
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, రాజేంద్రనగర్: మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్లున్న ఓ లారీ వెనుక నుంచి ముగ్గరు వ్యక్తిలను ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సైబరాబాద్ అడిషనల్ డీసీపీ వెంకట్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.