట్వేర్, పరిష్కారాలు, ఈ–సంతకాల వంటి వాటికైతే రూ.54 వేల వరకూ చార్జీ ఉంటుందని ఓ ఐటీ కంపెనీ ప్రతినిధి చెప్పారు. అలా కాకుండా ఒక యూజర్‌కు వార్షిక సబ్‌స్క్రిప్షన్‌కు రూ.3,600, అంతకంటే ఎక్కువ యూజర్లకైతే రూ.10,800 అని చెప్పారు. ఒక్క ఇన్వాయిస్కు 49 పైసలు నుంచి రూపాయి వరకు చార్జీ, నెలకు ఒక్క రిటర్న్ దాఖలుకు రూ.100–200 చార్జీలున్నాయి. ఎంపికైన జీఎస్పీ సంస్థలివే..: అలంకిత్, బోధ్‌ట్రీ, సీడీఎస్ఎల్ ఇండియా, బో«ద్ట్రీ, సీఏఎంఎస్ ఆన్లైన్, సైజెంట్ ఇన్ఫోటెక్, డెలాయిట్, ఈవై, ఎక్సెలాన్ సాఫ్ట్వేర్, గోఫ్రూగల్, ఐరిస్, కార్వీ, మాస్టెక్, మాస్టర్స్ ఇండియా, మైండ్ ఇన్ఫోటెక్, ఎన్ఎస్డీఎల్, రామ్‌కో, శేషసాయి, ఎస్ఐఎస్ఎల్ ఇన్ఫోటెక్, స్కిల్రాక్, స్పేస్ డిజిటల్, టాలీ సొల్యూషన్స్, టీసీఎస్, ట్యాక్స్‌మాన్, టెరా సాఫ్ట్వేర్, ట్రస్ట్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్, వయానా, వెలోసిస్, వెర్టెక్స్ గ్రూప్, వెప్ ఇండియా. ఆన్లైన్లో జీఎస్టీ కోర్సులు.. ఆన్లైన్పన్ను చెల్లింపు సేవలు, సీఏ శిక్షణ సంస్థలు కొన్ని జీఎస్టీ వేదికగా సర్టిఫికెట్ కోర్సులను తెచ్చాయి. బెంగళూరుకు చెందిన ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్స్, ఎంటర్ప్రైజ్ సర్వీస్ ప్రొవైడర్ క్లియర్ ట్యాక్స్, సీఏ శిక్షణ సంస్థ హైర్గ్యాంగీ అకాడమీతో కలిసి జీఎస్టీ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఈ–లెర్నింగ్ కోర్సులను ప్రవేశపెట్టింది. ట్యాక్స్మంత్ర, సీఏక్లబ్ఇండియా.కామ్‌తో కలిసి బిజినెస్, ప్రొఫెషనల్స్ కోసం జీఎస్టీ సర్టిఫికేషన్ కోర్సును రూపొందించింది. ‘‘ఈ–లెర్నింగ్ కోర్సులు తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ వంటి 20 ప్రాంతీయ భాషల్లోనూ లభిస్తాయి. కోర్సుల ధర రూ.3 వేలు’’ అని సంస్థ సీఈఓ అర్చిత్ గుప్తా తెలిపారు. ఇప్పటికే లాంగ్ టర్మ్ కోర్సులో 20 వేల మంది సీఏలు, ట్యాక్స్ కన్సల్టెంట్లు నమోదయ్యారని తెలిపారు. కళ్లు తిరిగే గణాంకాలు... ప్రస్తుతం దేశంలో నెలకు 300 కోట్ల ఇన్వాయిస్లు అప్లోడ్ అవుతున్నాయి. ఒక్క ఇన్వాయిస్కు రూ.1 చార్జీ చేసినా.. నెలకు రూ.300 కోట్లు! ఏటా రూ.3,600 కోట్లు. ఇక రిటర్న్‌లు చూస్తే.. ఒక రాష్ట్రంలో ఒక్కో సంస్థ నెలవారీ 3, వార్షికంగా 1 చొప్పున ఏటా 37 రిటన్స్ వేయాలి. జీఎస్టీలో నమోదైన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 80 లక్షలు. ప్రతి సంస్థా సగటున 5 రాష్ట్రాల్లో సేవలందిస్తుందనుకుంటే... 80 లక్షలు (ఇంటు) 5=4 కోట్లు. అంటే ఏడాదికి 148 కోట్ల రిటర్న్‌లు. ఒకో రిటర్న్‌కు రూ.100 చార్జీ చేసినా.. రూ.14,800 కోట్ల వ్యాపారం. జోరుగా కొత్త ఉద్యోగాలు! జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనేది నిపుణుల అంచనా. ‘‘మొదటి త్రైమాసికంలో సుమారు లక్ష కొత్త ఉద్యోగుల అవసరం ఉంటుంది. తర్వాత మరో 50–60 వేల ఉద్యోగాలు కూడా వస్తాయి’’ అని గ్లోబల్ ఓసియన్ గ్రూప్ ఎండీ బ్రిజేశ్ లోహియా చెప్పారు. ట్యాక్స్ కన్సల్టింగ్, అకౌంటింగ్, డేటా అనాలిసిస్, కంపెనీ అకౌంట్స్, ట్యాక్సేషన్ విభాగాల్లో వీరి అవసరముంటుందని.. ఆయా విభాగాల్లో 10–13 శాతం వార్షిక వృద్ధి రేటు కూడా ఉంటుందని చెప్పారాయన. ♦ జీఎస్టీకి సంబంధించి వివిధ సాఫ్ట్వేర్ల తయారీలో కంపెనీలు నిమగ్నమవటంతో ఐటీ సంస్థల్లో ఉద్యోగుల అవసరం ఏర్పడిందని ఓ కంపెనీ ప్రతినిధి చెప్పా రు. ముఖ్యంగా ఎస్ఏపీ, ఒరాకిల్ వంటి టెక్నాలజీ నిపుణులకు అపార అవకాశాలున్నాయని చెప్పారాయ న. త్వరలోనే డెలాయిట్ 250 మంది పరోక్ష పన్ను కన్సల్టెంట్లను, పీడబ్ల్యూసీ 200–250 సీఏ, సిస్టమ్ ఎగ్జిక్యూటివ్‌లనూ నియమించుకోనుందని తెలిపారు. ♦ జీఎస్టీ పరిధిలోకి వచ్చిన 80లక్షల మందిలో 80 శాతం చిన్న, మధ్య తరహా సంస్థలే(ఎస్ఎంఈ). ‘‘నిరక్షరాస్యత, ఆన్లైన్ అలవాటు లేకపోవటం వంటి కారణాల వల్ల స్థానికంగా ఉండే యువతకు, కంప్యూటర్ మీద పట్టు, పన్ను చెల్లింపుల్లో అవగాహన ఉన్న వారికి ఉపాధి దొరుకుతుంది’’ అని పీయూష్ కుమార్ చెప్పా రు. చాలా కంపెనీలు జీఎస్టీ నిర్వహణ కోసం థర్డ్‌పార్టీ మీద ఆధారపడతాయి. దీంతో ఆయా సంస్థల్లోనూ డేటాఎంట్రీ, పన్ను చెల్లింపుల నిర్వహణకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలుంటాయని తెలియజేశారు.