టైరు మారుస్తుండగా.. | Lorry hit the driver killed | Sakshi
Sakshi News home page

టైరు మారుస్తుండగా..

Published Sat, Jan 30 2016 4:41 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

టైరు మారుస్తుండగా.. - Sakshi

టైరు మారుస్తుండగా..

లారీ ఢీకొని డ్రైవర్ మృతి
రంగారెడ్డి జిల్లా పెద్దగోల్కొండ ఔటర్‌పై ప్రమాదం

 
 శంషాబాద్ రూరల్: ట్రక్కు టైరు మారుస్తుండగా పక్క నుంచి వచ్చిన లారీ ఢీకొని డ్రైవర్ దుర్మరణం చెందాడు. ట్రక్కు క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఔటర్‌పై పెద్దగోల్కొండ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి బొగ్గు లోడుతో ఓ ట్రక్కు మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు వెళుతోంది. ఔటర్ మార్గంలో వస్తుండగా.. శుక్రవారం తెల్లవారుజామున పెద్దగోల్కొండ సమీపంలోకి రాగానే ట్రక్కు కుడి వైపు టైర్ పంక్చర్ అయింది.

ట్రక్కును రోడ్డు పక్కన ఆపిన డ్రైవర్ శ్రీనివాస్‌రావు (48), క్లీనర్ నర్సింహారావుతో కలసి టైరు మారుస్తున్నాడు. అదే సమయంలో పక్కనుంచి వచ్చిన వాహనం ఇద్దరినీ ఢీకొంది. తీవ్రగాయాలైన శ్రీనివాస్‌రావు అక్కడికక్కడే మృతిచెందగా, క్లీనర్‌కు గాయాలయ్యాయి. మృతుడు శ్రీనివాస్‌రావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు. ఇతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. మృతదేహానికి శంషాబాద్ క్లస్టర్ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement