
ముంబయి : మహారాష్ట్ర ముంబయిలోని బీవండిలో శుక్రవారం ఉదయం ఓ మూడంతస్తుల భవనం హఠాత్తుగా కుప్పకూలింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. మరోవైపు పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ఢిల్లీలోని తైమూర్ నగర్‌లో ఓ భవనం కుప్పకూలింది. అయితే ఎవరికి గాయాలు కాలేదు.