Chandrayaan-3: ISRO Chief S Somanath Clarification On Mysterious Metal Dome On Australian Beach - Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా బీచ్‌లో చంద్రయాన్‌-3 రాకెట్‌ శకలం.. ఇస్రో చీఫ్‌ క్లారిటీ

Published Wed, Jul 19 2023 7:05 PM | Last Updated on Wed, Jul 19 2023 7:38 PM

Isro Chief Clarification On Mysterious Metal Dome On Australian Beach - Sakshi

ఆస్ట్రేలియా బీచ్‌లో సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకువచ్చిన శకలం ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. అంతేకాకుండా దీనిపై ఓ వార్త కూడా హల్‌చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ శకలాలు చంద్రయాన్‌-3 ప్రయోగానికి సంబంధించిన ఎల్వీఎం రాకెట్‌వని అంతా భావిస్తున్నారు. అయితే తీరంలో కనిపించిన రాకెట్‌ శకలంపై తాజాగా ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ స్పందించారు.

తాము ఆ శకలాన్ని పరిశీలించకుండా అది తమదా కాదా అనేది చెప్పలేమన్నారు. అయితే ఆ శకలం మాత్రం కచ్చితంగా రాకెట్‌దేనని స్పష్టం చేశారు. మరో విషయం ఏమిటంటే.. అది భారత్‌ చెందిన రాకెట్‌ది కావచ్చు.. కాకపోవచ్చు అని సోమనాథ్‌ అభిప్రాయపడ్డారు. కాగా పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో అకస్మాత్తుగా రాకెట్‌ శకలాలకు సంబంధించిన వస్తువులా ఒకటి దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.

అంతకు మందు భారత్‌ చంద్రయాన్‌-3ను ఎల్వీఎం రాకెట్‌ నింగిలోకి మోసుకెళ్లిన దృశ్యాలు ఆస్ట్రేలియన్ గగనతలంలో కనిపించడంతో ఇది చంద్రయాన్‌కు సంబంధించినది వస్తువు అయ్యిండచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయంలో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా భారతీయ అంతరిక్ష సంస్థ క్లారిటీ ఇచ్చింది.

చదవండి   భర్తతో విడాకులు, ఇన్‌స్టా పరిచయం ప్రేమగా.. పలుమార్లు కలుసుకుని.. ఇప్పుడు ఏకంగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement