amend rules
-
త్వరలో ఎన్నికలు.. జమ్ము-కశ్మీర్ చట్టంలో సవరణలు
ఢిల్లీ: జమ్ము-కశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము-కశ్మీర్ లెఫ్ట్నెట్ గవర్నర్(ఎల్జీ) అధికారాలను పెంచే చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే జమ్ము-కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019లోని పలు నిబంధనలను తాజాగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ సవరించింది.అయితే ఈ సవరణల వల్ల జమ్ము కశ్మీర్ ఎల్జీ అధికారాలు మరింత పెరుగనున్నాయి. జమ్ము- కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లో అధికారాలను అమలు చేసే సెక్షన్ 55 నిబంధనలో తీసుకువచ్చిన పలు సవరణలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వానికి సంబంధిచిన వ్యాపార లావాదేవీలను సవరించడానికి రాష్ట్రపతి మరిన్ని నిబంధనలను రూపొందించినట్లు నోటిఫికేషన్లో పేర్కొంది.తాజాగా సవరించిన చట్టం.. జమ్ము- కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రెండో సవరణ. ఈ సవరించిన నిబంధనల ద్వారా శాంతి భద్రతల చర్యలకు సంబంధించి పూర్తి అధికారాలు ఇక నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోనే ఉండనున్నాయి. అయితే ఈ చట్టం అమలులోకి వచ్చిన మొదట్లో పోలీసు, పబ్లిక్ ఆర్డర్, ఆల్ ఇండియా సర్వీస్, అవినీతి నిరోధక బ్యూరోకు సంబంధించి అధికారాలను అమలు చేయడానికి ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోవాల్సి అవసరం ఉండేది. కానీ కొత్త సవరణ చట్ట నియమాల్లో పొందుపర్చిన సబ్ రూల్ (2ఎ) ప్రకారం.. ఇక నుంచి ఆర్థికశాఖ అనుమంతి తీసుకోవాల్సిన అవసరం లేదు. పోలీసు, యాంటీ కరప్షన్ బ్యూరో, ఆల్ ఇండియా సర్వీసులకు సంబంధించిన ప్రతిపానదలను చీఫ్ సెక్రటరీ.. ఎల్జీ ముందు తీసుకెవెళ్లితే.. ఎల్జీ ప్రతిపాదనలను అంగీకరించే లేదా తిరస్కరించే అధికారం లభించింది.చట్టంలోని ప్రధాన నిబంధనల్లో కొత్తగా 42(ఎ)ను హోం మంత్రిత్వశాఖ చేర్చింది.ఈ నిబంధన ప్రకారం.. సీఎంకు న్యాయ వ్యవహారాల్లో ఎలాంటి అధికారం ఉండదు. అడ్వకేట్ జనరల్‌తోపాటు ఇతర న్యాయ అధికారుల నియమకానికి చీఫ్ సెక్రటరీతో పాటు సీఎం.. ఎల్జీ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. అదేవిధంగా 42 బీ నిబంధనం ప్రకారం.. ప్రాసిక్యూషన్ మంజూరు లేదా అప్పీల్‌కు దాఖలకు సంబంధించిన ఏదైనా ప్రతిపాదనను న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ద్వారా చీఫ్ సెక్రటరీ ఎల్జీకి పంపిస్తారని హోం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. -
రూపీలోనే ఇన్వాయిస్, చెల్లింపులు, భారీ ఊరట
న్యూఢిల్లీ: రూపాయి మారకంలోనే ఇన్వాయిసింగ్, చెల్లింపులు, ఎగుమతుల, దిగుమతుల సెటిల్ మెంట్లకు అనుమతిస్తూ వాణిజ్య శాఖ నిర్ణయం తీసుకుంది. రూపాయి మారకంలో వాణిజ్య నిర్వహణకు ఆసక్తి పెరగడంతో.. ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలకు వీలుగా అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్బీఐ ఈ ఏడాది జూలైలోనే బ్యాంకులను కోరడం గమనార్హం. ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా విదేశీ వాణిజ్య విధానంలో కొత్త పారాగ్రాఫ్‌ను చేర్చినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ప్రకటించింది. -
జూన్11న జీఎస్టీ కౌన్సిల్ తుది భేటీ
న్యూఢిల్లీ: జూలై 1వ తేదీ నుంచి ప్రతిష్టాత్మక జీఎస్టీ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మరోసారి పునరుద్ఘాటించారు. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్ తుది సమావేశం జూన్ 11న తేదీన నిర్వహించనున్నట్టు శుక్రవారం చెప్పారు. బహుశా ఇది చివరి భేటీ అవుతుందన్నారు. పలు వర్గాల నుంచి వచ్చిన సూచనలు, అసంతృప్తులను దృష్టిలో ఉంచుకుని ఆదివారం జరిగే కౌన్సిల్ సమావేశంలో సమీక్షించనున్నట్టు తెలిపారు. జూన్ 3వ తేదీన జరిగిన 15వ సమావేశంలో సభ్యులు సూచించిన సవరణలు, జీఎస్టీ డ్రాఫ్ట్ రూల్స్, రేటు సవరణలను 16వ సమావేశంలో ప్రధానంగా చర్చించి అంగీకారం తెలపనున్నట్లు చెప్పారు. దీంతో పాటు వివిధ పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చిన వినతులపై కూడా కౌన్సిల్ చర్చిస్తుందన్నారు. మరోవైపు తమపై విధించిన జీఎస్టీ రేటుపై సమీక్షించాల్సిందిగా ఆటో పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేశాయి. మధ్యశ్రేణి నుంచి లార్జ్ సైజ్ హైబ్రిడ్ కార్లపై విధించే 43 శాతం పన్నును సమీక్షించాల్సిందిగా కోరాయి. ఈ పన్ను రేటు ప్రస్తుతం 30.3 శాతంగా ఉంది. అదేవిధంగా టెలికాం సెక్టార్ సైతం తమపై 18 శాతంగా ఉన్న పన్నును సమీక్షించాల్సిందిగా కోరింది. అలాగే సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా( సీవోఏఐ ) కూడా ఇప్పటికే రెవెన్యూ సెక్రటరీకి ఈ మేరకు ఓ లేఖ కూడా రాసింది. ఐటీ హార్డ్‌వేర్ పరిశ్రమ సైతం ఐటీ ఉత్పత్తులు మానిటర్లు, ప్రింటర్లులాంటి కొన్ని అంశాలకు ప్రతిపాదించిన 28 శాతం బదులుగా ఏకరూప పన్ను విధానం తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. కాగా జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటికే దాదాపు అన్ని వస్తు, సేవలపై పన్నులను నిర్ణయించింది. వివిధ రకాల వస్తువులపై 5, 12, 18, 28 శాతంగా పన్నులను ఖరారు చేసింది. విలువైన లోహాలు, బంగారు నాణేలు , అనుకరణ ఆభరణాలు, బంగారంపై 3శాతం శ్లాబ్‌ను నిర్ణయించింది. ముడి డైమండ్లపై 0.25శాతం పన్ను రేటును విధించిన విషయం తెలిసిందే.