lorry collided
-
మైలార్‌దేవ్‌పల్లిలో లారీ బీభత్సం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మైలార్ దేవ్పల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మృతుడు అత్తాపూర్‌కు చెందిన రాజుగా గుర్తించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.అత్తాపూర్ నుండి మోటార్ సైకిల్ పై చంద్రాయన్ గుట్ట వైపు రాజు అతని స్నేహితుడు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దుర్గా నగర్ చౌరస్తా వద్దకు రాగానే ముందు వెళ్తున్న బైక్‌ను లారీ ఢీకొట్టింది. గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం -
స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ
ఎడ్లపాడు(గుంటూరు): స్కూల్ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం సమీపంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌పాఠశాల బస్సు విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా, ఎదురుగా వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
లారీని ఢీకొట్టిన బస్సు : పలువురికి గాయాలు
కేతేపల్లి : నల్లగొండ జిల్లాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కేతేపల్లి సమీపంలో వేగంగా వెళ్తున్న గరుడ బస్సు లారీని ఢీనడంతో పలువురికి గాయాలయ్యాయి. ఏపీకి చెందిన గరుడ బస్సు హైదరాబాద్ వస్తున్న క్రమంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్‌తో పాటు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. -
తమిళనాడులో రోడ్డుప్రమాదం : 9 మంది మృతి
చెన్నై: తమిళనాడులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడిక్కడే మృతిచెందారు. తూత్తుకుడి సమీపంలో ఆగి ఉన్న వ్యానును వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. వ్యానులోని 9 మంది ప్రయాణికులు మృతి చెందగా 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఓ చిన్నారి సహా నలుగురు మహిళలు ఉన్నారు. మృతుల వివరాలతో పాటు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
లారీ బోల్తా : ఒకరి మృతి
ప్రత్తిపాడు: తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న మేకల లారీ అదుపు తప్పి ప్రత్తిపాడు జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. -
బైక్‌ను ఢీకొట్టిన లారీ : ఇద్దరి దుర్మరణం
హిందూపురం: అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. హిందూపురం మండలం కొత్నూరు గ్రామ సమీపంలో వేగంగా వెళ్తున్న లారీ, బైక్‌ను ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అనంతపురం నుంచి హిందూపురం బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు పరిగి మండలం గొల్లపల్లికి చెందిన హనుమంతరాయుడు(19), తిప్పన్న(38)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టైరు మారుస్తుండగా..
లారీ ఢీకొని డ్రైవర్ మృతి రంగారెడ్డి జిల్లా పెద్దగోల్కొండ ఔటర్‌పై ప్రమాదం శంషాబాద్ రూరల్: ట్రక్కు టైరు మారుస్తుండగా పక్క నుంచి వచ్చిన లారీ ఢీకొని డ్రైవర్ దుర్మరణం చెందాడు. ట్రక్కు క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఔటర్‌పై పెద్దగోల్కొండ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి బొగ్గు లోడుతో ఓ ట్రక్కు మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు వెళుతోంది. ఔటర్ మార్గంలో వస్తుండగా.. శుక్రవారం తెల్లవారుజామున పెద్దగోల్కొండ సమీపంలోకి రాగానే ట్రక్కు కుడి వైపు టైర్ పంక్చర్ అయింది. ట్రక్కును రోడ్డు పక్కన ఆపిన డ్రైవర్ శ్రీనివాస్‌రావు (48), క్లీనర్ నర్సింహారావుతో కలసి టైరు మారుస్తున్నాడు. అదే సమయంలో పక్కనుంచి వచ్చిన వాహనం ఇద్దరినీ ఢీకొంది. తీవ్రగాయాలైన శ్రీనివాస్‌రావు అక్కడికక్కడే మృతిచెందగా, క్లీనర్‌కు గాయాలయ్యాయి. మృతుడు శ్రీనివాస్‌రావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు. ఇతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. మృతదేహానికి శంషాబాద్ క్లస్టర్ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
లారీ ఢీ కొని వ్యక్తి మృతి
గూడూరు(నెల్లూరు జిల్లా): వేగంగా వెళ్తున్న లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నెల్లూరు జిల్లా గూడూరు మండలం పోడ్‌పాలెం సర్కిల్ సమీపంలో జరిగింది. వివరాలు.. గూడూరు మండలం రాణిపేట గ్రామానికి చెందిన బండి లక్ష్మయ్య (65) వాటర్ ప్లాంట్‌లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా వేగంగా వస్తున్న లారీ తన టీవీఎస్ ఎక్సైల్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.