స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ
Published Wed, Mar 8 2017 12:00 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
ఎడ్లపాడు(గుంటూరు): స్కూల్ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం సమీపంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్పాఠశాల బస్సు విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా, ఎదురుగా వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement