
న్యూఢిల్లీ: రూపాయి మారకంలోనే ఇన్‌వాయిసింగ్, చెల్లింపులు, ఎగుమతుల, దిగుమతుల సెటిల్ మెంట్‌లకు అనుమతిస్తూ వాణిజ్య శాఖ నిర్ణయం తీసుకుంది. రూపాయి మారకంలో వాణిజ్య నిర్వహణకు ఆసక్తి పెరగడంతో.. ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలకు వీలుగా అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్‌బీఐ ఈ ఏడాది జూలైలోనే బ్యాంకులను కోరడం గమనార్హం. ఆర్‌బీఐ నిర్ణయానికి అనుగుణంగా విదేశీ వాణిజ్య విధానంలో కొత్త పారాగ్రాఫ్‌ను చేర్చినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment