వెంకటమణిదీప్ (ఫైల్)
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ మైనర్ విద్యార్థి మృతి చెందిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. 15 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం రాయలసీమ ప్రాంతం నుంచి వెంకటరామయ్య, అరుణ దంపతులు ఓల్డ్ కర్నూల్ రోడ్డు నేతాజీనగర్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. మేస్త్రీ పని చేస్తున్న వెంకటరామయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు వెంకటమణిదీప్ (14) స్థానిక ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.
గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న మణిదీప్ పెరుగు తీసుకురావాలని ఇంట్లో చెప్పడంతో తండ్రి యాక్టివా వాహనాన్ని తీసుకుని వెళ్లాడు. పెరుగు తీసుకుని ఇంటికి వస్తున్న క్రమంలో నేతాజీనగర్‌లోని రోడ్డు డివైడర్‌కు ఢీకొని పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి తగిలి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తెలివైన విద్యార్థిగా ఆటపాటలలో ముందుండే వాడని ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల యాజమాన్యం వెంకటమణిదీప్ మృతికి సంతాపం తెలిపి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు.
చదవండి: హైదరాబాద్: కుమారుడికి చిత్రహింసలు ... కాదు కిడ్నాప్ !
Comments
Please login to add a commentAdd a comment