లక్సెట్టిపేట (ఆదిలాబాద్) : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం శాంతాపూర్ గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో గుడిపేట గ్రామానికి చెందిన అశోక్ కుమార్(28) మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చెట్టును ఢీకొన్న కారు: వ్యక్తి మృతి
Published Sun, Oct 25 2015 10:45 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement